నెట్టిల్లు


Sun,September 29, 2019 02:13 AM

ప్రేమే కథా వస్తువుగా ఎన్నో చిత్రాలు, లఘుచిత్రాలు వస్తున్నాయి. కానీ నిజమైన ప్రేమ ఎలా ఉంటుంది? జీవితాంతం దాని ప్రభావం ఏంటి? అనే పరిస్థితులను చాలా తక్కువ మంది చూపిస్తారు. అలాంటి ప్రయత్నమే ఈతరం యువదర్శకులు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలే లఘుచిత్రాలుగా వచ్చాయి.

ప్రేమించే ప్రేమవా

దర్శకత్వం: ప్రేమ్ కడియం
నటీనటులు : సంపత్, వినిత్, ఐశ్వర్య
అర్జున్, ఐశ్వర్య ప్రేమించుకుంటారు. ఇంట్లో వాళ్లు ఒప్పుకోకపోవడంతో అందరినీ కాదని బయటకు వస్తారు. అర్జున్, ఐశ్వర్యతోనే ఉంటాడు. మరోవైపు అర్జున్‌ను చిన్నప్పటి నుంచి అతని మరదలు వినిత ఎంతగానో ఇష్టపడుతుంది. కానీ అర్జున్, ఐశ్వర్యను ఇష్టపడతాడు. వీళ్లిద్దరి మధ్య వినిత ఓ ఫ్రెండ్‌లా వస్తుంది. మైండ్ నుంచి మెమరీస్‌ను తీసేయొచ్చు అనే కాన్సెప్ట్‌తో అర్జున్‌ను డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తుంది. ఓ పథకం ప్రకారం అర్జున్, ఐశ్వర్య మైండ్ నుంచి వారి జ్ఞాపకాలను చెరిపేస్తుంది. కానీ కొన్ని రోజులకు మళ్లీ అర్జున్, ఐశ్వర్య అనుకోకుండా పరిచయం అవుతారు. గతంలోని వారి పరిచయానికి సంబంధించిన జ్ఞాపకాలు ఏమీ లేవు కాబట్టి మళ్లీ కొత్తగా పరిచయం చేసుకుంటారు. ఇదంతా వినితకు గిట్టదు. ఓ రోజు ఐశ్వర్యకు ప్రమాదం జరుగుతుంది. ఇది అర్జున్‌ను తీవ్రంగా బాధిస్తుంది. పక్కనే ఉన్న మరదలు ప్రేమను కాదని రెండు రోజుల కిందటే పరిచయం అయిన ఐశ్వర్య గురించి ఎందుకింత బాధ పడుతున్నానో అనుకుంటాడు. అప్పుడే వినిత ఇదంతా చెపుతుంది. కావాలని జ్ఞాపకాలను చెరిపేయించినట్టు వివరిస్తుంది. మెదడు నుంచి జ్ఞాపకాలను చెరిపేసేంత టెక్నాలజీ అభివృద్ధి చెందినా మనసులోని ప్రేమ మాత్రం ప్రాణం ఉన్నంత వరకూ నిలిచే ఉంటుందనే సందేశంతో లఘు చిత్రం ముగుస్తుంది.
Preminche-premava

Total views 44,830+ (సెప్టెంబర్ 20 నాటికి) Published on Sep 13, 2019


భాను

దర్శకత్వం: భాను ప్రకాశ్
నటీనటులు : గౌతమ్, స్వప్న, పూజిత, చైతన్య.
ప్రపంచంలో ఎంతమంది ఉన్నా ఒకరి మనసు మాత్రం నచ్చిన వాళ్ల దగ్గరే ఆగిపోతుంది. ఈ లఘుచిత్రంలో భాను అనే అబ్బాయిది ఇదే పరిస్థితి. చిన్నప్పటి నుంచీ ప్రేమించిన అమ్మాయి వేరే వ్యక్తిని పెండ్లి చేసుకొని వెళ్లిపోతుంది. పన్నెండేండ్లు ప్రేమించుకుంటారు ఇద్దరు. కానీ అమ్మాయి పెండ్లితో దూరం అవుతారు. కానీ భాను మాత్రం ఆ ప్రేమనుంచి బయటకు రాడు ప్రేమకు గతం ఉంటుందేమో కానీ ప్రేమ ఎప్పుడూ గతం కాదు అని అంటాడు. పెండ్లి సంబంధాలు వచ్చినా కాదంటాడు. ఎప్పటికీ ఆ అమ్మాయినే ప్రేమిస్తుంటాను అనుకుంటాడు. ఫ్రెండ్స్ ఎంత చెప్పినా వినడు. ఈ క్రమంలో ఫ్రెండ్స్‌తో ఒకరోజు ఓ హోటల్‌కు వెళ్తాడు. అక్కడ అనుకోకుండా ఆ అమ్మాయిని చూస్తాడు. భాను ఇంకా ఆమెను మర్చిపోలేడని తనకు అర్థం అవుతుంది. ఇంకా మౌనంగా ఉంటే బాగోదని ఆమె భానును పలకరిస్తుంది. తన పరిస్థితి కూడా చెప్తుంది. పన్నెండేండ్లు ప్రేమించిన వ్యక్తి దూరమైతే ఆ వ్యక్తి ఎలా బాధపడుతాడో ఈ లఘుచిత్రంలో చూపించే ప్రయత్నం చేశారు. డైలాగులు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి.
bhanu

Total views 26,900+ (సెప్టెంబర్ 20 నాటికి) Published on Sep 13, 2019


అభిసర్గ

దర్శకత్వం: సుశిల్
నటీనటులు : చైతన్య, రేవతి
ప్రేమించి పెండ్లి చేసుకొనే వారి కంటే పెండ్లి చేసుకొని ప్రేమించుకొనే వారే ఆనందంగా ఉంటారు అనే స్టోరీలైన్‌తో ఈ లఘు చిత్రం తీశారు. విషయానికొస్తే హీరో ఇందులో గిటారిస్ట్. ఓ రోజు ఓ కెఫేలో గిటార్ ప్లే చేస్తూ ఉంటాడు. అతన్ని ఓ అమ్మాయి గమనిస్తుంది. వెంటనే మనోడి దగ్గరకు వచ్చి కూర్చుకుంటుంది. ఆ అమ్మాయిని అలానే చూస్తూ గిటార్ ప్లే చేస్తాడు. అప్పుడు ఆ అమ్మాయే మాట్లాడడం ప్రారంభిస్తుంది. ఏంటి అలా చూస్తున్నావు అంటూ మొదలు పెడుతుంది. దీంతో మనోడి దగ్గర పెండ్లి, ప్రేమ థియారీలను ఆ అమ్మాయికి అప్పజెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఇదంతా అమ్మాయి వింటూనే ఉంటుంది. ఇలా ఇద్దరి మధ్య కొంత సేపు మాటలు సాగుతాయి. పెండ్లి,ప్రేమ, ప్రేమ తర్వాత పెండ్లి, పెండ్లి తర్వాత ప్రేమ మీద ఎక్కువ సేపు మాట్లాడుకుంటారు. మాటల్లోనే మాటగా ఆ అబ్బాయి ఆమెను ప్రేమిస్తున్నట్టు, తొలి చూపు ప్రేమ అని పెండ్లి చేసుకుంటాని అని చెప్తాడు. ఎంత ప్రేమిస్తున్నావ్ అని అడుగుంది. దానికి అబ్బాయి నేరుగా వెళ్లి ముద్దు పెడతాడు.. తర్వాత సీన్ ఎంటో తెలియాలంటే యూట్యూబ్‌లో చూడండి.
abhisarga

Total views 19,865+ (సెప్టెంబర్ 20 నాటికి) Published on Sep 14, 2019


తార

దర్శకత్వం: నవీన్
నటీనటులు : శ్రావణి, వివేక్
అతన్ని సమయానికి నిద్రలేపి, అన్నం పెట్టి వెళ్తున్నా అని చెప్తుంది తారా. చూస్తుంటే భార్య అనే అనుకుంటాం. నువ్వు ఇచ్చిన టైం అయింది ఇంక వెళ్తున్న అని చెప్పడంతో అతను బాధపడతాడు. తారా, జైకి వన్‌డే వైఫ్‌గా వచ్చిన అమ్మాయి. కానీ అమెను ప్రేమిస్తాడు జై. ఇదే విషయం ఆమెకు చెప్తాడు. ఇదంతా పనికిరాదు అని బదులిస్తుంది. అలాంటి ఆలోచనలు పెట్టుకోకు అని సలహా ఇస్తుంది. కానీ జై భావోద్వేగానికి గురవుతాడు. ఈ ప్రేమ, నమ్మకాలు, భావోద్వేగాల దగ్గరే మనం ఆగిపోవద్దు, నా మీద ఎలాంటి ఆలోచనలు వద్దూ అని చెప్తుంది. నేను నీ లైఫ్‌లోకి రాకపోతేనే బాగుంటుందని చెప్తుంది. అప్పటికే ఆమెమీద ఎంతో ప్రేమ పెంచుకుంటాడు జై. నా మీద ప్రేమ ఉందా లేదా అని అడుగుతాడు. ఆమెకు ప్రేమ ఉన్నా, దాన్ని చెప్పలేని పరిస్థితుల్లో వెళ్లిపోతుంది. వన్‌డే వైఫ్‌గా వచ్చిన ఆమెను మొదటిసారి చూడగానే జీవితాంతం ఉండిపోవాలని కోరుకుంటాడు. ఎప్పటికైనా వేచి చూస్తా అంటాడు. దీంతో కథ ముగుస్తుంది.భిన్నమైన కథాంశంతో ఆసక్తిగా చిత్రీకరించారు. మేకింగ్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, డైలాగ్‌లు బాగున్నాయి.
Tara

Total views 1,679+ (సెప్టెంబర్ 20 నాటికి) Published on Sep 19, 2019

184
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles