రాశి ఫలాలు


Sun,October 27, 2019 12:43 AM

27-10-2019 నుంచి 2-11-2019 వరకు

మేషం:భార్యా పిల్లలతో సంతృప్తిగా ఉంటారు. సమావేశాలకు హాజరవుతారు. వస్త్ర, వస్తువులు కొనుగోలు చేస్తారు. సంగీత, సాహిత్య, సినిమా రంగాల్లోని వారికి ప్రధానంగా అనుకూలిస్తుంది. నిత్య క్రయ విక్రయాలు లాభదాయకంగా ఉంటాయి. వ్యవసాయదారులకు అనుకున్న రీతిలో పనులు అవుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. తీర్థయాత్రలు, విహార యాత్రలు చేయాలనే తలంపు పెంపొందుతుంది. మంచి ఆలోచనలు స్ఫురిస్తాయి. వాటిని ఆచరణలో పెట్టే ప్రయత్నం చేస్తారు. కొన్ని పెట్టుబడులను కొన్ని రోజులు వాయిదా వేసుకోవడం మంచిది.

వృషభం:ఉద్యోగస్తులకు అనుకున్న ప్రాంతాలకు ట్రాన్స్‌ఫర్‌లు, ప్రమోషన్‌లుంటాయి. తోటివారితో సమన్వయం, పై అధికారులతో స్నేహపూర్వక వాతావరణం ఉంటుంది. పనులు సకాలంలో పూర్తవుతాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. మంచి ఆలోచనలు స్ఫురిస్తాయి. కార్యరూపంలో పెడతారు. నిర్మాణ రంగాల్లో ఉన్న వారికి పనులు కలిసొస్తాయి. కానీ ఆర్థిక, న్యాయపరమైన సమస్యలను ఎదుర్కొంటారు. జాగ్రత్తగా వ్యవహరించాలి. సమాజంలో మంచివారి సాహచర్యం మూలంగా చాలా పనులు సాగుతాయి.

మిథునం: రోజూవారీ క్రయవిక్రయాలు లాభిస్తాయి. న్యాయవాద వృత్తిలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అనవసరమైన ప్రయాణాలు చేయాల్సి రావడం తద్వారా అలసట, చిన్న సమస్యలు వస్తాయి. నిర్మాణ రంగం ఇంజనీరింగు వ్యాపారాల్లో వారు ఓపికతో ముందుకు వెళ్లాలి. ఉద్యోగస్తులు ఆఫీసులో అనవసరమైన విషయాలపై శ్రద్ధ చూపడం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. పెద్దవారితో సాహచర్యం, మంచి వారి సహాయ సహకారాలు బాగా ఉంటాయి.

కర్కాటకం:ఈ వారం పెద్దల సహాయ సహకారాలు అందుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. ఆలోచనా విధానంలో మార్పువల్ల పనులు నెరవేరుతాయి. రావాల్సిన డ బ్బు అందుతుంది. ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. ఉత్సాహంతో పనులు చేస్తారు. నలుగురిలో మంచిపేరు సంపాదిస్తారు. పిల్లల శుభకార్యాల విషయం అనుకూలిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉన్నత విద్యకై ఈ వారం అనుకూలంగా ఉంటుంది. భార్యాపిల్లలతో సౌఖ్యంగా వుంటారు. విందులు, వినోదాలలో పాల్గొంటారు. వస్త్ర, వస్తువులను, నగలను, ఇంటి సామాగ్రిని కొనుగోలు చేస్తారు.

సింహం:ఈ వారంలో వీరికి తాత్కాలిక ప్రయోజనాలుంటాయి. రాజకీయ, కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటా యి. న్యాయవాద, వైద్య వృత్తుల్లో ని వారికి అవకాశాలు వస్తాయి. ఆదా యం పెరుగుతుంది. అనుకున్న పనులు పూర్తవుతాయి. నిత్య వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. సంగీత, సాహిత్య, సినిమా రంగాల్లోని వారికి సంతృప్తికరంగా ఉంటుంది. విందులు, వినోదాలలో పాల్గొంటారు. పెద్దల సహాయ సహకారాలు ఉన్నప్పటికీ సకాలంలో సద్వినియోగ పరచుకోకపోవడంతో ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉంటాయి.

కన్య:ప్రధాన గ్రహాలు ప్రతికూలంగా ఉన్నా యి. శ్రద్ధతో పనులు చేయడం అవసరం. పెద్ద పెట్టుబడుల వ్యవహారాలు మానుకోవాలి. కొన్ని రోజుల వరకు వాయిదా వేసుకోవడం మం చిది. భార్యాపిల్లలతో సంతృప్తిగా ఉంటారు. విందులు, వినోదాలలో పాల్గొంటారు. సంగీత, సాహిత్య, సినిమా రంగాల్లోని వారికి అనుకూలంగా ఉంటుంది. వస్త్ర, ఫ్యాన్సీ, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు వ్యాపారాలలో ఉన్న వారికి లాభదాయకంగా ఉంటాయి. పెద్దల సూచనలను తీసుకుంటూ ముందుకు వెళ్లడం అన్ని విధాలుగా మంచిది.

తుల:ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఆలోచనలతో పనులు చేస్తే సత్ఫలితాలు పొందుతారు. నిత్యావసర వస్తు వ్యాపా రం, షేర్, వడ్డీ, హోటలు, క్యాటరింగు, వస్త్ర, ఫ్యాన్సీ వ్యాపారాల్లో ఆదాయం పెరుగుతుంది. వైద్య, న్యాయవాద, ఉపాధ్యాయ వృత్తుల్లో వారికి సంతృప్తికరంగా ఉంటుంది. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. ఉన్నత విద్యకు అనుకూలం. రావాల్సిన డబ్బు వస్తుంది. కొత్త పనులు చేస్తారు. వస్త్ర, వస్తు, నగలను కొనుగోలు చేస్తారు. పెద్దల సహాయ సహకారాలు బాగా అందుతాయి.

వృశ్చికం:మంచి సంబంధాలు పెంపొందుతాయి. అవగాహనతో పనులు నెరవేరుతాయి. వాహనాల వల్ల కలిసివస్తుంది. వ్యవసాయదారులకు అనుకూలంగా ఉంటుంది. భార్యాపిల్లలతో సంతృప్తిగా ఉంటారు. సభలకు, సమావేశాలకు హాజరవుతారు. సంగీత, సాహిత్య, సినిమా రంగాల్లో వారు సంతృప్తిగా ఉంటారు. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి తాత్కాలికంగా ఉద్యోగం లభిస్తుంది. ఇంకా మంచి ఉద్యోగాలకు ప్రయత్నాలు చేస్తారు. నలుగురిలో మంచిపేరు చాలా ఉపయోగ పడుతుంది. తద్వారా కొన్ని పనులు నెరవేరుతాయి.

ధనుస్సు:పూర్వపు సమస్యలు పరిష్కారమవుతాయి. ఆరోగ్యం నయమవుతుంది. పనులలో స్తబ్ధత దూరమవుతుంది. పుణ్య క్షేత్రాలను సందర్శిస్తారు. అనుభవజ్ఞులు, తల్లిదండ్రులు, పెద్ద వారి సహాయ సహకారాలను పొందుతారు. వారి సూచనలతో పనులు నెరవేరుతాయి. ఉద్యోగంలో మంచి పేరు సంపాదిస్తారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. సంతృప్తిగా ఉంటారు. వైద్యవృత్తిలో ఉన్న వారికి ప్రధానంగా ఈ వారం బాగా కలిసివస్తుంది. అనుకున్న పనులు నెరవేరతాయి. వాహనాల వల్ల చిన్న చిన్న ఇబ్బందులుంటాయి.

మకరం:ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఉత్సాహంతో పనులు చేస్తారు. ఆఫీసులో మం చి పేరు ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్‌లు, అనుకున్న ప్రాంతాలకు ట్రాన్స్‌ఫర్‌లు ఉంటాయి. నిత్య వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. రాజకీయ, కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. భార్యా పిల్లలతో సంతృప్తిగా ఉంటారు. విందులు, సభలు, సత్‌గోష్టిలలో పాల్గొంటారు. దేవతా, గురుభక్తి పెరుగుతుంది. నిత్యావసర వస్తు వ్యాపారం, వడ్డీ, షేర్, హోటలు, క్యాటరింగు వ్యాపారాల్లోని వారికి ఆదా యం పెరుగుతుంది.

కుంభం: తల్లిదండ్రులు, పెద్దవారి సూచనలు, సలహాలు అందుతాయి. సద్వినియోగ పరచు కోవడంతో సత్ఫలితాలను పొందుతారు. ఆదాయం పెరుగుతుంది. తీర్థయాత్రలు చేస్తారు. ఆరోగ్యం నయమవుతుంది. నిత్య వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. వృత్తిలో రాణిస్తారు. పనులలో కొన్ని ఆటంకాలు ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాలలో తాత్కాలిక ప్రయోజనాలు ఉంటాయి. అనవసరమైన ప్రయాణాలు. తద్వారా చిన్న చిన్న సమస్యలను ఎదుర్కొంటారు.

మీనం:సంగీత, సాహిత్య, సినిమా రంగాలలో ఉన్న వారు సంతృప్తిగా ఉంటారు. విందులు, వినోదాలు, శుభకార్యాలలో పాల్గొంటారు. దైవిక కార్యక్రమాలు చేస్తారు. భక్తి ప్రపత్తులు పెంపొందుతా యి. భార్యా పిల్లలతో సంతృప్తిగా ఉం టారు. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. వస్త్ర, ఫ్యాన్సీ రంగాలలో ఉన్న వారికి ముఖ్యంగా అనుకూలమైన వారం. పనులు పూర్తవుతాయి. పిల్లల చదువు, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. నలుగురిలో మంచి పేరు సంపాదిస్తారు. హాయిగా గడుపుతారు.ఉద్యోగ ప్రయత్నాలలో తాత్కాలిక ఫలితాలు ఉంటాయి. శ్రద్ధతో పనులు చేస్తే సత్ఫలితాలుంటాయి.
Rasi

1969
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles