ప్రపంచాన్ని ప్రేమిస్తుంది!


Sun,September 29, 2019 01:27 AM

EeezaBelli
వరల్డ్ ఫేమస్ లవర్.. త్వరలో రానున్న విజయ్ దేవరకొండ సినిమా ఇది. ఆ సినిమాలో ఒక హీరోయిన్‌గా నటిస్తున్న.. ఇజాబెల్లి లైట్ గురించి నెట్‌లో చాలామంది వెతుకుతున్నారు. విజయ్‌తో డేటింగ్‌లో ఉందంటూ.. నెట్టింట ఒక సెల్ఫీ చక్కర్లు కొడుతున్నది.. మరి అందరూ ఆమెను ఆసక్తిగా చూస్తున్నప్పుడు.. ఆమె గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకోకపోతే ఎలా?

-సౌమ్య నాగపురి

-బెల్లీ 1990 సెప్టెంబర్ 1న బ్రెజిల్‌లో జన్మించింది. తండ్రి పోలీసాఫీసర్. తల్లి హోమ్‌మేకర్.
-మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జన్మించిన ఈ అమ్మడు డబ్బులు సంపాదించడం కోసం ఇండియా రావాలనుకుంది. కానీ 14 సంవత్సరాల వయసు నుంచే చిన్న చిన్న ఉద్యోగాలు చేసింది.
-లాక్మే బ్యూటీ ప్రాడక్ట్స్, పీ అండ్ జీ, బిగ్‌బజార్, పాకిస్థానీ బ్రాండ్ నిషాత్ లెనిన్‌కి బ్రాండ్ మోడల్‌గా పనిచేసింది. ఎన్నో టీవీ కమర్షియల్స్ నటించింది.
-బెల్లీకి ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. ఆమె ఇన్‌స్టా చూస్తే అందులో ప్రపంచం మొత్తం చుట్టేసిన ఫొటోలు కనిపిస్తాయి.
-మొదటి సినిమా చేసేటప్పటికీ ఈ అమ్మడికి ఇంగ్లిష్ మాట్లాడడం సరిగా రాకపోయేది. దీనికోసం వర్క్‌షాప్‌లు కూడా అటెండ్ అయింది.
-బెల్లీకి పుస్తకాలంటే ప్రాణం. కాస్త ఖాళీ సమయం దొరికినా పుస్తకం చేత పట్టుకుంటుందట. ఈమె పెట్ లవర్.
-గురు రాంధ్వాతో లగ్డీ లాహోర్ డీ.. మ్యూజిక్ వీడియోలో మెరిసింది.

మిస్టర్ మజ్నులో

కూడా ఈ అమ్మడు కనిపించింది. అయితే ఈ సినిమా ప్రమోషన్ అప్పుడు బ్రెజిల్‌లో బీచ్ వాలీబాల్ ఆడుతున్నప్పుడు కాలు బెణికిందట. అందుకే ప్రమోషన్‌లో పాల్గొనలేదు.

విరాట్ కోహ్లీతో

ఈ అమ్మడు రెండు సంవత్సరాల పాటు డేటింగ్ చేసింది. ఆ తర్వాత వీళ్ల రిలేషన్ వర్కవుట్ కాలేదు. ఈ రిలేషన్ గురించి మాట్లాడడం ఆమెకు నచ్చదట.

సింగపూర్‌లో

-విరాట్‌తో దిగిన ఫొటోలు వైరల్ అయ్యాయి. విరాట్ కోసం బ్రెజిల్ వదిలి ముంబై వచ్చిందని అప్పట్లో పుకార్లు షికార్లు చేశాయి.
Virat

-2012లో తలాష్ సినిమాతో బాలీవుడ్‌లో చిన్న రోల్‌తో ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ తర్వాత సంవత్సరం వచ్చిన సిక్స్‌టీన్ సినిమాతో ఈ అమ్మడు పాపులర్ అయింది.
-విరాట్‌తో విడిపోయాక బెల్లి.. సిద్దార్థ్ మల్హోత్రతో డేటింగ్ చేసిందనే వార్తలు వచ్చాయి. కానీ వీరి రిలేషన్ బ్రేక్ అయింది. కానీ ఇప్పటికీ వీళ్లిద్దరూ మంచి ఫ్రెండ్స్‌గా మాత్రం మిగిలారు.
Vijay-Devarakonda1

215
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles