హంస - కొంగ


Sun,November 17, 2019 01:04 AM

అది సరే! మా కొలనులో పచ్చిక ఉంటుంది. క్రిములుంటాయి. చేపలు, ఎండ్రలు, నాచూ ఉంటాయి. మాకు కడుపు నిండుగా ఆహారం దొరుకుతుంది. మరి మీరేమి తింటారు? మా కొలనులో అవి ఏవీ ఉండవు. బంగారు తామరలు ఎక్కడ చూసినా ఉంటాయి.

-సౌభాగ్య

హిమాలయ పర్వతాల మధ్యన ఉన్న మానస సరోవరంలో హంసలు నివసిస్తాయి. వాటి గురించి మనం వింటాం కానీ చూడం. ప్రశాంతంగా నిర్మలంగా విశాలంగా వ్యాపించిన మానస సరోవరంలో తెల్లటి కాంతులీనుతూ హంసలు పవిత్ర భావాన్ని కలిగిస్తాయి.అట్లాంటి ప్రదేశంలో నివసించే హంసల్లో ఒక దానికి ఈ హిమాలయ పర్వతాలకు అవతల, మైదాన ప్రదేశాల్లో ఎట్లాంటి పరిస్థితులున్నాయో, ఎట్లాంటి వాతావరణముందో తెలుసుకోవాలన్న కోరిక కలిగింది. వెంటనే ఆ హంస తన వెండి రెక్కలు విప్పి హిమాలయ పర్వతాల్ని దాటి మైదాన ప్రదేశానికి వచ్చి అక్కడ కనిపించిన ఒక సరోవరంలో వాలింది.తెల్లగా వెండి వెలుగుల్తో మెరిసిపోతున్న హంసను చూసి ఆ సరోవరంలోని పక్షులు ఆశ్చర్యపోయాయి. ఎందుకంటే అట్లాంటి పక్షిని అవి ఎప్పుడూ చూసి ఎరగవు.
Marmika

వాటిల్లో ఒక కొంగ ఇప్పటిదాకా మేము నీలాంటి పక్షిని చూసి ఎరగము. ఎవరు నువ్వు నిన్నేమంటారు? అంది. హంస నన్ను హంస అంటారు అంది.కొంగ హంస పేరు విన్నాం. కానీ ఎప్పుడూ చూసి ఎరగం. హంస అంటే నువ్వన్నమాట అంది.హంస ఆ పరిసరాల్ని గమనించింది.కొంగ మరయితే నువ్వు ఎక్కడ ఉంటావు? అని అడిగింది.హంస నేను మానస సరోవరంలో ఉంటాను అంది.కొంగ మానస సరోవరమా? అదెక్కడుంది? అంది.హంస మానస సరోవరం హిమాలయ పర్వతాల మధ్యలో ఉంది. కాంచన గంగ పర్వతంపై నుంచి చూస్తే కనిపిస్తుంది. అది ఎన్నో మైళ్లు వ్యాపించి నిర్మలజలంతో కళకళలాడుతూ ఉంటుంది అంది.కొంగ మరి ఆ మానస సరోవరం మా కొలను కన్నా పెద్దదా? అంది.హంస అవును. చాలా పెద్దది అంది.అది మా సరోవరం కన్నా అందంగా ఉంటుందా?అవును. చాలా మనోహరంగా ఉంటుంది.మా సరస్సులో కప్పలు, రకరకాల క్రిమికీటకాలు, పక్షులు ఉన్నాయి. మీ మానస సరోవరంలోనూ ఉన్నాయా?.లేవు. అక్కడ మేము మాత్రమే ఉంటాము.

మా కొలనులో ఎన్నో పక్షులు నీళ్ళలో మునిగి లేస్తూ ఉంటాయి. ఎందరో మనుషులు పెద్దవాళ్ళు, పిల్లవాళ్లు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ స్నానాలు చేస్తారు. చాలామంది వచ్చి బట్టలు కూడా ఉతుక్కుంటూ ఉంటారు. మా కొలను ఎప్పుడూ సందడి సందడిగా ఉంటుంది.మా మానస సరోవరంలో అలజడి ఉండదు. అలలు కూడా ఉండవు. సందడి కూడా ఉండదు. నిర్మలంగా నిశ్చలంగా ఉంటుంది.అయ్యబాబోయ్! అట్లా ఉంటే విసుగెయ్యదా?విసుగెయ్యదు. పవిత్ర భావం కలుగుతుంది.మీ మానస సరోవరంలో ఎవరూ స్నానాలు చెయ్యరా?చేస్తారు. దేవతలు, దేవకన్యలు, గంధర్వులు, అప్సరసలు వచ్చి జలకాలాడుతారు.అది సరే! మా కొలనులో పచ్చిక ఉంటుంది. క్రిములుంటాయి. చేపలు, ఎండ్రలు, నాచూ ఉంటాయి. మాకు కడుపు నిండుగా ఆహారం దొరుకుతుంది. మరి మీరేమి తింటారు?మా కొలనులో అవి ఏవీ ఉండవు. బంగారు తామరలు ఎక్కడ చూసినా ఉంటాయి. మేము తామర తుండులు తింటాము.హంస మాటలకు కొంగ జాలిపడింది.అట్లాంటి వాతావరణంలో ఎట్లా ఉండగలదో ఈ హంస అనుకుంది.అక్కడ హంస చాలాసేపు ఉండలేకపోయింది. స్వర్గధామం లాంటి తన నివాసానికి ఎగిరిపోయింది.

274
Tags

More News

VIRAL NEWS