సినిమాల్లో ప్రకాశించాలని..!


Sun,August 11, 2019 12:54 AM

Mannara-Chopra
మనార్ అంటే గ్రీకులో ప్రకాశించేదని అర్థం.. బార్బీగా ఉన్న తన పేరును.. సినిమాల కోసం మన్నారాగా మార్చుకున్నది..ప్రియాంక చోప్రాకి కజిన్ అయిన ఈ అమ్మడు.. బాలీవుడ్‌లో అడుగు పెట్టినా.. తెలుగు తెర మీద మక్కువతో.. ఇక్కడే ఎక్కువ సినిమాలతో దూసుకుపోతున్నది.

- సౌమ్య పలుస


మనారా చోప్రా తెలుగులో ప్రేమ గీమ జాన్తా నై అనే సినిమాతో తెరంగేట్రం చేసింది. అదే సంవత్సరం బాలీవుడ్ సినిమా జిద్‌లో మెరిసింది.

రోగ్, జక్కన్న, తిక్క సినిమాలు ఆమె కెరీర్‌లో ది బెస్ట్ సినిమాలుగా నిలిచాయి.

యాక్టింగ్‌లోకి రాకముందు కొందరు హీరోయిన్లకు ఫ్యాషన్ డిజైనర్‌గా, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పని చేసింది.

సీత సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా చేసింది. తెలుగులో మరిన్ని ప్రాజెక్టులతో బిజీ అయిపోయిందీ అమ్మడు.

మనారా చిన్నతనంలో డాబర్ ఆమ్లా హెయిర్ ఆయిల్ యాడ్‌లో కనిపించింది. ఈమె ప్రియాంక చోప్రాకి మామ కూతురు అవుతుంది.

మనారా పుట్టినప్పుడు బొమ్మలా ఉండేదట. అందుకే వాళ్ల కజిన్ బార్బీ అని ముద్దుగా పిలిచేవాడట. అయితే మనారా వాళ్ల అమ్మకి ఆ పేరు నచ్చి.. బార్బీ హండా అని పేరు పెట్టిందట. ఆ తర్వాత పేరు మార్చారు.

సంద్రామృతమ్, కావల్ అనే సినిమాలతో తమిళంలో స్పెషల్ అప్పిరియన్స్ ఇచ్చింది మనారా చోప్రా. ఇప్పటిదాకా 13 టీవీ కమర్షియల్స్‌లో నటించింది. అందులో మూడు ప్రియాకం చోప్రాతో నటించింది.

హిప్ హాప్, బెల్లీ డ్యాన్స్‌లంటే ఇష్టం ఈ అమ్మడికి. అందుకే ఈ డ్యాన్స్‌ల కోసం ట్రైనింగ్ కూడా తీసుకుంది. మంచి కథక్ డ్యాన్సర్ కూడా.

మనారా డబుల్ డిగ్రీ చదివింది. ఫ్యాషన్ డిజైనింగ్‌తో పాటు.. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కూడా పూర్తి చేసింది.

ఒకచోట అదే పనిగా వారం రోజులు ఉండలేదట మనారా. అదే షూటింగ్ ఉంటే చాలా ప్రాంతాలు చూడొచ్చనే ఉద్దేశంతో యాక్టింగ్ కెరీర్‌ని ఎంచుకుందట.

211
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles