విదేశాల్లో విఘ్నేశ్వరుడు


Sat,August 31, 2019 11:58 PM

తొలిపూజలందుకునే ఇలవేలుపుగా ఏకదంతునికి పేరు. ఈయనను దేవ, మానవ గణాలకు అధినాయకుడిగా భావిస్తారు. గణానాం త్వ గణపతిగ్‌ం హవా మహే అని పూజల్లో ఆయనకు అగ్రస్థానమిచ్చాయి. శివ, విష్ణు కల్యాణాల్లో సైతం తొలుత గణపతిని కొలవడం ఆనవాయితీ. ఇండ్లల్లో జరిగే సాధారణ నోముల నుంచి రాజుల అశ్వమేధయాగాల వరకు మొదటి పూజ ఆయనదే. ఆదిగురువు గణపతికి అనేక దేశాల్లో దేవాలయాలు నిర్మించి పూజిస్తున్నారు. నేడు అవి ఆధ్యాత్మిక కేంద్రాలుగా భాసిల్లుతున్నాయి.

అమెరికా

అమెరికాలోని న్యూయార్క్‌లో శ్రీ మహావల్లభ గణపతి ఆలయం ప్రసిద్ధి. అక్కడ నిర్మించిన మొట్టమొదటి హిందూ దేవాలయం ఇదే కావడం విశేషం. ఈ ఆలయాన్ని స్థానికులు ఫ్లషింగ్ ఆలయంఅని పిలుస్తారు. అమెరికాలో చాలాచోట్ల లంభోదరునికి ఆలయాలున్నాయి.
America

సింగపూర్

సింగపూర్‌ని సిలాన్ రోడ్డులో శ్రీ సెంపెగ వినాయగర్ ఆలయం ఉంది. చోళ రాజుల నిర్మాణ శైలిలో నిర్మితమైన దీనికి 162 ఏండ్ల చరిత్ర ఉన్నది.
America1

ఐర్లాండ్...

బెర్లిన్‌కు చెందిన విక్టర్ లాంగ్‌హెల్డ్ద్‌కు ఆధ్యాత్మిక యాత్రలు చేయడమంటే చాలా ఇష్టం. ఆసియాలో పర్యటించినపుడు వినాయకుడి భక్తుడిగా మారాడు. వినాయకుడి మీద ఉన్న భక్తితో వివిధ భంగిమల్లో విగ్రహాలను చెక్కించాడు వీటిని ఐర్లాండ్‌లోని కౌంటీ విక్లోకు సమీపంలోని విక్టోరియా వే పార్కులో ప్రతిష్ఠించాడు. తమిళనాడుకు చెందిన భారతీయ శిల్పకారులు ఈ విగ్రహాలు చెక్కారు. విగ్రహాల కోసం గ్రానైట్ రాయిని ఉపయోగించారు. ఒక్కో శిల్పాన్ని చెక్కడానికి ఐదుగురు శిల్పులు దాదాపు ఏడాదిపాటు శ్రమించారు. ఒక్కో విగ్రహం 3 నుంచి 5 అడుగుల ఎత్తు ఉంటుంది.

థాయ్‌ల్యాండ్

వినాయకుణ్ణి థాయ్‌ల్యాండ్‌లో ఫ్రా ఫికనెట్ అని పిలుస్తారు. బ్యాంకాక్‌కు చెందిన ల్యూంగ్ పొర్ అనే బౌద్ధ భిక్షువు గణపతికి ఆలయాన్ని నిర్మించమని ప్రభుత్వాన్ని కోరాడు. దానికోసం తన భూమిని విరాళంగా ఇచ్చాడు. కొంతమంది దాతల సహకారంతో ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పూర్తిచేసింది. ఇందులో థాయ్‌ల్యాండ్‌లోనే అతి పెద్ద వినాయక విగ్రహాలు ఉన్నాయి. అందులో ఒక విగ్రహం 15 మీటర్ల ఎత్తు, 9 మీటర్ల వెడల్పు ఉంటుంది. మరో విగ్రహాన్ని 2010లో చెక్కారు. ఇది 9 మీటర్ల ఎత్తు, 15 మీటర్ల వెడల్పు ఉంటుంది.
America2

ఇండోనేషియా

ఇండోనేషియాలోని బాలీలో 30 అడుగుల ఎత్తున్న వినాయక విగ్రహన్ని 2006లో నిర్మించారు. భారత్‌లోలానే ఇండోనేషియాలో కూడా గణపతి నిమజ్జనోత్సవాలు ఎంతో కోలాహలంగా జరుపుతారు. పెద్ద ఎత్తున ఊరేగింపు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు హాజరయిన భక్తులు కొబ్బరి కాయలు కొడుతుంటారు. వారు కొట్టిన కొబ్బరి చిప్పలను తొలగించడానికి ఓ రోజంతా పడుతుంది. ఈ విగ్రహం చుట్టూ 204 దేశాల జెండాలను ఉంచుతారు. ఇక్కడి కరెన్సీపై వినాయకుడి బొమ్మను ముద్రిస్తారు.
America3

191
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles