రీల్‌లైఫ్ రాణులు


Sun,November 17, 2019 01:32 AM

చరిత్ర తవ్వి చూడాలేగానీ.. మన దేశాన్ని ఏలిన వారిలో రాజులకు ధీటుగా ఎంతో మంది మహారాణులు కూడా ఉన్నారు. పురుషాధిక్యం విజయ బావుటా ఎగురవేసిన ఆ రాణులు నేడు.. పురుషాధిక్యం ఎక్కువగా ఉండే వెండితెరపై కూడా విజయ బావుటా ఎగురవేస్తున్నారు. తాజాగా బాలీవుడ్‌లో పానిపట్ చిత్రంలో రాణి పార్వతీబాయిగా కృతిసనన్ కనిపించనున్నది.

-వనజ వనిపెంట

పార్వతీబాయి..

-18వ శతాబ్దంలో ఆఫ్ఘాన్, మరాఠాలకు మధ్య జరిగిన మూడో పానిపట్టు యుద్ధం ఆధారంగా పానిపట్ చిత్రం తెరకెక్కనున్నది. ఈ సినిమాలో మరాఠా రాణి పార్వతిబాయిగా కృతిసనన్ కనిపించనున్నది.
-ముక్కుపుడక, బంగారు ఆభరణాలు ధరించి రాచరికపు వస్త్రధారణలో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నది. నిజమైన రాణికి కిరీటం అవసరం లేదు అనే వ్యాఖ్యను జోడించారు.
-కృతిసనన్ టాలివుడ్‌లో 1 (నేనొక్కడినే)లో మహేశ్‌బాబుతో నటించింది. తర్వాత దోచేయ్‌తో టాలివుడ్‌లో అభిమానులను సొంతం చేసుకున్నది.
-సినిమాల కంటే ముందు దేశంలోని అతిపెద్ద బ్రాండ్స్‌కు మోడలింగ్ చేసింది. అవేంటంటే.. అమూల్ ఐస్‌క్రీమ్, క్లోజప్, క్యాడ్బరీ, హోండా బ్రీయో, హిమాలయా ఆయిల్ బ్యాలెన్సింగ్ ఫేస్‌వాష్ జెల్, వివెల్, ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్, శామ్సంగ్ హీరో, కాయా స్కిన్ క్లినిక్, రిలైన్స్ ట్రెండ్స్ యాడ్స్‌లో కనిపించింది.
Queens

పద్మావతి

-పద్మావతి అపురూప అందగత్తె. చిత్తోర్‌గఢ్ రాజు రత్నసేనుణ్ణి వివాహం చేసుకుంది. ఖిల్జీ ఆమెను దక్కించుకోవడానికి చిత్తోర్‌గఢ్‌పైకి దండెత్తుతాడు. ఆమె అతనికి దక్కకుండా అగ్ని ప్రవేశం చేస్తుంది. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు రాబట్టింది.
-దీపికా పదో తరగతి వరకు స్టేట్ లెవల్‌లో బ్యాడ్మింటన్ ఆడింది. బ్యాడ్మింటన్ ప్లేయర్ కాబోయి 17 ఏండ్ల నుంచి మోడలింగ్ వైపు అడుగులు వేసింది. ఆ తర్వాత ఫిఫ్త్ కింగ్‌ఫిషర్ ఫేషన్ అవార్డులో మోడల్ ఆఫ్ ద ఇయర్ అవార్డు దక్కించుకుంది.
-ఆల్ ఎబౌట్ యు పేరుతో మింత్రాలో క్లాతింగ్ లేబుల్‌ను లాంచ్ చేసింది.
-నిరాశను ఎదుర్కోవడానికి 2015లో లైవ్ లవ్ లాఫ్ ఫౌండేషన్ స్థాపించింది.
Queens1

మణికర్ణిక

-ఏక్ నిరంజన్‌లో ప్రభాస్‌తో నటించిన కంగనా రనౌత్.. ఝాన్సీరాణి లక్ష్మీబాయి పాత్రలో ఒదిగిపోయింది. చిరునవ్వుతో మొదలైన ఆమె జీవితం కత్తి దూస్తూ రౌద్రరూపం దాల్చిన లక్ష్మీబాయి గా మెప్పించింది.
-కంగనాది ఉమ్మడి కుంటుంబం. ఇంట్లో టామ్‌బాయ్‌లా చలాయించేది. ఎవరేమన్నా తడబడకుండా ఎదురుసమాధానం ఇస్తుంది.
-తల్లి 16 ఏండ్లకే పెండ్లి చేయాలనుకుంటే దానికి నో చెప్పింది.
- ప్రీమెడికల్‌లో ఫెయిల్ అవ్వడం వల్ల చదువుకే ఫుల్‌స్టాప్ పడింది.
-చిన్నతనంలోనే బ్యూటీ కంటెస్ట్‌లో రాణించింది. తల్లిదండ్రులను మెప్పించి గ్లామర్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది.
-మొదట అస్థిమా థియేటర్ గ్రూప్‌లో థియేటర్ యాక్టర్‌గా పనిచేసింది.
Queens2

రుద్రమదేవి

-లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన అనుష్కా కాకతీయ సామ్రాజ్యపు మహారాణి రుద్రమదేవిగా వెండితెరపై అలరించింది. ప్రపంచానికి తెలియకుండా రుద్రమదేవి మగపిల్లాడిలా పెరిగి అన్ని విద్యలూ నేర్చుకొని రాజ్యాన్ని కాపాడుకుంటుంది. ఈ చిత్రం మంచి కలెక్షన్లను రాబట్టింది.
-సినిమాల కంటే ముందు యోగా టీచర్. సూపర్ సినిమాకు కొత్త హీరోయిన్ కోసం పూరీజగన్నాథ్ వెతుకుతుంటే యోగామాస్టర్ భరత్ ఠాగూర్ అనుష్కను పరిచయం చేశారు.
-విక్రమార్కుడు సినిమాతో తెలుగులో మొదటి సక్సెస్ వచ్చింది.
-ఎస్.ఎస్ రాజమౌళి డైరెక్షన్‌లో హీరోయిన్‌గా ఒకటి కంటే ఎక్కువ సినిమాలు చేసిన ఘనత అనుష్కకు దక్కింది.
Queens3

సిద్ధమ్మ

-ఉయ్యాలవాడ నరసింహారెడ్డి రాయలసీమలోని కడప, కర్నూలు, అనంతపురం, బళ్లారి జిల్లాలలో 66 గ్రామాలకు అధిపతి. భారత స్వాతంత్ర యుద్ధానికి పదేండ్ల ముందే బ్రిటీష్ దుష్టపాలనను ఎదిరించి తిరుగుబాటు చేసిన తెలుగు వీరుడు. ఈ పాత్రను మెగాస్టార్ చిరంజీవి పోషించగా ఆయన సతీమణి సిద్ధమ్మగా అందాలతార నయనతార నటించింది.
-క్రిస్టియన్ కుటుంబంలో పుట్టిన ఆమె హిందూమతం పుచ్చుకున్నది.
-నటి కాకపోయింటే చార్టర్డ్ అకౌంట్స్ చేసి ఉండేది.
Queens4

388
Tags

More News

VIRAL NEWS