వాస్తు


Sun,August 18, 2019 01:47 AM

BALKANI-HOUSE

ఇంటి చుట్టు బాల్కానీ సమాన కొలతలల్లో పెట్టాలా? ఎక్కువ తక్కువగా ఉండాలా? అసలు ఉండొద్దా?

- అంతటి మహేష్‌ ,షామీర్‌పేట
‘ఇల్లు-బాల్కనీ’ అనేవాటిని చూసినపుడు ఇంటి లోపలి భాగాన్ని సూచిస్తే బాల్కనీ ఆరు బయటి ప్రాంగణాన్ని సూచిస్తుంది. మనిషి ఎంత సుఖంతో ఇంటిలోపల గడిపినా సాయంకాలం ఆరుబయటికి వచ్చి చుట్టూ ఉన్న చెట్టు చేమలను, చూసి సేదతీరుతాడు. పచ్చదనం కోరుకోవడం మానవుని‘జీవలక్షణం’. అది అంతరాత్మను ఉత్సాహ పరుస్తుంది. ఉద్వేగాన్ని తగ్గిస్తుంది. దానికి ఆలంబనగా బాల్కనీలు ప్రతి ఇంటికీ అవసరం. అవి ఇంటిచుట్టూ సమాన కొలతలతో ఉండవచ్చు. తప్పనిసరిగా దక్షిణం తక్కువగానే ఉండాలి అనేది లేదు. ఉత్తరం ఎంత ఉంటే అంత పెట్టొచ్చు. ఎక్కువ వెడల్పు లేకుంటే చాలు అలాగే పడమర కూడా అంతే. ఇవి ఉండడం ముఖ్యం.
- అంతటి మహేష్‌ ,షామీర్‌పేట

మాకు ఫ్యాక్టరీ షెడ్డు ఉంది. దానికన్నా ఎత్తుగా ఆఫీసు కట్టాలా?

- బి. అనిత, బొల్లారం
నైరుతిలో ఆఫీసు, యజమాని స్థానం అవసరం అనేది వాస్తవం. కానీ దాని ఎత్తు, తక్కువలు అనేది వ్యక్తిగతం. కొడుకు కన్నా తండ్రి పొడుగ్గా ఉండాలి అనేది సాధ్యం కాదు. అలాగే తండ్రి ఎంత బలహీనంగా ఉన్నా కొడుకు ఎంత బలంగా, అధికారంతో ఉన్నా తండ్రి స్థానం మారదు కదా.. నైరుతి ఉన్నత స్థానం, ఉచ్ఛమైన స్థానం అంతవరకు లెక్కించాలి. తూర్పులో పెద్ద షెడ్డు ఉండి దాని పైభాగంలో అంటే దానికి పడమర లేదా దక్షిణంలో ఆ షెడ్డును అంటకుండా.. ప్రత్యేకంగా చుట్టూ ప్రదక్షిణం వచ్చేలా ఆఫీసు కట్టుకుంటే అది దివ్యంగా ఉంటుంది. చాలాచోట్ల ఆఫీసుతోపాటు స్టాఫ్‌ కూడా ఉంటారు. కాబట్టి కింద స్టాఫ్‌కు ఇచ్చి పైన మేడలో ఆఫీసు పెట్టుకుంటారు. అది అవసరం. అంటే ఫ్యాక్టరీ చిమ్నీ పొగగొట్టం ఆగ్నేయంలో యాభై అడుగులు ఉంటుంది. అలాగని షెడ్డు అంత ఎత్తు కట్టగలమా స్థానం ప్రధానం.

ద్వారానికి ఎదురుగా వేంకటేశ్వరస్వామి విగ్రహం పెట్టుకోవచ్చా?

- ఎం. గౌతమి, మంథని
ఇంట్లో ఎవరి ఇష్ట దైవాలు వారు క్యాలెండర్లుగా తగిలించుకొని తృప్తి పడుతుంటారు. అలాంటి సంప్రదాయం నుంచి ఇప్పుడు పెద్ద పెద్ద విగ్రహాలు ఇంటిద్వారం ఎదురుగా పెట్టుకోవటం భక్తికన్నా ఫ్యాషన్‌ అయింది. అలాంటి పెద్ద విగ్రహాలను శాస్త్రం అంగీకరించదు. ఒక ఫీటు దాటితే ఆ స్వామికి నిత్య నైవేద్యాలు, దీపారాధన చేయాల్సి ఉంటుంది. ఇక స్వామి ముఖస్థానం ఎప్పుడు తూర్పువైపు కానీ, పడమరవైపు కానీ ఉండాలి. మీరు స్వామి ఫ్రేమ్‌ పెట్టుకోవాలని అనుకుంటే మీది తూర్పు, లేదా పడమర గృహం అయితే ద్వారానికి ఎదురుగా పెట్టుకోండి. అంతేకానీ ఉత్తర ముఖంగా స్వామిని పెట్టకండి. క్యాలెండర్‌ ఎటువైపు వేసుకున్నా దోషం లేదు. నిజానికి ఇంట్లో పూజగది ఉన్న తరువాత మిగతా స్థానాల్లో దేవుళ్ల విగ్రహాలు పెట్టడం మంచిది కాదు. అవసరం కూడా లేదు.

పోర్టికో ఎలివేషన్‌ ఇంటికన్నా ఎత్తు ఉండొచ్చా?

- ఎడ్ల పవిత్ర, నారాయణపేట
ఇంటికి పోర్టికో తూర్పులో వచ్చినప్పుడు, అలాగే ఉత్తరంలో వచ్చినప్పుడు దాని ఎత్తు సాధారణంగా ఇంటి స్లాబ్‌ లెవల్‌తోనే తీసుకుంటారు. వాటితో ఎత్తు సమస్య రాదు. ఇక ఇంటికి అంటకుండా ఇంటి తూర్పు ద్వారం ఎదురుగా ఇచ్చే పోర్టికోలను చాలామంది పిరమిడ్‌ ఆకారంలో ఇస్తుంటారు. అలా వచ్చే వాటి ఎత్తు సహజంగానే ఇంటి స్లాబ్‌ లెవల్‌కన్నా ఎత్తు వస్తుంటాయి. వాటితో దోషం లేదు. వాటిమీద ఇంటి సభ్యులు తిరగరు. ఎందుకంటే అవి ఇంటిని అంటుకొని ఉండవుకాబట్టి. పైగా ఇంటి స్లాబ్‌మీద, ఇంటికి టెర్రస్‌ అంచున ‘రేలింగ్‌' నిర్మిస్తాము. అది మూడు అడుగుల వరకు ఎత్తు ఉంటుంది. నడిచే భాగంలో అంటే టెర్రస్‌మీద దక్షిణం, పడమరలు డౌను ఉండి.. తూర్పు ఈశాన్యం ఎత్తు చేస్తే దోషం అవుతుంది. పోర్టికో ఎలా ఉన్నా తప్పు లేదు.
SUDHHALA
సుద్దాల సుధాకర్‌ తేజ
[email protected]
Cell: 7993467678

259
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles