దీర్ఘవ్యాధులతో మరణించిన మానవ మృగం


Sun,October 20, 2019 04:12 AM

జనరల్ డయ్యర్
డయ్యర్.. ఈ పేరు వింటేనే నాటి భారతీయులకు వెన్నులో వణుకు పుట్టింది. అంతటి క్రూరుడు. మనిషి రూపంలో ఉన్న మృగం.. ఎలాంటి హెచ్చరిక లేకుండా కాల్పులు జరిపి అమాయకులైన భారతీయులను పొట్టనపెట్టుకున్న దుర్మార్గుడు. జలియన్‌వాలాబాగ్ మారణ హోమం మనదేశ చరిత్రలో నిలిచిపోయినట్లే డయ్యర్ కూడా భారతీయుల మనసుల్లో ఒక దుర్మార్గుడుగా శాశ్వతంగా నిలిచిపోయాడు. అంతటి దుర్మార్గున్ని బ్రిటీష్ ప్రభుత్వం శిక్షించలేదు సరికదా సన్మానించింది. నరమేధంపై నాటి బ్రిటిష్ సర్కార్ ఎలాంటి పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదు. ప్రత్యక్ష్యంగా నరమేధంలో పాల్గొన్న జనరల్ డయ్యర్‌ను ప్రశంసలు, నగదు బహుమతులతో ఇంగ్లండ్‌కు పంపించింది. అయితే అనేక రోగాలతో దీర్ఘకాలం బాధపడిన జనరల్ డయ్యర్ మానసిక, శారీరక సమస్యలతో ఘోరంగా మరణించాడు. చచ్చేంత వరకూ పశ్చాత్తాపం వ్యక్తం చేయని దుర్మార్గ డయ్యర్ చివరిపేజీ.
మధుకర్ వైద్యుల, సెల్: 9182777409

chivari

లియన్ వాలాబాగ్ ఘటనపై బ్రిటిషు ప్రభుత్వం నియమించిన హంటర్ కమిషన్ ముందు హాజరైన డయ్యర్‌ను సభ్యులు పలురకాలుగా ప్రశ్నించారు. ఈ సందర్భంగా.. ప్రధానద్వారం వద్దకు భారీ సైనిక వాహనాన్ని తీసుకువెళ్లారు కదా.. ఎందుకు లోపలికి తీసుకెళ్లలేదని ప్రశ్నించారు. ప్రవేశమార్గం చిన్నది కావడంతో తీసుకెళ్లలేకపోయామని.. ఒకవేళ వెళ్లివుంటే మెషిన్ గన్‌తో కాల్చేవాళ్లమని.. దాంతో ఇంకా ఎక్కువమంది ప్రాణాలు కోల్పోయేవారంటూ డయ్యర్ చెప్పిన సమాధానం అతనిలోని పరమ దుర్మార్గ వైఖరికి అద్దం పట్టింది. ప్రపంచ క్రూరుల్లో జనరల్ డయ్యర్ ఒకరు. భారతదేశ సార్వభౌమాధికారాన్ని చేతుల్లోకి తీసుకున్న బ్రిటిష్ ప్రభుత్వం డయ్యర్‌ను బ్రిటిష్ సైన్యానికి కమాండెంట్‌గా భారత్‌కు పంపించింది. అప్పటినుండి భారతీయులపై డయ్యర్ దురాగతాలు కొనసాగాయి. అమృత్‌సర్ ఘోరఘటన తరువాత ఎటువంటి ఆందోళనలు జరగకుండా ఉండేందుకు కర్ఫ్యూ విధించాడు. కొన్నిప్రాంతాల్లో ప్రజలను వంద మీటర్ల దూరం వరకు పాకించేవాడు. చిన్నాపెద్ద అని తేడా లేకుండా అందరితో అలాగే చేయించాడు. ఇలా ఎన్ని దుర్మార్గాలు చేయాలో అన్నీ చేసిన డయ్యర్‌కు కొందరు అనుకూలంగా మాట్లాడటం అందరినీ నివ్వెరపోయేలా చేసింది.

అది అమృత్‌సర్ పట్టణంలోని జలియన్‌వాలా బాగ్.

తేదీ 1919 ఏప్రిల్ 13. సూర్యాస్తమయానికి ఇంకా ఆరు నిమిషాలు ఉంది.
వేలమంది ప్రజలు సమావేశమయ్యారు... అందరూ నిరాయుధులు, సామాన్యులు..అక్కడ 15 వేల నుంచి 25 వేల మంది దాకా జనం ఉన్నారు. వారికి ఒక్కసారిగా పైనుంచి ఓ విచిత్రమైన శబ్దం వినిపించింది. బాగ్ పై నుంచి ఓ విమానం కిందకీ, మీదకూ ఎగురుతూ కనిపించింది. దాని రెక్కపై ఓ జెండా వేలాడుతూ ఉంది. అక్కడున్నవారికి విమానాన్ని చూడటం అదే తొలిసారి. దాన్ని చూడగానే అక్కడినుంచి వెళ్లిపోవడమే మంచిదని కొందరు అనుకున్నారు. అప్పుడే పెద్దగా బూట్ల చప్పుడు మొదలైంది. కొన్ని క్షణాల్లోనే జలియన్‌వాలాబాగ్‌కు వచ్చే ఇరుకైన దారినుంచి 50 మంది సైనికులు వచ్చారు. ఇద్దరేసి చొప్పున ఫార్మేషన్ గా ఏర్పడుతూ బాగ్‌కు రెండు వైపులా విస్తరించారు. జనంలో ఒకవైపు నుంచి వచ్చారు.. వచ్చారు అంటూ అరుపులు వినిపించాయి. అక్కడి నుంచి వెళ్లిపోవాలని వారు లేచి నిల్చున్నారు. అప్పుడే, కూర్చోండి.. కూర్చోండి.. వాళ్లు కాల్పులేమీ జరపరు అని మరో అరుపు వినిపించింది.

ఆ క్షణమే బ్రిగేడియర్ జనరల్ రెజినాల్ డయ్యర్ గుర్ఖాజ్, 56 లెఫ్ట్ అంటూ అరిచారు. 25 మంది గోర్ఖా, 25 మంది బలూచ్ సైనికుల్లో సగం మంది కూర్చొని, సగం మంది నిల్చొని పొజిషన్ తీసుకున్నారు. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఫైర్ అంటూ డయ్యర్ ఆదేశించారు. సైనికులు తుపాకులు గురిపెట్టి, ఎలాంటి హెచ్చరికా చేయకుండానే కాల్పులు మొదలుపెట్టారు. నలువైపులా జనాలు గాయ పడుతూ, ప్రాణాలు వదులుతూ నేలకొరుగుతున్నారు. సైనికులు గురి చూసి కాలుస్తున్నారు. వాళ్ల తూటాలేవీ వృథా కావడం లేదు. మధ్యలో కొందరు సైనికులు గాలిలోకి కాల్పులు జరిపారు. గాల్లోకి కాల్పులు జరిపి తూటాలు వృథా చేయవద్దు. గురి చూసి గుండెలపై కాల్చండి పడినవారు తిరిగి లేవకూడదు అని డయ్యర్ ఆదేశం. దీంతో రెచ్చిపోయిన సైనికులు ఏకధాటిగా పదినిమిషాల పాటు 1650 రౌండ్ల కాల్పులు జరిపారు. చివరకు తూటాలు అయిపోవడంతో కాల్పులు ముగిశాయి. జనం భయంతో అటూఇటూ పరుగులు పెడుతున్నారు. బయటకు వెళ్లే దారేదీ వారికి దొరకడం లేదు. ఇరుకైన సందులున్న ప్రవేశద్వారం వైపే జనం గుమిగూడుతున్నారు. బయటకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. సైనికులను తుపాకులు రీ లోడ్ చేయమని డయ్యర్ ఆదేశించారు. పెద్ద గుంపు ఉన్న వైపు కాల్పులు జరపాలని హుకుం జారీ చేశారు. డయ్యర్ సైనికులు వారినే లక్ష్యంగా చేసుకుంటున్నారు. శవాలు కిందపడుతున్నాయి. కొందరు గోడలు ఎక్కి బయటపడే ప్రయత్నం చేస్తున్నారు. సైనికుల తూటాలు తాకి నేలకూలుతున్నారు. నేలపై పడుకొని ఉండాలని గుంపులో ఉన్న కొందరు మాజీ సైనికులు చుట్టూ ఉన్నవారికి సూచిస్తున్నారు. కానీ, అలా ఉన్నవారినీ సైనికులు వదిలిపెట్టడం లేదు.

దేశ చరిత్రలో ఇదో నరమేధం. బ్రిటిషువారి అహంకార, దుర్మార్గ వైఖరికి జలియన్ వాలాబాగ్ ఉదంతం అద్దంపట్టింది. బక్కప్రాణులపై ఇంతటి బలప్రయోగమేంటని దేశంలో నిరసనలు వ్యక్తమయ్యాయి. బ్రిటిషువారు కూడా ఈ ఘోరకలిపై చలించిపోయారు. బ్రిటిషువారి లెక్కల ప్రకారం 379 మంది చనిపోయారని 1100మంది గాయపడ్డారని అంచనా. అయితే ప్రత్యక్షసాక్షులు, కాంగ్రెస్ వర్గాల అంచనా ప్రకారం వెయ్యిమందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్టు అప్పటి నివేదికలు తెలుపుతున్నాయి. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ ఘటనపై నిర్ఘాంత పోయారు. తనకు బ్రిటిషు ప్రభుత్వం ప్రకటించిన నైట్‌హుడ్ బిరుదును తిరస్కరించారు. కాల్పుల నుంచి తప్పించుకునేందుకు ప్రజలు ప్రవేశమార్గాల వద్దకు వెళ్లారు. మొత్తం ఐదు ప్రవేశమార్గాలు ఉండగా ఒకటి మాత్రమే పెద్దది. అయితే దీన్ని బ్రిటిషుసైనికులు మూసివేయడంతో ప్రజలకు తప్పించుకునేందుకు వీలులేకుండా పోయింది. దానితో బావిలోకి దుకారు. ఆ తరువాత అందులో 120 శవాలు దొరికాయి. భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలో ఒకేసారి వందలమంది అమాయకులను ఊచకోత కోసిన జనరల్ డయ్యర్ దీనిపై ఎప్పుడూ పశ్చాత్తాపం వ్యక్తం చేయకపోవడం గమనార్హం.

chivari1="దీర్ఘవ్యాధులతో మరణించిన మానవ మృగం"/>
దేశ చరిత్రలోనే ఇదో నరమేధం. బ్రిటిషువారి అహంకార, దుర్మార్గ వైఖరికి జలియన్ వాలాబాగ్ ఉదంతం అద్దంపడుతుంది. బక్కప్రాణులపై ఇంతటి బలప్రయోగమేంటని దేశంలో నిరసనలు వ్యక్తమయ్యాయి. బ్రిటిషువారు కూడా ఈ ఘోరకలిపై చలించిపోయారు. బ్రిటిషువారి లెక్కల ప్రకారం 379 చనిపోయారని, 1100మంది గాయపడ్డారని అంచనా. అయితే ప్రత్యక్షసాక్షులు, కాంగ్రెస్ వర్గాల అంచనా ప్రకారం వెయ్యిమందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్టు అప్పటి నివేదికలు తెలుపుతున్నాయి. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ ఘటనపై నిర్ఘాంత పోయారు. తనకు బ్రిటిషు ప్రభుత్వం ప్రకటించిన నైట్‌హుడ్ బిరుదును తిరస్కరించారు.

ఏప్రిల్ 13, 1919న ఈ ఊచకోత జరిగింది. 14న అంత్యక్రియలు నిర్వహించేందుకు మృతుల బంధువులు అనుమతి కోరారు. అయితే బ్రిటిషు అధికారులు అంగీకరించలేదు. ఎలాంటి ఊరేగింపు లేకుండా మృతుడి కుటుంబసభ్యులు మాత్రమే పాల్గొని మౌనంగా అంత్యక్రియలు నిర్వహించాలని ఆదేశించారు. అక్కడక్కడ నిరసనలు వ్యక్తంచేస్తున్న వారిపై బ్రిటిషు దళాలు విరుచుకుపడ్డాయి. నగరంలో కొందరు గుమికూడగా అక్కడకు చేరుకున్న డయ్యర్ వారిని హెచ్చరించాడు. తాను సైనికుడినని.. ప్రజలకు శాంతి కావాలా, యుద్ధం కావాలా అని హెచ్చరిక జారీచేయడం అతడు ఎంత కఠినాత్ముడో వెల్లడించింది.

డయ్యర్ మనస్తత్వం ఎలాంటిదంటే..

రావల్పిండి.. ఇప్పటి పాకిస్థాన్ ప్రాంతంలోని ముర్రీ అనే గ్రామంలో వ్యాపారం చేసే ఎడ్వర్డ్ డయ్యర్, మేరీలకు 9 అక్టోబర్ 1864న డయ్యర్ జన్మించాడు. వారికి ఆయన ఐదవ సంతానం. నదీ పరీవాహక ప్రదేశం కావడంతో తన సోదర, సోదరీలతో ఆడుకుంటూ గడిపేవాడు. చిన్నతనంలో అతనికి నత్తి ఉండేది. స్కూల్‌కు వెళ్లే సమయంలో స్నేహితులు అతన్ని ఆటపట్టించేవారు. ఓరేయ్ నత్తోడొచ్చాడురా అని ఎగతాళి చేసేవారు. పిలిచి మరి కాశ్మీర్ అనరా అని గుంపు కూడేవారు. అతను తాశ్మీర్ అంటే నవ్వి పోనీ కలకత్తా అనుఅని మరింత రెచ్చగొట్టేవారు. తల్కాతత్తా అనగానే గొల్లున నవ్వేవారు. దీంతో స్కూలంటే ఇష్టముండేది కాదు. తోటివారిని ఎదుర్కొ వాలంటే సిగ్గు, బిడియం, భయంతో వణికిపోయేవాడు. వారి కుటుంబం వ్యాపారం కోసం సిమ్లా వెళ్లినా అక్కడి పిల్లలతో అదే సమస్య. పదేళ్ల వయస్సులో నిత్యం అవే సమస్యలతో తల్లడిల్లేవాడు. అందుకే ఎక్కువగా ఒంటరితనాన్ని గడిపేందుకు ఇష్టపడేవాడు. అదే అతన్ని క్రూరుడిగా మార్చిందంటారు. వారున్న ప్రాంతంలో ఎక్కువగా పాములుండేవట. వాటిని పట్టి తన స్నేహితులుగా ఊహించుకుని హతమార్చేవాడు. ఒకసారి స్కూల్‌కు వెళుతున్న సమయంలో తోడేలు వెంటబడిందట. కానీ డయ్యర్ ఏ మాత్రం భయపడకుండా కండ్లురిమి చూడడంతో తోడేలు భయపడి పారిపోయింది.

ఉన్నత చదువుల కోసం ఐర్లాండ్ వెళ్లాడు డయ్యర్. అక్కడ మరో రకంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. డయ్యర్ బ్రిటీష్‌వాడు అయినప్పటికీ ఇండియాలో పుట్టడం వల్ల కుర్తా, పైజామా వేసుకునేవాడు. ఆ డ్రెస్ చూసి అక్కడి విద్యార్తులు, తీవ్రంగా కామెంట్ చేసేవారు. ఒరేయ్ ఇండియా వేధవ నువు ఇండియా వాడివా లేక బ్రిటీష్ వాడివా లేక సంకరజాతినా అంటూ ఏడిపించేవారు. అది ఆయనను అనేక రకాలుగా మానసిక సంఘర్షణకు గురిచేసేది. అది డయ్యర్‌ను మరింత కృంగదీసింది. మరోవైపు మానవత్వం లేనివాడిగా తయారు చేసింది. అలా ఆయన మనుషుల మీదా తీవ్ర కోపాన్ని ప్రదర్శించేవాడు. ఆ క్రూరత్వమే డయ్యర్‌ను దుర్మార్గుడిగా తయారు చేసిందని అంటారు.

జలియన్ వాలాబాగ్ తర్వాత...

ఇంత పెద్ద హత్యాకాండ జరిగినా బ్రిటిష్ ప్రభుత్వం మొదట విచారణే చేపట్టలేదు. ఆ తర్వాత ఈ ఘోరం గురించిన వార్తలు అంతటా వ్యాపించడంతో దర్యాప్తు కోసం హంటర్ కమిటీని నియమించింది.హంటర్ కమిటీ ఇచ్చిన నివేదికల్లో సభ్యులందరి ఆమోదంతో ఇచ్చింది ఒకటి, కొందరే సమ్మతించింది మరొకటి. డయ్యర్ తప్పు ఉందని రెండు పక్షాలూ అభిప్రాయపడ్డాయి. కానీ, ఆ తప్పు ఎంత పెద్దదన్న విషయంలో విభేదించుకున్నాయి. బ్రిటిష్ ప్రభుత్వం డయ్యర్‌ను రాజీనామా చేయమంది. అక్కడి హౌస్ ఆఫ్ కామన్స్‌లో ఈ అంశంపై తీవ్రమైన చర్చ జరిగింది. డయ్యర్‌ది పూర్తిగా తప్పని సభ నిర్ణయించింది. కానీ, హౌస్ ఆఫ్ లార్డ్స్ దీన్ని తిరస్కరించింది. డయ్యర్‌కు అన్యాయం జరిగిందని బ్రిటిష్ ప్రభుత్వానికి చెప్పింది. డయ్యర్ తన పదవిని వదిలేశారు. అతన్ని బ్రిటన్ పంపించి వేసింది. భార్యతో కలసి 1920లో అక్కడికి వెళ్లాక అతన్ని సమర్థించిన మార్నింగ్ పోస్ట్ పత్రిక అతనికోసం విరాళాలు సేకరించింది. సుమారు 28 వేల పౌండ్లు సేకరించింది. కానీ దాన్ని తీసుకోవడానికి ఆయన కానీ, అతని భార్యకానీ రాలేదు. భారతీయులు ఎవరూ చంపుతారో అన్న భయమే వారిని మానసికంగా ఇంకా కుంగదీసింది. డయ్యర్ చివరిరోజులు భారంగా గడిచాయి. అనేక దీర్ఘవ్యాధులు అతన్ని చుట్టుముట్టాయి. మానసిక రుగ్మత బాగా కుంగదీసింది. ఎక్కువగా ఎవరినీ కలిసేవాడుకాదు. బిత్తరచూపులు చూస్తూ గడిపేవాడు. చివరికి రక్తపోటు పెరిగి పక్షవాతానికి దారితీసింది. మానసిక ఒత్తిడితో మంచం పట్టాడు. ఒత్తిడితో రక్తనాళాలు గట్టిపడి రక్త ప్రవాహం ఆగిపోయింది. అలా ఆయన 1927లో 62 ఏండ్ల వయస్సులో మరణించాడు. ఆయన అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో జరిగాయని అని బ్రిటీష్ అధికారులు ప్రకటించారు.

859
Tags

More News

VIRAL NEWS