రాశి ఫలాలు


Sun,October 6, 2019 02:02 AM

6-10-2019 నుంచి 12-10-2019 వరకు

మేషం

ఈ వారం అనుకూలంగా ఉంటుంది. పూర్వ పెట్టుబడుల వల్ల ఆదాయం పెరుగుతుంది. ఇతరుల సహాయ సహకారాలు అందుతాయి. ప్రయాణాలు కలిసొస్తాయి. మనఃశ్శాంతి ఉంటుంది. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కలిసొస్తుంది. వాహనాల వల్ల పనులు నెరవేరుతాయి. ఉద్యోగులకు మంచి పేరు లభిస్తుంది. ఆరోగ్యంగా ఉంటారు. రాజకీయంలో కార్యకర్తలతో అనుకూలత ఉంటుంది. శుభకార్యాల ప్రయత్నాలలో ఆటంకాలు ఉంటాయి. తీర్థయాత్రలు, విహారయాత్రల వల్ల ఊరట లభిస్తుంది. రోజువారీ వ్యాపారంలో ఒత్తిడి ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి.

వృషభం

రోజూవారీ వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. పని ఒత్తిడి ఉన్నప్పటికీ పనులు పూర్తవుతాయి. ఉన్నతవిద్య కొనసాగుతుంది. గ్రంథ పఠనం , దేవతా గురుభక్తి పెరుగుతుంది. సమాజంలో పేరు ప్రతిష్ఠలు ఉన్నవారితో స్నేహం చేస్తారు. తద్వా రా పనులు కలిసొస్తాయి. శుభకార్యాలు ఆచరిస్తారు. వ్యాపారాలు అనుకూలిస్తాయి. పెట్టుబడులకు ముందు కొంత ఆలోచన అవసరం. గృహ నిర్మాణ రంగాల్లో పనులు నెరవేరుతాయి. తాత్కాలిక ప్రయోజనాలతో పనులు నెరవేరుతాయి. అయితే అనవసరమైన ఖర్చులను నియంత్రించుకోవడం అవసరం.

మిథునం

భార్యా పిల్లలతో సంతృప్తిగా ఉంటారు. విందులు, వినోదాలలో పాల్గొంటారు. సంగీత, సాహిత్య, సినిమా రంగాల వారికి అనుకూలిస్తుంది. రాజకీయ, కోర్టు వ్యవహారాల్లో ప్రతికూల ఫలితాలు, అనవసరమైన కాలయాపన. రావాల్సిన తీర్పుల్లో ఆలస్యం. ఉద్యోగులకు ప్రతికూల ప్రాంతాలకు ట్రాన్స్‌ఫర్‌లు. ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నవారు తాత్కాలికంగా ఉద్యోగాన్ని పొందుతారు. పెద్దల సూచనలను పాటించక పోవడంతో కొన్ని విషయాలలో సమస్యలను ఎదుర్కొంటారు. పెట్టుబడి విషయాలలో జాగ్రత్త అవసరం.

కర్కాటకం

ఈ వారం బాగా కలిసి వస్తుంది. ధైర్యంతో పనులు చేస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. భార్యా పిల్లలతో సంతృప్తిగా ఉంటారు. నూతన వస్త్ర, వస్తువులను, నగలను కొంటారు. వృత్తి, వ్యాపారాలు అనుకూలిస్తాయి. రాజకీయ, కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. అనుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపారులకు సంతృప్తికరమైన వారం. ఆఫీసులో తోటి వారితో మంచి అవగాహన ఏర్పడుతుంది. పేరు సంపాదిస్తారు. పై అధికారుల అండదండలు లభిస్తాయి. చదువు, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు.

సింహం

ప్రయాణాలు కలిసొస్తాయి. మంచి ఆలోచనలు స్ఫురిస్తాయి. పెట్టుబడులు, వృత్తి, వ్యాపారాల్లో తాత్కాలిక ప్రయోజనాలుంటాయి. న్యాయవాద, వైద్య వృత్తులలో ఉన్న వారు సంతృప్తిగా ఉంటారు. ఆయా రంగాల వ్యాపారాల్లో ఉన్నవారికి ప్రయోజనం చేకూరుతుంది. బంధుమిత్రులతో ఓపికతో వ్యవహారం అవసరం. పెద్దల సూచనలను పాటించడంతో కొన్ని పనులలో అనుకూలత ఏర్పడుతుంది. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి తాత్కాలికంగా ఊరట లభిస్తుంది. పర్మనెంట్‌ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు అవసరం.

కన్య

వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. భార్యా పిల్లలతో సంతృప్తిగా ఉంటారు. విందులు, వినోదాలలో పాల్గొంటారు. ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా ఊహించు కోవడంతో మానసిక అశాంతి. కొన్ని పనులు వాయిదా పడడం, పెద్దవారి సహాయ సహకారాలు లభిస్తాయి. వారితో పనులలో ప్రయోజనం చేకూరుతుంది. ఏది ఏమైనా తొందరపడి సాహసంతో పనులు చేయరాదు. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి తాత్కాలికంగా ఉద్యోగం లభిస్తుంది.

తుల

ఆదాయ పరిస్థితి మెరుగవుతుంది. పనివారితో సమస్యలు తీరుతాయి. డబ్బు సకాలంలో అందుతుంది. శుభకార్యాలు, చదువు, ఉద్యోగ ప్రయత్నాలలో సత్ఫలితాలు ఉంటాయి. అనుభవజ్ఞులతో సత్సంబంధాలు ఉంటాయి. మంచి ఆలోచనలు స్ఫురిస్తాయి. సకాలంలో అమలు పరుస్తారు. తీర్థయాత్రలు, పుణ్యనదీ స్నానాలు ఆచరిస్తారు. వస్త్ర, వస్తువులను, ఆభరణాలను కొంటారు. పిల్లల శుభకార్యాలు అనుకూలిస్తాయి. విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు. పోటీ పరీక్షలలో సత్ఫలితాలు పొందుతారు.

వృశ్చికం

బంధుమిత్రులతో, అన్నదమ్ములతో పనులు నెరవేరుతాయి. దగ్గరివారితో సత్సంబంధాలు పెరుగుతాయి. వాహనాలవల్ల పనులు నెరవేరుతాయి. నిర్మాణ రంగంలో ఉన్న వారికి తాత్కాలిక ప్రయోజనాలు ఉంటాయి. వ్యవసాయదారులకు దిగుబడి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులు మంచి పేరు సంపాదిస్తారు. అందరితోనూ సమయస్ఫూర్తితో మెలగుతారు. అధికారుల ఆదరణ ఉంటుంది. ముఖ్యమైన పనులను అప్పజెప్తారు. శ్రద్ధతో వాటిని సకాలంలో పూర్తి చేయడంతో మంచిపేరు సంపాదిస్తారు. ఇంట్లో భార్యాపిల్లలతో సంతోషంగా ఉంటారు.

ధనుస్సు

త తాత్కాలికంగా కలిసొస్తుంది. ఉద్యోగస్తులకు ఆఫీసులో అందరితోనూ సమన్వయంగా ఉంటారు. పేరుపొందుతారు. తోటి ఉద్యోగులతో, పైఅధికారులతో సంబంధాలు పెరుగుతాయి. అనుకూల ప్రాంతాలకు ట్రాన్స్‌ఫర్‌లు, ప్రమోషన్‌లు ఉంటాయి. రాజకీయ, కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితాలుంటాయి. ఆరోగ్యంగా ఉంటారు. భార్యాపిల్లలతో సంతృప్తిగా గడుపుతారు. వస్త్ర, వస్తువులను కొంటారు. వివిధ వ్యాపారస్తులు లాభాలు గడిస్తారు. విందులు, వినోదాలలో పాల్గొంటారు. న్యాయవాద, వైద్య వృత్తులలో ఉన్నవారు ప్రత్యేకంగా సౌఖ్యంగా ఉంటారు.

మకరం

పనులు సకాలంలో పూర్తవుతాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉన్నతవిద్యా ప్రయత్నాలు, విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. పేరు సంపాదిస్తారు. ప్రతి విషయంలోనూ అనుకూలత ఉం టుంది. వృత్తి, వ్యాపారాలు కలిసి వస్తాయి. ప్రయాణాలు కలిసివస్తాయి. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేస్తారు. పనివారితో సఖ్యతతో ఉండాలి. వాహనాల విషయమై ఖర్చులు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు. పోటీ పరీక్షలలో అనుకూలత ఉంటుంది. తొందరపాటు లేకుండా ముందుకు వెళ్తే అనుకూలత ఉంటుంది.

కుంభం

పనులలో ఆటంకాలు తొలగుతాయి. రావలసిన డబ్బు అందుతుంది. ఆదాయ పరిస్థితి మెరుగవుతుంది. పనివారితో ఉన్న సమస్యలు తీరుతాయి. తీర్థయాత్రలు, పుణ్యనదీ స్నానాలు ఆచరిస్తారు. పెద్దల సహాయ సహకారాలు అందుతాయి. భక్తి భావనలు పెరుగుతాయి. భార్యాపిల్లలతో హాయిగా ఉంటారు. విందులు, వినోదాలలో పాల్గొంటారు. వ్యాపారాల్లో ఉన్న వారి ఆదాయం పెరుగుతుంది. నలుగురితో పరిచయాలు ఏర్పడతాయి. అనవసరమైన ఆలోచనలకు ప్రాధాన్యం ఇవ్వకండి.

మీనం

కొత్త వారితో పరిచయాలు ఏర్పడతాయి. అదృష్టం కలిసి వస్తుంది. విద్యార్థులకు అనుకూలమైన సమయం. మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. పోటీ పరీక్షలలో సత్ఫలితాలు పొందుతారు. ప్రయత్నాలతో వారు ఉద్యోగం పొందుతారు. శుభకార్యాలు చేస్తారు. భార్యాపిల్లలతో సంతృప్తిగా ఉంటారు. వస్త్ర, వస్తువులు, నగలను కొంటారు. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార పనులు నెరవేరుతాయి. కొత్త వస్తువులను కొంటారు. ఒక పక్కన ఆర్థిక పరమైన సమస్య కూడా ఉంటుంది. ఓపికతో, సమయస్ఫూర్తితో సమస్యలను అధిగమిస్తారు. ఆస్తి తగాదాలు ఒక కొలిక్కి వస్తాయి.
rasi-phalalu
గుడి ఉమా మహేశ్వరశర్మ సిద్ధాంతి
ఎం.ఎస్సీ., నిర్మల పంచాంగకర్త
నల్లకుంట, హైదరాబాద్‌., ఫోన్‌: 040-27651530
ఈ మెయిల్‌ : [email protected]

2234
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles