హిందూ సంఘటితమే లక్ష్యంగా తుదివరకు పోరాడిన హెడ్గేవార్


Sun,October 13, 2019 03:17 AM

Hedgewar
యువతరం అంటే సుగంధం వెదజల్లే సుమాలు.. తాజాగా ఉన్నపుడే ఈ సుమాలు భరతమాత పాదాల చెంతకు చేరాలి.. ఏ వాసన లేని, వాడిపోయిన పూలు అర్చనకు నిరుపయోగం అనేవారు హెడ్గేవార్. వైవిధ్యంలోనే ఏకత ఉందని, భిన్నత్వాన్ని కాపాడుకుంటూ భరతమాత సేవలో అందరూ పునీతం కావాలని అయన పిలుపునిచ్చారు. హిందూ సమాజాన్ని జాగృతం చేసేందుకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్)ను స్థాపించిన జాతీయవాదిగా ఆయన పేరు భారతదేశ చరిత్రలో చిరస్మరణీయం. మన దేశంలో స్వాతంత్య్ర సమరం సాగుతున్న కాలంలో స్వాతంత్య్రం కోసం గాంధీజీ, అస్పృశ్యత నివారణకు అంబేద్కర్, విప్లవమే శరణ్యమన్న వీరసావర్కర్ విభిన్న మార్గాల్లో కృషి చేస్తుండగా- హిందూ సమాజాన్ని సంఘటితం చేయాలని హెడ్గేవార్ దృఢదీక్ష వహించారు. ఒకవేళ బ్రిటీష్ వారు వెళ్లిపోయినా- హిందువులంతా శక్తివంతమైన దేశంగా అవతరిస్తే తప్ప.. మన స్వేచ్ఛను మనం పరిరక్షించుకోలేం.. అని ఖరాఖండిగా చెప్పిన కేశవ్ బలిరాం హెడ్గేవార్ చివరిపేజీ.

అవి మన దేశంలో బ్రిటీష్ పాలన సాగుతున్న రోజులు. బ్రిటీష్ రాణిగా తన పాలన 60 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వారి పాలన సాగుతున్న అన్ని దేశాల్లో ఉత్సవాలు నిర్వహించారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ ప్రాథమిక పాఠశాలలోనూ పిల్లలకు మిఠాయిలు పంచిపెడుతున్నారు. అందరూ ఆనందంగా వాటిని తింటు న్నారు. కానీ ఒక బాలుడు మాత్రం తను తిననంటే తిననని పట్టుపట్టాడు. పరాయిపాలకుల వార్షికోత్సవానికి పంచే మిఠాయిలను ముట్టుకోనని శపథం చేశాడు. అంతేకాదు, హైస్కూల్లో చదువుతుండగా బ్రిటిష్ వారి ఆదేశాలకు విరుద్ధంగా వందేమాతరం గీతాన్ని ధైర్యం గా ఆలపించాడా బాలుడు. ఆనాటి ఆ బాలుడే కేశవ్ బలిరాం హెడ్గేవార్.తెలంగాణలోని ఇందూరు (నిజామాబాద్) జిల్లా కందకుర్తి హెడ్గేవార్ పూర్వీకుల నివాస స్థలం. ఆయన ఏప్రిల్ 1, 1889న జన్మించారు. నైజాం కాలంలో ఆ కుటుంబానికి చెందిన నరహరి శాస్త్రి బతుకుతెరువు కోసం నాగ్‌పూరుకు వలసపోయారు. వారిది పండిత కుటుంబం. ఆ వంశంలో జన్మించిన కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ చిన్నతనంలో పేదరికాన్ని అనుభవించారు. చిన్నతనంలోనే ఆయన తల్లిదండ్రులను కోల్పోయారు. కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నా హెడ్గేవార్‌కు శైశవ ప్రాయం నుంచే దేశం అంటే ఎనలేని భక్తి. ప్రారంభంలో విప్లవ భావాల పట్ల ఆకర్షితుడై కోల్‌కతా చేరుకున్నారు.

ఆయన మానసికంగా ఇబ్బంది పడుతూనే చికిత్సకు సహకరించారు. ఆయన శరీరం నుండి ద్రవాన్ని తొలగించారు. అయినా ఆయన నొప్పి తగ్గలేదు. కదలలేని పరిస్థితికి చేరుకున్నారు. ఆ తరువాత పూర్తిగా కోమాలోకి వెళ్లారు. శరీరంలో కదలికలు లేవు. చూపులు లేవు. శరీరంలో ఉష్టోగ్రత తీవ్రంగా పెరిగి 105 డిగ్రీలకు చేరుకుంది. అప్పటికే నాలుగు రోజులుగా ఆయనలో చలనం లేదు. ప్రముఖ వైద్యులందరూ వచ్చి ఏమీ చేయలేమని తేల్చిచెప్పారు. వేలాది మంది కార్యకర్తలు ఆయన కోలుకోవాలని కన్నీటితో ప్రార్థనలు చేశారు. కానీ వారి ప్రార్థనలు అన్నీ వ్యర్థమయ్యాయి.

అక్కడ వైద్యవిద్యను అభ్యసిస్తూనే విప్లవకారుల సమన్వయ సంస్థ అయిన అనుశీలన సమితిలో పనిచేశారు. దేశం కోసం పనిచేయాలంటే అందరినీ కలుపుకొని పోవడం ఒక్కటే ఏకైక మార్గం అని ఆయన నమ్మేవారు. వైద్యవిద్య పూర్తయ్యాక తిరిగి నాగ్‌పూర్ చేరుకుని స్వాతంత్య్ర పోరాటం సందర్భంగా కాంగ్రెస్‌లో చేరారు. వైద్యవిద్య చేపట్టి సేవలందిస్తాడని అందరూ అనుకున్నప్పటికీ ఆయన మాత్రం వైద్యుడిగా ఒకరిద్దరి రుగ్మతలను మాత్రమే రూపుమాపగలను. కానీ సామాజిక రుగ్మతలు చెరిగిపోవాలంటే స్వాతంత్రపోరాటం ఒక్కటే మార్గమని ఆయన చెప్పేవారు. అలా ఆయన తన జీవితాన్ని పూర్తిగా దేశం కోసం అంకితం చేశారు. స్వేచ్ఛ కోసం గళం విప్పిన ఆయన రెండుసార్లు జైలుశిక్ష అనుభవించారు.హిందూసమాజంలోని అనైక్యత మూలంగానే దేశానికి స్వాతంత్య్రం రావడం కష్టమవుతున్నదని, అందర్నీ ఏకం చేసినప్పుడే భారతదేశం ముందడుగు వేయగలుగుతుందని ఆయన విశ్వసించారు. హిందువులను సంఘటితం చేస్తేనే జాతీయత సాధ్యమని భావించిన హెడ్గేవార్1925లో విజయదశమి రోజున తన 36వ ఏటా 1925లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌ను స్థాపించారు. 1925-40 వరకూ సంఘ్ కార్యకలాపాలను విస్తరింపజేస్తూనే స్వాతంత్య్ర సమరంలోనూ పాల్గొన్నారు.

1940 అప్పటికీ ఆర్‌ఎస్‌ఎస్ స్థాపించి పదిహేనేళ్లు.

అప్పుడే హెడ్గేవార్‌లో ఆలోచన మొదలైంది. నేను స్థాపించిన సంస్థ ఇన్నేళ్లలో ఎంతో వృద్ధి చెందింది. కానీ నేను అనుకున్న లక్ష్యాన్ని సాధించగలిగానా అన్నది ఆయన మనసును తొలుస్తున్నది. ప్రస్తుతానికి బలమైన సంఘంగా ఉన్నప్పటికీ నా తర్వాత ఏమిటీ అనేది ఆయనను వేధిస్తున్న ప్రశ్న. అందుకు కారణం లేకపోలేదు. అప్పటికే ఆయన అనారోగ్యానికి గురయ్యారు. చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ సంఘ విస్తరణ కోసం దేశవ్యాప్తంగా ఆయన పర్యటిస్తూనే ఉన్నారు. కానీ ఇపుడు ఆయనలో ఆ శక్తి లోపించింది. ఈ పదిహేనేండ్ల కాలంలో అనేకమంది యువకులు ఆయనతో కలిశారు. ఆయన మాట మీద నమ్మకంతో బ్రహ్మచర్య దీక్షతో తమ కుటుంబాలను వదులుకుని ఆయన వెంట హిందూ సమాజ లక్ష్య సాధన దిశలో అడగులో అడుగు వేసి నడిచారు.

అయితే ఆ తక్కువ కాలంలో ఆయన లక్ష్యాలన్నీ నెరవేరలేదన్నది నిజం. దానికి కారణాలూ ఉన్నాయి. ముఖ్యంగా పరాయి పాలనలో ఉండడం, హిందూ సమాజంలో చైతన్యం, ఐక్యత కొరవడడం ఒక కారణం కాగా, అప్పటికే ప్రత్యామ్నాయంగా సాగుతున్న స్వాతంత్య్ర పోరాటం కూడా కారణమైంది. అయితే అటు స్వాతంత్య్రపోరాటంతోపాటు ఇటు హిందువుల్లో చైతన్యం తీసుకువచ్చేలా ఆయన చేసిన కార్యకలపాలు అనేకమందిని ఆకర్షించాయి. కొన్ని విమర్శలు కూడా లేకపోలేదు. వాటిని ఏ మాత్రం పట్టించుకోకుండా ఆయన ముందుకు సాగారు. అయితే ఆయన బతికున్న రోజుల్లో మాత్రం ఆయన అనుకున్న లక్ష్యాలేవి సాధ్యం కాలేదని నిత్యం బాధపడేవారు.

1940 మే నెల హెడ్గేవార్ తీవ్ర ఆస్వస్థతకు గురయ్యారు.

ఆయనను రాజ్‌గడ్‌లోని ఆసుపత్రిలో చేర్చారు. ఆయన పూర్తిగా మంచానికే పరిమితమయ్యారు. నిరంతర ప్రయాణాలు, ఎడతెరిపి లేని ప్రసంగాలు, నిద్రలేమి, సమయానికి భోజనం లేకపోవడం తదితర కారణాలతో ఆయన మంచం పట్టారు. మరోవైపు తను స్థాపించిన సంస్థ లక్ష్యాలను చేరుకోలేకపోయిందే అనే బాధ కూడా ఆయనను మానసికంగా ఇబ్బందులకు గురిచేసింది. దీంతో ఆయన మంచం పట్టారు.

Hedgewar1

జూన్‌నెల, నాగ్‌పూర్ పట్టణం ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తల శిక్షణా శిబిరం

తన ఊరిలో సంఘ కార్యకర్తల శిక్షణా కార్యక్రమం జరుగుతున్నా వారిని కలువలేకపోతున్నానని హెడ్గేవార్ మానసికంగా ఆందోళనకు గురయ్యాడు. ఆయన పరిస్థితి చూసిన డాక్టర్లు ఆయనను ఒక్కసారి వారి వద్దకు తీసుకెళ్తే కొంతమేర ఉపశమనం కలగవచ్చన్న సూచనతో అప్పటికీ 24 రోజులుగా మంచానికే పరిమితమైన ఆయనను శిక్షణ శిబిరం వద్దకు తీసుకువెళ్లారు. కూర్చుని వారిని ఉద్దేశించి మాట్లాడడం ప్రారంభించారు. నాలుగు మాటలు మాట్లాడరో లేదో హఠాత్తుగా మాటలు ఆపేసి కళ్లు మూసుకున్నారు. అక్కడంతా నిశ్చబ్దం అలుముకుంది. అందరూ ఆయన చనిపోయారనే అనుకున్నారు. అందరి కళ్ళూ చమర్చాయి. కానీ ఆయన శ్వాస తీసుకుంటూనే ఉన్నారు. నెమ్మదిగా ఆయనను ఇంటికి చేర్చారు.

బతికి ఉన్నాడన్నట్లే కానీ నడవలేని, మాట్లడలేని స్థితికి చేరుకున్నారు. రోజురోజూకీ ఆయన ఆరోగ్యం మరింత క్షీణిస్తున్నది. కార్యకర్తల్లో ఆందోళన మొదలైంది. తిరిగి జూన్ 15వ తేదీన నాగ్‌పూర్‌లోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో చేర్చారు. వారు అన్ని రకాల పరీక్షలు చేసినప్పటికీ సమస్య ఏమిటనేది మాత్రం తేలలేదు. ఎన్ని మందులు వాడినా విడవని జ్వరం, వీపులో నొప్పి ఆయనను ఊపిరి తీసుకోనివ్వడం లేదు. మరోవైపు అక్కడి వాతావరణం పడకపోవడంతో ఆయన ఇంటికి వెళ్దామని చెప్పడంతో స్థానికంగా ఓ సంఘ కార్యకర్త ఇంటికి చేర్చారు. ఎందరో జాతీయ నాయకులు ఆయనను చూడడానికి వచ్చారు. సుభాష్ చంద్రబోస్ కూడా వారిలో ఉన్నాడు.
ఇక తన మరణం ఖాయం అనుకున్న ఆయన చివరిసారి తన కార్యకర్తలతో సమావేశమయ్యారు. మంచంమీదే కూర్చుని అందరితో కలసి తేనీటి విందు స్వీకరించారు. తను మరణిస్తే సంఘ బాధ్యతలు ఎవరెవరు తీసుకోవాలో దిశానిర్దేశం చేశారు. మరోవైపు ఆయన వీపుభాగంలో పేరుకుపోయిన ద్రవాన్ని శస్త్రచికిత్స ద్వారా తొలగించాలని డాక్టర్లు చెప్పారు. అయితే దానివల్ల మనిషి ప్రాణాలకే ప్రమాదమని కూడా చెప్పారు. అయినా హెడ్గేవార్ ప్రస్తుత నొప్పి భరించడం కంటే దానికే సిద్ధం. ఏది జరిగినా మన చేతిలో లేదు కదా అని చికిత్సకు సిద్ధమయ్యారు.

ఆయన మానసికంగా ఇబ్బంది పడుతూనే చికిత్సకు సహకరించారు. ఆయన శరీరం నుండి ద్రవాన్ని తొలగించారు. అయినా ఆయన నొప్పి తగ్గలేదు. కదలలేని పరిస్థితికి చేరుకున్నా రు. ఆ తరువాత పూర్తిగా కోమాలోకి వెళ్లారు. శరీరంలో కదలికలు లేవు. చూపులు లేవు. శరీరంలో ఉష్టోగ్రత తీవ్రంగా పెరిగి 105 డిగ్రీలకు చేరుకుంది. అప్పటికే నాలుగు రోజులుగా ఆయనలో చలనం లేదు. ప్రముఖ వైద్యులందరూ వచ్చి ఏమీ చేయలేమని తేల్చిచెప్పారు. వేలాది మంది కార్యకర్తలు ఆయన కోలుకోవాలని కన్నీటితో ప్రార్థనలు చేశారు. కానీ వారి ప్రార్థనలు అన్నీ వ్యర్థమయ్యాయి.
1940 జూన్ 21న ఉదయం 9.27 నిమిషాలు. వందలాది మంది కార్యకర్తలు చూస్తుండగానే కోమాలోనే స్థానిక రేషన్‌బాగ్‌లో ఆయన తుదిశ్వాస విడిచారు.
-మధుకర్ వైద్యుల, సెల్: 9182777409

707
Tags

More News

VIRAL NEWS