రాశి ఫలాలు


Sun,August 18, 2019 01:37 AM

18-8-2019 నుంచి 24-8-2019 వరకు

మేషం

భార్యాపిల్లలతో సౌఖ్యంగా ఉంటారు. బంధువులు వస్తారు. దీంతో మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. పిల్లల గురించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆలోచించి పనులు చేస్తారు. గిట్టని వారితో కూడా కొన్ని పనులు కార్యరూపం దాలుస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ప్రధాన గ్రహాలు ప్రతికూలంగా ఉన్నప్పటికీ వ్యాపారంలో పెట్టుబడుల వల్ల లాభం చేకూరుతుంది. న్యాయవాద, వైద్య వృత్తిలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. షేర్స్‌, వడ్డీ వ్యాపారాలకు దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగంలో తోటివారితో ఇబ్బందులు ఉంటాయి.

వృషభం

శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఇంట్లో సంతోషంగా ఉంటారు. నూతన వస్త్ర, వస్తువులు కొంటారు. ఉపాధ్యాయ, వైద్య వృత్తిలోని వారికి పనులు నెరవేరుతాయి. హోటలు, క్యాటరింగు, పత్రికా రంగం, సినిమా రంగాలలోని వారికి కొత్త అవకాశాలొస్తాయి. సమస్యల వల్ల కొన్ని పనులు వాయిదా పడతాయి. అన్నదమ్ములు, బంధువులతో మనస్పర్థలు ఏర్పడతాయి. ఉద్యోగంలో పైఅధికారులతో జాగ్రత్త. వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వాహనాల వల్ల ఖర్చులుంటాయి. సమాజంలో పేరు ప్రతిష్ఠలు ఉన్న వారితో పరిచయాలు ఏర్పడతాయి.

మిథునం

వ్యాపారం బావుంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్‌లుంటాయి. నలుగురికి ఉపయోగపడే పనులు చేస్తారు. మంచి పేరు సంపాదిస్తారు. అనుకున్న పనులు నెరవేరుతాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. నూతన వస్త్ర, వస్తువులను కొంటారు. వాహనాల వల్ల పనులు నెరవేరుతాయి. అన్నదమ్ములు, బంధువుల సహాయ సహకారాలు పొందుతారు. ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. శుభకార్య ప్రయత్నాలలో కొన్ని ఆటంకాలు గోచరిస్తున్నాయి. రావాల్సిన డబ్బు సకాలంలో అందకపోవచ్చు.

కర్కాటకం

ఈ వారం అనుకూలంగా ఉంటుంది. పుణ్యక్షేత్రాలు, నదీస్నానాలు ఆచరిస్తారు. తల్లిదండ్రులు, ఆత్మీయుల అండదండలుంటాయి. ఆధ్యాత్మిక పరమైన ఆలోచనలు పెరుగుతాయి. పిల్లల చదువు, ఉద్యోగం విషయంలో అనుకూలిస్తుంది. శుభకార్యాలు చేస్తారు. రావాల్సిన డబ్బు అందుతుంది. ఉత్సాహంతో పనులు చేస్తారు. భార్యా పిల్లలతో హాయిగా ఉంటారు. కొత్త వస్త్ర, వస్తువులు, నగలు కొంటారు. సంగీత, సాహిత్య, ఉపాధ్యాయ వృత్తుల్లోని వారికి కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. నలుగురికి ఉపయోగపడే పనుల గురించి ఆలోచిస్తారు. సత్ఫలితాలను పొందుతారు.

సింహం

భార్యా పిల్లలతో సుఖంగా వుంటారు. కొత్త వస్త్ర, వస్తువులు కొంటారు. విందులు, వినోదాలలో పాల్గొంటారు. సంగీత, సాహిత్య, సినిమా రంగాలలోని వారు సంతృప్తిగా ఉంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. అలసట లేకుండా పనులు చేస్తుంటారు. ప్రధాన గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. జాగ్రత్త అవసరం. ఉద్యోగంలో తోటివారితో మనస్పర్ధలు, పై అధికారులతో ఇబ్బందులు ఉండొచ్చు. విషయంలో తగాదాలు గోచరిస్తున్నాయి. పిల్లల చదువు, ఉద్యోగం, శుభకార్య ప్రయత్నాల్లో ఆటంకాలుంటాయి.

కన్య

ఈ రాశి వారికి తాత్కాలికంగా కలిసివస్తుంది. చేసే వృత్తి, వ్యాపారాలు అనుకూలిస్తాయి. నిత్యావసర వస్తు వ్యాపారం, హోటలు, క్యాటరింగు, వస్త్ర, ఫ్యాన్సీ, సుగంధ ద్రవ్యాలు మొదలైన వ్యాపారాలలోని వారు లాభాలు గడిస్తారు. ఇంజినీరింగు, న్యాయవాద, వైద్య వృత్తిలో ఉన్న వారికి కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. వస్త్ర, వస్తువులను కొనుగోలు చేస్తారు. భార్యా పిల్లలతో సంతృప్తిగా ఉంటారు. మంచి ఆలోచనలు స్ఫురిస్తాయి. శుభకార్యాలు, చదువు, ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు సాగకపోవచ్చు.

తుల

వృత్తి, వ్యాపారాలు అనుకూలిస్తాయి. పిల్లల చదువు, ఉద్యోగం, శుభకార్యాల విషయంలో అనుకూలంగా ఉంటుంది. భూములు, వాహనాలు కొంటారు. రావాల్సిన డబ్బు వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. అందరితో సామరస్యంగా ఉంటారు. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. దేవతా, గురుభక్తి పెరుగుతుంది. ఉన్నత స్థానంలో ఉన్న వారితో పరిచయాలు పెరుగుతాయి. అన్నదమ్ములు, బంధువులతో పనులు నెరవేరుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్‌లు ఉంటాయి. ఆఫీసులో సామరస్యంగా ఉంటారు.

వృశ్చికం

ఉద్యోగంలో అనుకూలత ఉంటుంది. తోటివారితో సామరస్యం ఉంటుంది. పై అధికారులతో సత్సంబంధాలు ఉంటాయి. రాజకీయంలో ఉన్న వారికి పనులు నెరవేరుతాయి. వ్యాపారంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. పనివారితో సమస్యలు తలెత్తుతాయి. నిత్యావసర వస్తు, రియల్‌ ఎస్టేట్‌, గృహ నిర్మాణం, ఇంజినీరింగు రంగాలలో ఉన్నవారు న్యాయపరమైన సమస్యలు ఎదుర్కొంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కాకపోవచ్చు. శుభకార్య ప్రయత్నాలలో ఆటంకాలున్నాయి. పనివారితో సమస్యలుంటాయి. వృథా ఖర్చులు ఉంటాయి.

ధనుస్సు

వ్యాపారం అనుకూలిస్తుంది. భార్యా పిల్లలతో సంతృప్తిగా ఉంటారు. కొత్త వస్తువులను కొంటారు. నిత్యావసర వస్తు వ్యాపారం, షేర్‌, వడ్డీ, హోటలు, క్యాటరింగు, సుగంధ ద్రవ్యాలు, వస్త్ర, ఫ్యాన్సీ, సంగీత, సాహిత్య రంగాలలోని వారు సంతృప్తిగా ఉంటారు. ఉద్యోగంలో తోటివారితో మనస్పర్ధలు ఏర్పడొచ్చు. శుభకార్యాలు, ఉన్నత విద్యప్రయత్నాలలో ఆటంకాలు ఏర్పడొచ్చు. భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారికి ఇబ్బందులు ఉంటాయి. పనివారితో సమస్యలు, వృథా ఖర్చులు ఉంటాయి. అనవసరమైన విషయాలకు ప్రాధాన్యం ఇవ్వకూడదు.

మకరం

ఇంట్లో సంతోషం ఉంటుంది. విందులు, వినోదాలలో పాల్గొంటారు. నూతన వస్త్ర, వస్తువు, ఆభరణాలను కొంటారు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. శుభకార్యాలు, పిల్లల చదువు, విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. అలసట లేకుండా నిమగ్నమై పనులు చేస్తారు. సమాజంలో మంచి పేరు పొందుతారు. దేవతా, గురుభక్తి పెరుగుతుంది. మంచివారితో స్నేహం ఏర్పడుతుంది. ఉద్యోగంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. రాజకీయ, కోర్టు వ్యవహారాలలో ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపారంలో అనవసరమైన ఒత్తిడికి లోనవుతారు.

కుంభం

వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. షేర్‌, వడ్డీ, నిత్యావసర వస్తు వ్యాపారాలు అనుకూలిస్తాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల వల్ల రాబడి పెరుగుతుంది. న్యాయవాద, ఇంజినీరింగు వృత్తులలో ఉన్నవారికి ఆదాయం పెరుగుతుంది. మంచి ఆలోచనలతో, సమయస్ఫూర్తితో పనులు చేస్తారు. పెద్దల సహాయ సహకారాలు ఉంటాయి. తీర్థయాత్రలు, విహార యాత్రలు ఆచరిస్తారు. రావాల్సిన డబ్బు సకాలంలో అందుతుంది. పనివారితో పూర్వం ఉన్న సమస్యలు తీరుతాయి. ఉద్యోగంలో కొన్ని ఇబ్బందులున్నాయి.

మీనం

ఆఫీసులో మంచి పేరు పొందుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. మంచివారితో స్నేహ సంబంధాలు పెంపొందుతాయి. శుభకార్యాలు చేస్తారు. పిల్లల చదువు, ఉద్యోగం విషయాలలో ప్రయత్నాలు కలిసొస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్‌లు ఉండొచ్చు. సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తారు. అన్నదమ్ములు, బంధువులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. వాహనాల వల్ల పనులు నెరవేరుతాయి. రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాలలోని వారు కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. ఆస్తుల విషయంలో పూర్వం ఉన్న తగాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపారంలో పనివారితో, పనులలో ఒత్తిడి ఉంటుంది.
rasi-phalalu
గుడి ఉమా మహేశ్వరశర్మ సిద్ధాంతి
ఎం.ఎస్సీ., నిర్మల పంచాంగకర్త
నల్లకుంట, హైదరాబాద్‌., ఫోన్‌: 040-27651530
ఈ మెయిల్‌ : [email protected]

3084
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles