ఒక్క పోస్టుకు రూ.20 లక్షలు!


Sun,August 11, 2019 12:42 AM

puppies
సోషల్ మీడియా ఖాతాల్లో మీరు పోస్టులు పెడుతున్నారా?ఆ పోస్టుల వల్ల మీకేమైనా లాభం వస్తుందా? ఇప్పుడు అవన్నీ ఎందుకంటారా?ఈ కుక్కపిల్ల పేరుతో పెట్టే ఒక్కో పోస్టు ఖరీదు ఎంతో తెలుసా?అక్షరాల 20 లక్షల రూపాయలు. రోజులో ఎన్ని పోస్టులు పెడితే.. అన్ని లక్షల రూపాయలే!!అంతలాభం అందుకుంటున్న ఆ కుక్కపిల్ల యజమాని ఎవరో తెలుసా?

కుక్కపిల్ల, ఆగ్గిపుల్ల, సబ్బుబిళ్ల.. హీనంగ చూడకుదేన్నీ అన్నట్టు ఆనాడే హితబోధ చేశారు మహాకవి శ్రీశ్రీ. ఈ కుక్కపిల్లను చూస్తే.. ఆయన కాలజ్ఞానానికి సలాం కొడతాం. జిఫ్‌పోమ్ అనే ఈ కుక్కపిల్ల ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కారణం ఏంటంటారా? ఈ కుక్కపిల్ల పేరుతో పెట్టే ఒక్కో పోస్టుకు 20 లక్షల రూపాయలు వస్తున్నాయి. రోజుకు ఎన్ని పోస్టులు పెడతారో ఇక మీరే ఆలోచించుకోవాలి. దీంతో ఈ వార్త తెలిసిన వారంతా.. లక్షణమైన కుక్క పిల్ల అంటూ తెగ పొగిడేస్తున్నారు. మరికొంతమందైతే.. కుక్క పిల్ల అంత సంపాదిస్తున్నదా! అని కుల్లుకుంటున్నారు కూడా.
puppies1

సోషల్ మీడియా మహత్యం!

జిఫ్‌పోమ్‌కు ఇంత పేరు ప్రఖ్యాతులు, సంపాదన రావడానికి ముఖ్య కారణం సోషల్ మీడియా. ఈ కుక్క పిల్ల టెడ్డీ బేర్‌లా భలే ముద్దుగా ఉంటుంది. కొన్నేళ్ల కిందట ఇది క్యాటీ పెర్రీ మ్యూజిక్ వీడియోలో కనిపించింది. ఆ ఆల్బమ్ హిట్ అవడంతో చాలామంది జిఫ్‌పోమ్‌కు అభిమానులయ్యారు. ఈ నేపథ్యంలో జిఫ్‌పోమ్ యజమాని దాని పేరుతో వివిధ సోషల్ మీడియా ఖాతాల్లో పేజీ ప్రారంభించారు. అంతే.. జిఫ్‌పోమ్ అందం, అభినయం, చలాకీతనం చూసి లక్షలాది మంది అభిమానులయ్యారు. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో జిఫ్‌పోమ్‌కు 9.2 మిలియన్ మంది ఫాలోవర్స్ ఉన్నారు. ట్విట్టర్‌లో లక్షకుపైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఫేస్‌బుక్‌లో జిఫ్‌పోమ్ ఫొటోలకు లక్షల్లో లైకులు, కామెంట్లు వస్తుంటాయి. జిఫ్ పాలోయింగ్ చూసి మార్క్ జూకర్‌బర్గ్ ప్రత్యేకంగా అభినందించాడంటే మీరే ఆలోచించండి జిఫ్ ఫాలోయింగ్ ఏంటో.
puppies2
puppies3

ైస్టెల్‌తో అదరగొడుతుంది..

జిఫ్‌పోమ్‌కు ఇంత క్రేజ్ రావడానికి కారణం.. అదిచ్చే స్టిల్స్. కెమెరా ముందుకొస్తే చాలు.. తన ముఖంలో ఎన్నో అభినయాలు పలికిస్తుంది. అంతేకాదు.. రకరకాల విన్యాసాలు చేస్తుంది. వాటిని చూసిన ఎవ్వరైనా జిఫ్‌కు పడిపోవాల్సిందే. ఇక జిఫ్‌పోమ్ ఇచ్చే హావభావాలతో మార్కెట్‌లో బొమ్మలు తయారు చేశారు. వాల్‌మార్ట్‌లో జిఫ్‌పోమ్‌ను పోలిన బొమ్మలకు మస్తు గిరాకీ ఉంది. ఈ రకమైన బొమ్మలు అన్ని షాపింగ్ మాల్స్‌లో కనిపిస్తున్నాయి. ఇక జిఫ్‌పోమ్ పేరిట ఓ గిన్నిస్ రికార్డు కూడా ఉన్నది. 2014లో పదిమీటర్ల పరుగు పందేన్ని ముందు కాళ్లతో అధిగమించింది. అదే పోటీలో వెనుక కాళ్లతో 5 మీటర్ల పరుగు పందేన్ని వేగంగా అధిగమించి గిన్నిస్ రికార్డు తన పేరిట రాసుకున్నది జిఫ్‌పోమ్. అంతేకాదు ఇన్‌స్టాగ్రామ్ ఇచ్చే ఇష్టమైన పెంపుడు జంతువు అవార్డును కూడా గెలుచుకున్నది జిఫ్‌పోమ్. 2013లో వచ్చిన అడ్వెంచర్ ఆఫ్ బెయిలీ చిత్రంలో 2016లో డిస్నీ సంస్థ రూపొందించిన బిజార్డ్‌వార్క్ సిరీస్‌లో కనిపించింది జిఫ్‌పోమ్.
puppies4

ప్రకటనలతో భారీగా సంపాదన

సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్లు కలిగిన వ్యక్తులు, జంతువులకు ఆయా సంస్థలు నగదు చెల్లిస్తాయనే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సెలబ్రిటీలు సోషల్ మీడియాను వేదికగా చేసుకుని అనేక ప్రకటనలు చేస్తున్నారు. ఎక్కుమంది ఫాలోవర్లను సంపాదించి ఆదాయం పొందుతున్నారు. వారు మాత్రమే కాకుండా కుక్కలు, పిల్లులు తదితర జంతువులతో ఏర్పాటు చేసిన పేజీలకు కూడా మంచి ఆదరణ లభిస్తున్నది. ఈ క్రమంలో కుక్కలు లేదా ఇతరత్రా పెంపుడు జంతువులతో ఏర్పాటు చేసే పేజీకి 20 వేల మంది ఫాలోవర్లు ఉంటే ఒక్క పోస్టుకు 282 డాలర్లు (రూ.19,452) చెల్లిస్తారు. అలాగే, లక్షన్నర నుంచి 2.50 లక్షల వరకు ఫాలోవర్లు ఉంటే 4,250 డాలర్లు (రూ.2,92,130) లభిస్తాయి. అయితే అన్ని సోషల్ మీడియా వేదికలపై సుమారు 30 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. దీంతో ఒక్క పోస్టుకు సుమారు రూ.20 లక్షల వరకు ఆదాయం లభిస్తున్నది. గూగుల్‌లో వరల్డ్స్ క్యూటెస్ట్ డాగ్ అని సెర్చ్ చేస్తే.. మొదట కనిపించేది జిఫ్‌పోమ్. ఇది పొమనేరియన్ జాతికి చెందిన కుక్కపిల్ల. దీని జీవితకాలం 12 నుంచి 16 సంవత్సరాలు ఉంటుంది. కేజిన్నర నుంచి మూడు 4 కేజీల బరువు పెరుగుతుంది. అయితే జిఫ్‌పోమ్ యజమాని ఎవరనేది ఇప్పటికీ చాలా రహస్యం.

298
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles