ఇల్లాలి పేరుకే సార్థకత


Sun,November 3, 2019 04:31 AM

తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన కథానాయికలు వీరంతా. రీల్ లైఫ్‌లో ఇల్లాలి పాత్రలు చేసిన ఈ హీరోయిన్లు.. రియల్ లైఫ్‌లో కూడా మంచి గృహిణిగానే పేరు తెచ్చుకుంటున్నారు. పైండ్లెన తర్వాత సినిమాలకు స్వస్తి చెప్పి.. గృహిణి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ఇవాళ హౌస్ వైఫ్ డే సందర్భంగా గృహిణులైన కొందరు హీరోయిన్ల గురించి..

...?డప్పు రవి

కలర్స్ స్వాతి

కలర్స్ అనే టీవీ కార్యక్రమం ద్వారా తెలుగు బుల్లితెరపై సత్తా చాటిన స్వాతిరెడ్డి.. అదే కార్యక్రమాన్ని తన పేరుగా పొందింది. తండ్రి రష్యాలో ఉద్యోగం చేసేవారు. అక్కడే పుట్టింది స్వాతి. డేంజర్ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమై ఆడవారి మాటలకు ఆర్థాలే వేరులే సినిమాతో సక్సెస్‌ను సాధించి.. అష్టాచెమ్మా సినిమాకు ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్నది. తర్వాత వరసగా దక్షిణాది సినిమాల్లో నటించింది. 2018 ఆగస్టు 30న మలయాళీ అయిన వికాస్ వాసును ప్రేమించి పెండ్లి చేసుకున్నది. అప్పటి నుంచి మళ్లీ సినిమాల్లో కనిపించకుండా కుటుంబ బాధ్యతలు చూసుకుంటున్నది స్వాతి.
Color_Swathi

శ్రియా సరన్

తెలుగు ప్రేక్షకులకు ఎంతో చేరువైన హీరోయిన్ శ్రియా సరన్ భట్నాగర్. ఇష్టం సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చి.. దక్షిణాది అన్ని భాషల్లో, బాలీవుడ్, హాలీవుడ్‌లో అలరించింది శ్రియా. తెలుగులో అగ్రహీరోల అందరితో నటించింది. ది అదర్ ఎండ్ ఆఫ్ ది లైన్ అనే హాలీవుడ్ సినిమాలో తన ప్రతిభ చూపింది. ఎన్నో అవార్డులను అందుకున్నది. రష్యాకు చెందిన యువ పారిశ్రామిక వేత్త, టెన్నిస్ ప్లేయర్, మోటివేషనల్ స్పీకర్ ఆండ్రై కొశ్చివ్‌ను 2018 మార్చి 12న పెండ్లాడింది. అప్పటి నుంచి సినిమాలకు స్వస్తి చెప్పి.. ఫ్యామిలీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నది శ్రియా.
shriya-saran

జెనీలియా

బొమ్మరిల్లు సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనదైన ముద్రవేసుకున్న జెనీలియా డిసౌజ.. మొదట బాలీవుడ్‌లో తుఝేమేరీ కసమ్‌లో నటించింది. తర్వాత బాయ్స్ సినిమాతో దక్షిణాదిలో ఎంట్రీ ఇచ్చి.. అన్ని భాషల్లో నటించి, మెప్పించింది. మళ్లీ బాలీవుడ్‌కు పయనమై తన మొదటి సినిమా హీరో రితేష్ దేశ్‌ముఖ్‌ను 2012 ఫిబ్రవరి 3న పెండ్లి చేసుకున్నది. 2014లో మొదటి కొడుకు రియాన్, 2016లో రెండో కొడుకు రహైల్‌కు జన్మనిచ్చింది. అప్పటి నుంచి సినిమాల్లో కనిపించలేదు జెనీలియా. అప్పుడప్పుడు వార్తల్లో నిలుస్తున్నా.. పూర్తిగా కుటుంబం, పిల్లలకే తన సమయాన్ని కేటాయిస్తున్నది.

నమ్రత

మహేశ్‌బాబు సతీమణిగా నమ్రత ఇల్లు, పిల్లలు, ప్రొడక్షన్ బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహిస్తున్నది. 1993లో ఫెమినా మిస్ ఇండియా యూనివర్స్‌గా నిలిచింది. మిస్‌యూనివర్స్ పోటీల్లో టాప్ సిక్స్‌లో నిలిచింది. 1998లో బాలీవుడ్‌లో తబ్ ప్యార్ కికిసే హోతా హై సినిమాతో తెరంగ్రేటం చేసింది. వంశీ సినిమాలో మహేశ్‌బాబుతో నటించి.. 2005 ఫిబ్రవరిలో పెండ్లి చేసుకున్నది.
Namratha

లయ

స్వయంవరం సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ప్రత్యేకస్థానం సంపాదించుకున్నది లయ. 2006 జూన్ 14న ఎన్‌ఆర్‌ఐ అయిన డాక్టర్ గణేశ్ గుర్తిని పెండ్లి చేసుకున్నది. వీరికి ఓ పాప, బాబు ఉన్నారు. పైండ్లెన తర్వాత సినిమాల్లో నటించకుండా కుటుంబ బాధ్యతలు చూసుకుంటున్నది లయ.
Laya

రంభ

తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నది సినీనటి రంభ. కెనడాకు చెందిన పారిశ్రామికవేత్త ఇంద్రాన్ పద్మనాథన్‌ను పెండ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు స్వస్తి చెప్పి.. పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు. రంభ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు.
Rambhaindran

560
Tags

More News

VIRAL NEWS