పంజాబ్ ఆర్‌డీఎక్స్ పాయల్


Sun,September 15, 2019 01:05 AM

ఆర్‌ఎక్స్ 100తో టాలీవుడ్‌లో కొత్త గ్లామర్ ట్రీట్‌మెంట్ ఇచ్చింది పంజాబ్ పాప పాయల్ రాజ్‌పుత్. తెలుగులో మొదటి సినిమాతోనే ఇటు యూత్‌ను, అటు ఇండస్ట్రీ దృష్టిని దోచేసింది. ఎలాంటి పాత్రనైనా చేస్తుండడంతో ఇండస్ట్రీలో ఈమెకు క్రేజ్ పెరిగిపోయింది. తాజాగా ఆర్‌డీఎక్స్ లవ్ పేరుతో హల్‌చల్ చేస్తున్న అమ్మడు గురించి కొన్ని సంగతులు..
payal-rajput

పర్సనల్ టచ్

పాయల్ పుట్టి పెరిగింది అంతా పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో. ఈమెకు వ్యాయామం, యోగా అలవాటు. దీంతో పాటు భోజన ప్రియురాలు కూడా. షూటింగ్‌లో ఎప్పుడు డ్రైఫ్రూట్స్ తప్పకుండా వెంటపెట్టుకుంటుందట. వంట చేయడం అంటే చాలా ఇష్టమట. బయట ఆహారంకంటే ఇంటి భోజనాన్నే ఎక్కువ తీసుకుంటుందట. జీన్స్, టీషర్ట్‌టు, గౌన్లు పాయల్ ఫ్యాషన్ సీక్రెట్స్.

ధైర్యం ఎక్కువే..

సినిమాల్లో ఎలాంటి పాత్రలైనా చేసేందుకు సిద్దంగా ఉన్నా అంటున్నది పాయల్. బోల్డ్ క్యారెక్టర్ చేసినంత మాత్రాన బయట కూడా అలాగే ఉంటానేమో అనుకోవద్దంటున్నది. ఇటీవల జరిగిన మీటూను గుర్తు చేస్తూ క్యాస్టింగ్ కౌచ్ గురించి కూడా పాయల్ స్పందించింది. సినిమా రంగంలోనే కాదు ఇతర రంగాల్లో కూడా మహిళల మీద వేధింపులు ఉన్నాయని చెప్పింది. ఆమె ఇలా ధైర్యంగా మాట్లాడడం వల్ల ఆమెను కొందరు ద్వేషిస్తున్నట్టు చెపుకొచ్చింది. అయినా రాజీ పడను అని తేల్చి చెప్పింది.

సోషల్ మీడియా..

సోషల్ మీడియాలో పాయల్ చాలా యాక్టీవ్. ఇన్‌స్టాగ్రామ్ లేకుండా ఉండను అని చెప్తున్నది. ఇన్‌స్టాలో ఈమెకు 16.6 లక్షల ఫాలోవర్లున్నారు. ట్విట్టర్, ఫేస్‌బుక్‌లోనూ కనిపిస్తూ సినిమాల వివరాలు, ఆసక్తికర విషయాలు పంచుకుంటూ ఉంటుంది. ఆర్‌డీఎక్స్‌లో అలివేలు అనే ధైర్యవంతురాలైన పల్లెటూరి అమ్మాయి పాత్రలో నటిస్తున్నట్టు చెప్పేసింది.

బుల్లితెర

ఇంట్లో సినిమా వాతావరణం పెద్దగా లేకపోయినా, నువ్వు సినిమాల్లో చేస్తే బాగుంటుందని ఎవరూ అనకపోయినా పాయల్‌కు మాత్రం సినిమాల్లో చేయాలని బలంగా ఉండేది. అందుకే మొదట సీరియల్స్‌లో నటించింది. 2012లో సప్‌నోమ్ సే బారే నైనా అనే సీరియల్‌తో నటనా జీవితాన్ని ప్రారంభించింది. తర్వాత కొద్ది రోజులకు వచ్చిన మహాకుంబ సీరియల్‌తో పంజాబ్‌లో పాపులర్ అయింది.

వెండితెర..

పంజాబ్ సీరియల్స్‌లో తీరిక లేకుండా గడుపుతున్న పాయల్‌కు 2017లో సినిమా అవకాశాలు వచ్చాయి. డైరెక్టర్ పంకజ్ భద్ర తీసిన చన్నా మేరెయా అనే పంజాబీ సినిమాలో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది. అక్కడ తొలి సినిమాతోనే గుర్తింపు పొందడంతో వరుసగా మిస్టర్ అండ్ మిసెస్ 420 రిటర్న్స్, మ్యారేజ్ ప్యాలెస్, ఇష్కాలో నటించి పాలీవుడ్ ఫేమస్ అయింది.

కోలీవుడ్-బాలీవుడ్-టాలీవుడ్

పంజాబ్‌లో మూడు సినిమాల్తో మంచి పేరుతెచ్చుకుంది పాయల్. అదే సమయంలో ఇదే సమయంలో తమిళ్ నుంచి కూడా అవకాశాలు వచ్చాయి. 2018లో ఇరువమ్ ఉల్లమ్ అనే తమిళ్ సినిమా, వీరెయ్ కి వెడ్డింగ్ అనే హిందీ సినిమా చేసింది. ప్రాంతం, పాత్రల పట్టింపు లేకుండా ఇండస్ట్రీల్లో క్రేజ్ సంపాధిస్తున్న పాయల్‌ను తెలుగులోకి తీసుకొచ్చాడు ఆర్‌ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి. తర్వాత ఎన్టీయార్ బయోపిక్‌లో జయసుధ క్యారెక్టర్‌లో దర్శనమిచ్చింది. సీత సినిమాలో బుల్ రెడ్డి ఐటెం సాగ్‌తో క్రేజ్ పెంచుకుంది. తాజాగా వెంకిమామ సినిమాలో వెంకటేశ్,నాగచైతన్య వంటి స్టార్ హీరోలతో నటిస్తూ పాయల్ కూడా స్టార్‌డమ్ కొట్టేసింది. మరోవైపు డిస్కోరాజా , ఆర్‌డీఎక్స్ సినిమాలతో బిజీ బిజీగా గడిపేస్తున్నది పాయల్.

-వినోద్ మామిడాల

545
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles