పద్య రత్నాలు-24


Sun,October 20, 2019 12:57 AM

ANUBANDHAM

అనుభవం నేర్పే పాఠాలు

వరదైన చేను దున్నకు
కరవైనను బంధుజనుల కడకేగకుమీ
పరులకు మర్మము సెప్పకు
పిరికికి దళవాయితనము బెట్టకు సుమతీ!
- సుమతీ శతకం
తాత్పర్యం:చాలావరకు జీవిత సత్యాలు అనుభవంతోనే తెలుస్తాయి. వాటిలో కొన్నింటిని ఈ నీతిపద్యం పేర్కొన్నది. వరద వచ్చినప్పుడు చేనును దున్నకూడదు. కరవులో బంధుజనుల వద్దకు వెళ్లకూడదు. తోటివారి గుణం తెలుసుకోకుండా రహస్యాలు చెప్పరాదు. అలాగే, పిరికివాడికి సేనానాయక పదవిని అప్పజెప్పరాదు.

దయాసముద్రుడు రామచంద్రుడు!


DAYA-SAMUDRUDU
శ్రీ రఘురామ చారుతులసీ దళధామ శమక్షమాది శృం
గార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలామ దు
ర్వార కబంధరాక్షస విరామ జగజ్జన కల్మషార్ణవో
త్తారకనామ భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ!
- దాశరథీ శతకం

మూర్ఖుని మనసు మార్చగలమా?


MOORKUNI
ఎద్దుకైనగాని యేడాది తెల్పిన
మాట దెలసి నడచు మర్మమెఱిగి
మొప్పె తెలియలేడు ముప్పదేండ్లకునైన
విశ్వదాభిరామ వినురవేమ!
- వేమన శతకం

తాత్పర్యం:మూర్ఖుని మనసు ఎప్పటికీ మారేది కాదు. దానిని మార్చడం ఎవరి తరమూ కాదు కూడా. అందుకే, అలాంటి వారినే మూర్ఖుడు అన్నారు. ఆఖరకు మనిషి వలె ఆలోచించలేని ఎద్దుకైనా ఒక ఏడాదిపాటు ఒక పద్ధతిని అలవాటు చేస్తే అది మన మర్మాన్ని ఎరిగి నడచుకొంటుంది. కానీ, ముప్పయేండ్లపాటు ఎన్ని బోధించినా మూర్ఖునికి బోధపడదు.

కన్నవారి కోసం..


KANNAVARIKOSAM
తనయుడు చెడుగై యుండిన
జనకుని తప్పన్నమాట సతమెఱుగుదు గా
వున నీ జననీ జనకుల
కు నపఖ్యాతి యగురీతి గొనకు కుమారా!
- కుమార శతకం

తాత్పర్యం: పిల్లలను కన్నంత మాత్రాన మన బాధ్యత తీరిపోతుందా? వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దనవసరం లేదా? గాలికి వదిలేస్తే ఏ పిల్లలైనా చెడుగులై పోతారు. అందుకే, ఉదా॥కు కుమారుడు చెడ్డవాడయ్యాడంటే తండ్రిదే తప్పుగా భావించాలి. కూతురు విషయంలో తల్లి బాధ్యత వహించాలి. అలాగే, పిల్లలు కూడా తమ కన్నవారి పరువు తీసే పనులు చేయకూడదు.

తాత్పర్యం:శ్రీరఘువంశ తిలకుడు, పవిత్ర తులసీమాలలు ధరించినవాడు, శాంతి, ఓర్పు వంటి సుగుణాల కోవిదుడు, మూడు లోకాల వాసులు కొనియాడదగిన శౌర్యపరాక్రమాలను ఆభరణాలుగా గలవాడు, కబంధుడు వంటి ఎందరో రాక్షసులను హతమార్చినవాడు, ప్రజల పాపాలను ఉద్ధరించేవాడు, దయసాగరుడు.. ఆ రామచంద్రమూర్తి ఎంత గొప్పవాడో కదా.

211
Tags

More News

VIRAL NEWS