రాశి ఫలాలు


Sun,November 3, 2019 01:08 AM

3-11-2019 నుంచి 9-11-2019 వరకు

మేషం

ఈ వారం ఈ రాశి వారికి గురు అదృష్ట స్థానంలోకి రావడం వల్ల చాలా కలిసివస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పదోన్నతి, చదువు, శుభకార్యాలు చేస్తారు. ప్రయాణాలు కలిసివస్తాయి. శ్రద్ధతో పనులు చేస్తారు. అన్నదమ్ములు, బంధువులతో సఖ్యత పెరుగుతుంది. వ్యవసాయదారులకు దిగుబడి అనుకూలంగా ఉంటుంది. నూతన వస్త్ర, వస్తువులను, ఆభరణాలను కొంటారు. విందులు, వినోదాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు లాభిస్తాయి. న్యాయవాద, వైద్య, ఉపాధ్యాయ వృత్తుల్లో ఉన్న వారు ప్రారంభించిన పనులను సకాలంలో పూర్తిచేస్తారు.
RasiPhalalu

వృషభం

ఈ వారం కొన్ని విషయాల్లో అశాంతి, అనవసరమైన గొడవలు, శారీరక ఇబ్బందులుంటాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం, పనుల్లో శ్రద్ధ అవసరం. రాజకీయాల్లో వారికి కార్యకర్తలతో అనుకూలత ఉంటుంది. ఆఫీసులో తోటి వారితో సమన్వయం వల్ల పనులు నెరవేరుతాయి. పై అధికారుల అండదండ కొంతవరకు ఉంటుంది. మంచి వారితో స్నేహం చాలా ముఖ్యం. తద్వారా కొన్ని పనులు నెరవేరుతాయి. అనాలోచిత పెట్టుబడుల వల్ల నష్టం ఉంటుంది. మొత్తం మీద ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.

మిథునం

నిత్య వ్యాపారం అనుకూలిస్తుంది. కొత్త పనులు చేస్తారు. శుభకార్యాల ప్రయత్నాలు ఫలిస్తాయి. దేవతా, గురుభక్తి పెరుగుతుంది. స్నేహ సంబంధాలు పెంపొందుతాయి. ఉన్నత విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి. న్యాయవాద, ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వారికి కలిసి వస్తుంది. అనవసరమైన ప్రయాణాల మూలంగా ఖర్చులు, అశ్రద్ధ, అలసట పెరుగుతాయి. తీర్థయాత్రలు, నదీస్నానాలు, దేవతా గురుభక్తి పెంపొందించు కోవడం మూలంగా కొంతవరకు పనులలో విజయాన్ని పొందుతారు.

కర్కాటకం

ఈ రాశి వారికి ఈ వారం స్నేహితులు, అన్నదమ్ములు, బంధువులతో మంచి సంబంధాలు ఉంటాయి. తద్వారా పనులు సునాయాసంగా పూర్తవుతాయి. వాహనాల వల్ల పనులు నెరవేరుతాయి. వ్యవసాయదారులకు అనుకూలంగా ఉంటుంది. విందులు, వినోదాలలో పాల్గొంటారు. ఆర్థిక పరమైన సమస్యలు తీరుతాయి. రావాల్సిన డబ్బు వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. పనివారితో అనుకూలత ఉంటుంది. తల్లిదండ్రులు, అనుభవజ్ఞుల సహాయ సహకారాలు పెరుగుతాయి. ఆర్థిక పరమైన సమస్యలు లేకపోయినా కొన్ని పనుల్లో జాప్యం జరుగుతుంది. ముఖ్యంగా శ్రద్ధతో, నిబద్ధతతో పనులు చేయాలి.

సింహం

రాజకీయ, కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితాలుంటాయి. ఉద్యోగులకు బాగా కలిసి వస్తుంది. ప్రమోషన్‌లు రావచ్చు. మంచి పనులను అప్పజెప్తారు. భార్యా పిల్లలతో హాయిగా ఉంటారు. సంగీత, సాహిత్య, సినిమా రంగాల్లోని వారికి కొత్త అవకాశాలు వస్తాయి. కొత్త పనులను ప్రారంభిస్తారు. నిత్య వ్యాపారం కలిసివస్తుంది. పెట్టుబడులకు అనుకూల వారం. హోటలు, క్యాటరింగు, నిత్యావసర వస్తు, ఫ్యాన్సీ, కూరగాయలు వ్యాపారాలు లాభిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. నలుగురిలో మంచి పేరును పొందుతారు.

కన్య

భార్యా పిల్లలతో సంతృప్తిగా ఉంటారు. విందులు, వినోదాలలో పాల్గొంటారు. సాహిత్య, సినిమ రంగాల్లోని వారికి కొంత అనుకూలత ఉంటుంది. ప్రధానంగా ఈ వారం సలహాలు, సూచనలను తీసుకుంటూ ఒకటికి నాలుగు సార్లు ఆలోచిస్తూ ముందుకు వెళ్లాలి. నలుగురిలో మంచి పేరు ఉండడంతో కొన్ని పనులు నెరవేరుతాయి. దేవతా, గురుభక్తి పెంపొందించుకోవాలి. నిర్మాణ రంగంలో ఉన్న వారు కొత్త పనులు ప్రారంభించకుండా పాత పనులపై శ్రద్ధ వహించాలి.

తుల

పనివారితో సమస్యలు పరిష్కారం అవు తాయి. ఆదాయం పెరుగుతుంది. పను లు ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతాయి. సమయానికి డబ్బులు చేతికందుతాయి. కొత్త పనులు ప్రారంభిస్తారు. వృత్తి, వ్యాపారం అనుకూలిస్తాయి. న్యాయవాద, వైద్య వృత్తుల్లోని వారికి సంతృప్తి కరంగా ఉంటుంది. హోటలు, క్యాటరింగు, నిత్యావసర వస్తువులు, వస్త్ర, ఫ్యాన్సీ, వ్యాపారాల్లోని వారు సంతోషంగా ఉంటారు. పనులు నెరవేరుతాయి. సభలకు, విందు లు, ప్రవచనాలకు హాజరవుతారు.

వృశ్చికం

భార్యా పిల్లలతో సంతృప్తిగా ఉం టారు. వస్త్ర, వస్తువులను కొంటారు. సంగీత, సాహిత్య, సినిమా రంగాల్లో వారికి అవకాశాలు వస్తాయి. హోట ల్, క్యాటరింగ్, వస్త్ర, ఫ్యాన్సీ వ్యాపారాల్లోని వారు పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆదాయం పెరుగుతుంది. విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావడం, పోటీ పరీక్షలలో మంచి స్థాయిలో నిలుస్తారు. శుభకార్య ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. మంచి పేరును సంపాదిస్తారు. దేవతా, గురుభక్తి పెరుగుతుంది. ఉన్నతమైన భావాలు పెరుగుతాయి. ఓపికతో పనులు చేస్తారు.

ధనుస్సు

ఉద్యోగులు సంతృప్తిగా ఉంటారు. ఆఫీసులో అన్ని విధాలుగా సహాయ సహకారాలుంటాయి. ముఖ్యంగా పైఅధికారులతో సమన్వయంగా ఉంటారు. రాజకీయాల్లో ఉన్న వారికి అందరి సహాయ సహకారాలు లభిస్తాయి. భార్యా పిల్లలతో సంతృప్తిగా ఉంటారు. విందులు, వినోదాలలో పాల్గొంటారు. సాహిత్య, పత్రికా, సినిమా రంగాల్లోని వారు సంతృప్తిగా ఉంటారు. విద్యార్థులు ముఖ్యంగా శ్రమించాలి. మంచి సంబంధాలు పెంచుకోవాలి. దేవతా గురుభక్తి మూలంగా పనులు పూర్తి కావడానికి పరిస్థితులు బాగా దోహదపడుతాయి.

మకరం

వృత్తి, వ్యాపారాలు అనుకూలం. హోటలు, క్యాటరింగు, వస్త్ర, ఫ్యాన్సీ, నిత్యావసర వస్తు వ్యాపారాల్లో వారు లాభాలను గడిస్తారు. భార్యా పిల్లలతో సంతృప్తిగా గడుపుతారు. ప్రయాణాలు కలిసివస్తాయి. ఉత్సాహంతో పనులు చేస్తారు. కొత్త పెట్టుబడులను కొన్ని రోజులు వాయిదా వేసుకోవడం మంచిది. అన్నదమ్ములు, బంధువులతో మనస్పర్ధ లుంటాయి. విద్యార్థులు బాగా కష్టపడాలి. వివాహాది శుభకార్యాల విషయంలో ఆటంకాలు ఉంటాయి. తీర్థయాత్రలు, నదీ స్నానాల వలన కొంత ప్రశాంతత చేకూరుతుంది.

కుంభం

వృత్తి, వ్యాపారాలు కలిసివస్తాయి. నిత్యావసర వస్తు , షేర్, వడ్డీ వ్యాపారాలు అనుకూలిస్తాయి. కొత్త పెట్టుబడులు పెడతారు. ఆలోచించి పనులు చేస్తారు. తద్వారా లాభాలను పొందుతారు. న్యాయవాద, ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వారికి ఆదాయం పెరుగుతుంది. పనులు సకాలంలో పూర్తవుతాయి. మంచి స్నేహ సంబంధాలు పెరుగుతాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు.

మీనం

భార్యా పిల్లలతో సంతృప్తిగా ఉంటారు. విందులు, వినోదాలలో పాల్గొంటారు. ప్రధానమైన గ్రహాలతో పాటు అన్ని కూడా ప్రతి కూలంగా సంచరిస్తున్నాయి. కనుక ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి అడుగులు వేయడం మంచిది. ఓపికతో ముందుకు వెళ్లాలి. విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కాబట్టి కష్టపడడానికి అలవాటు పడాలి. నలుగురిలో మంచి పేరును సంపాదించడానికి ప్రయత్నం చేస్తారు. డబ్బు సకాలంలో అందకపోవడంతో పనులలో ఆటంకాలు ఉంటాయి. అధిగమించి ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉండాలి.

గుడి ఉమా మహేశ్వరశర్మ సిద్ధాంతి
ఎం.ఎస్సీ., నిర్మల పంచాంగకర్త
నల్లకుంట, హైదరాబాద్., ఫోన్: 040-27651530
ఈ మెయిల్ : [email protected]

2279
Tags

More News

VIRAL NEWS