లేడీ జేమ్స్ బాండ్ 007


Sun,August 11, 2019 12:36 AM

James-Bond
ప్రపంచ వ్యాప్తంగా సంచలనాత్మకమైన జేమ్స్ బాండ్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. కానీ 2020లో రిలీజ్ అవబోతున్న జేమ్స్ బాండ్ 25 చిత్రం గురించి మాత్రం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇప్పుడు దాని చుట్టూ కొత్తగా ఓ హాట్‌టాపిక్ నడుస్తున్నది. అది ప్రస్తుతం ప్రపంచ సినిమా పరిశ్రమల్లోనే చర్చనీయాంశంగా మారింది. ప్రత్యేకమైన జేమ్స్ బాండ్ కోడ్ 007 ను ఈ సారీ లేడీ స్టార్‌కు ఇవ్వనున్నది ఆ చిత్ర బృందం. ఆ స్టార్ ఒక ఆఫ్రికన్ అమెరికా లేడీ కావడం విశేషం. ప్రస్తుతం దీన్ని చుట్టే కొన్ని ఆసక్తికర విషయాలు తిరుగుతున్నాయి.

ఆమె పేరు లషానా లించ్.. హలీవుడ్ చిత్ర పరిశ్రమను కుదిపేస్తున్న పేరు. ఈ పేరే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతున్నది. ఈమెనే జెమ్స్ బాండ్ 007 కోడ్‌తో గూఢచారిగా నటించబోతున్న నల్లజాతి హీరోయిన్. ప్రస్తుతం ఈ వార్తలే కొద్ది రోజులుగా చక్కర్లు కొడుతున్నాయి. బుల్లితెర నటిగా ప్రారంభమైన ఈమె సినిమా కెరీర్ వెండితెరమీదకు రావడానికి టైం పట్టింది. ఇటీవలే కెప్టెన్ మార్వెల్ సినిమాలో నటించి హాలీవుడ్ దృష్టిని తనవైపు తిప్పుకుంది. లషానా బీబీసీ టెలివిజన్ ఫిల్మ్ స్కూల్‌లో బీఏ యాక్టింగ్ కోర్స్‌చేసింది. 2012లో వచ్చిన డ్రామా ఫిలిమ్ ఫాస్ట్ గర్ల్స్‌తో ఈమె తెరంగేట్రం చేసింది. తర్వాత పౌడర్ రూం, బ్రదర్ హుడ్, కెప్టెన్ మార్వెల్‌లో నటించింది. అంతకు ముందు 2007 టీవీ సీరియల్స్‌లో భిన్న పాత్రల్లో నటించింది.

ఒక సంచలనం

జేమ్స్‌బాండ్ చిత్రానికి, అందులోని హీరో పాత్రకు ఉన్న క్రేజ్ గురించి ప్రపంచానికి తెలిసిందే. నేరాలను దర్యాప్తు చేసే గూఢచారి పాత్రకు కేటాయించిన 007 కోడ్ జేమ్స్ బాండ్‌కే చెల్లుతుంది. అయితే 2020లో వచ్చే 25 జేమ్స్‌బాండ్ చిత్రంలో ఈ సీన్ మారబోతున్నది. ఇప్పుడదే సంచలనంగా తయారైంది. లషానా లించ్ జేమ్స్ బాండ్ చిత్రంలో నటిస్తున్నట్టు వస్తున్న వార్తల మీద భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఈ చిత్రంలో ఈమె నటింబోయే నోమీ పాత్రకు ఈ కోడ్ కేటాయించబోతున్నారు. ఇన్నాళ్లే మాచోమ్యాన్ సొంతం అనుకున్న ఈ కోడ్ ఇప్పుడు ఒక బ్లాక్ లేడీ నటికి రావడం చిన్న విషయమేం కాదు. అందులోనూ హాలీవుడ్‌లో ఈ మధ్యనే పేరు తెచ్చుకున్న ఒక చిన్న నటికి ఈ అవకాశం దక్కింది. ఇది ఆమెకు చిత్ర యూనిట్ ఇస్తున్న గౌరవంగా కొందరు అంటున్నారు. ఈ 25వ చిత్రంలో డానియల్ క్రైగ్ కూడా ఉంటాడు. గత చిత్రాల్లో పొందిన ఎమ్‌ఐ6 అనే కోడ్ తర్వాత అన్నీ వదిలేసి, జమైకాలో విశ్రాంతి తీసుకుంటాడు. దీంతో 007 కోడ్‌తో లషానా కొనసాగబోతున్నది. ఈ కోడ్‌తోనే గూఢాచారి పాత్ర నోమీ తెరపైకి వస్తున్నది.

ఇదే కారణం

ఇప్పటి వరకూ జేమ్స్ బాండ్ సినిమాలకు దర్శకత్వం వహించింది డానీ బోయెల్. ఇతను ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. అందుకే భారీ మార్పులు జరిగాయి.అతని స్థానంలో కారీ జోజీ దర్శకత్వ బాధ్యతలు తీసుకొన్నాడు. ఇంతకు ముందు చిత్రాల్లో మహిళా పాత్రలను ప్రాధాన్యం లేకుండా చిత్రీకరించారు. కానీ ఇప్పుడు స్త్రీల పట్ల గౌరవం, వారి ప్రాధాన్యం పెరిగేలా సినిమా చిత్రీకరిస్తాం అంటున్నాడు ఆ దర్శకుడు. ఇంక బాండ్ 25 చిత్ర రచయిత ఫోబీ వాల్లెర్ బ్రిడ్జ్ ఒక మహిళగా ఆమె రాస్తున్న సినిమాలో 007 కోడ్‌ను మహిళకు ఇవ్వడానికి సిద్ధపడి ఉండవచ్చు అనే అభిప్రాయం ఉంది. ఎందుకంటే ఆమె ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్యూలో ఈ చిత్రం గురించి వెల్లడించింది. స్త్రీల పాత్రలు సరైన రీతిలో చూపించబోతున్నట్టు చెప్పారు. ఇలాంటి చాలా వేషాలతో రాబోతున్న బాండ్ 25 చిత్రంలో మహిళా పాత్రలను వైవిధ్యంగా చూపిస్తాం అని రైటర్ చెప్పుకొచ్చారు. మొత్తానికైతే సంచలనాత్మకమైన జేమ్స్ బాండ్ 007 కోడ్‌ను ఒక మహిళకు కేటాయించడం గొప్ప విషయమే. అందులో బ్లాక్ మహిళకు ఇవ్వడం అనేది మరింత ఆసక్తి కలిగించే విషయం.
James-Bond1

007 జేమ్స్ బాండ్ ప్రధాన పాత్రలు

గత చిత్రాల్లో పొందిన ఎమ్‌ఐ6 అనే కోడ్ తర్వాత అన్నీ వదిలేసి, జమైకాలో విశ్రాంతి తీసుకుంటాడు హీరో క్రైగ్. దీంతో 007 కోడ్‌తో లషానా కొనసాగబోతున్నది.
- ఆస్కార్ విజేత రామి మాలె : మెయిన్ విలన్
- లియా సైడోక్స్: మెయిన్ డాక్టర్
- నవోమీ హరీస్: మనీపెన్నీ క్యారెక్టర్‌లో మూడోసారీ నటించబోతున్నది
- జెఫ్రీ రైట్ : సీఐఏ ఏజెంట్

207
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles