సన్యాసి వేషం


Sun,August 11, 2019 02:27 AM

Monk
ఆ ఊళ్లో రాఘవ అనే యువకుడు ఉన్నాడు. అతను మారు వేషాలు వేయడంలో దిట్ట చివరిరోజు మారువేషాల ప్రదర్శన. రాఘవ ఒళ్లంతా ఎర్రమట్టి అద్దుకుని విభూతి పూసుకుని జడలు కట్టిన జుత్తుతో ఒక సాధువు వేషం వేసుకుని వచ్చాడు. చూస్తూఉండగానే తన మధురమయిన స్వరంతో దైవ సంకీర్తనం చేశారు. సాధాసీదాగా ఉంటుందనుకున్న జనాన్ని తన అభినయంతో, తత్వాలతో తాత్విక తీరాలు చేరేలా చేశాడు. కాలం స్తంభించింది. కార్యక్రమం పూర్తయ్యాక కరతాళ ధ్వనులతో పరిసరాలు ప్రతి ధ్వనించాయి.

ఒక గ్రామంలో ప్రతి ఏడాది దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగేవి. ఆటలు, పాటలు, నాటకాలు, నాట్యాలు ఒకటేమిటి? ఎన్నో ప్రదర్శనలు జరిగేవి. దూరప్రాంతాల నించీ ప్రతిభావంతులైన కళాకారులు ఆ ఊరికి వచ్చి ప్రదర్శనలు నిర్వహించేవాళ్లు. తొమ్మిది రోజులు సందడి సందడిగా సాగిపోయేవి. అంత గొప్పగా దసరా ఉత్సవాలు అక్కడ జరుగడం వెనుక ఒక కారణముంది. ఆ ఊరి జమీందారు ఔదార్యవంతుడు. దానధర్మాల్లో చుట్టుపక్క గ్రామాలకు అతని కీర్తి ప్రతిష్ఠలు వ్యాపించాయి. దసరా ఉత్సవాలు ఆయన ఆధ్వర్యంలోనే జరిగేవి. ప్రతి కార్యక్రమాన్ని ముందుండి నడిపించి ఆయన పర్యవేక్షించేవాడు. నవరాత్రులు మొదలయ్యాయి. మొదటిరోజు పాటలు... ఎందరో గాయనీమణులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. స్థానికులే కాకుండా ఇతర ప్రాంతాల నించీ కూడా ఆ కార్యక్రమాల్ని సందర్శించడానికి జనం తండోపతండాలుగా వచ్చేవాళ్లు. మరుసటి రోజు హరికథా కాలక్షేపం.మూడోరోజు నాటకాలు ఇట్లా ఒక్కోరోజు ఒక్క ప్రత్యేకమైన విషయం. ఇందులో ఎందరో కళాకారులు భాగస్వాములయ్యారు.
ఇవన్నీ పూర్తయ్యాకా చివరి రోజు వేషధారణ కార్యక్రమం ఉంటుంది. అంటే మారువేషాలలో మనుషులు రంగ స్థలంపైకి ఒక్కొక్కరుగా వస్తారు. వాళ్లు జంతువుల వేషం వేయవచ్చు. మనుషుల్ని అనుకరించవచ్చు. కానీ ఆ వేషానికి అనుగుణమైన హావభావాలతో, అభినయంతో మనుషుల్ని ఆకర్షించాలి.కార్యక్రమాలన్నీ ముగిశాకా మొదటినించి పర్యవేక్షిస్తున్న న్యాయనిర్ణేతలు మొదట తొమ్మిది రోజుల ప్రదర్శనల నించీ ఒక ప్రతిభాశాలిని ఎంపిక చేస్తారు. అతన్నో, ఆమెనో ఘనంగా సత్కరిస్తారు. ఆ తర్వాత నాటకాల్లో ఒకరికి, నాట్యంలో ఒకరికి, గానంలో ఒకరికి బహుమతులిస్తారు. ప్రథమ, ద్వితీయ వగైరా బహుమతులుంటాయి.

ఆ ఊళ్లో రాఘవ అనే యువకుడు ఉన్నాడు. అతను మారు వేషాలు వేయడంలో దిట్ట. చివరిరోజు మారువేషాల ప్రదర్శన. రాఘవ ఒళ్లంతా ఎర్రమట్టి అద్దుకొని విభూతి పూసుకుని జడలు కట్టిన జుత్తుతో ఒక సాధువు వేషం వేసుకుని వచ్చాడు. చూస్తూ ఉండగానే తన మధురమైన స్వరంతో దైవ సంకీర్తనం చేశారు. సాదాసీదాగా ఉంటుందనుకున్న జనాన్ని తన అభినయంతో, తత్వాలతో తాత్విక తీరాలు చేరేలా చేశాడు. కాలం స్తంభించింది. కార్యక్రమం పూర్తయ్యాక కరతాళ ధ్వనుల్తో పరిసరాలు ప్రతిధ్వనించాయి. న్యాయనిర్ణేతలు తొమ్మిది రోజుల్లో ఉత్తమ ప్రదర్శకుడిగా రాఘవ ఎంపికయినట్లు ప్రకటించారు. జమీందారు శాలువా, నగదు తీసుకుని రాఘవకు అందివ్వడానికి పిలిచాడు. సన్యాసి వేషంలో ఉన్న రాఘవ మన్నించండి అని ఇప్పుడే కాసేపట్లో వస్తానని అదృశ్యమయ్యాడు.

తక్కిన అందరికీ బహుమతి ప్రదానం జరిగింది. ఎంతసేపటికీ రాకపోవడంతో పంచె ధోవతీ కట్టుకుని తన మామూలు రూపంలో రాఘవ జమీందారు ముందు ప్రత్యక్షమయ్యాడు. జమీందారు వేషం ఉన్నప్పుడు పిలిస్తే రాకుండా ఎందుకని వేషం వదిలి మామూలుగా వచ్చావు? అని అడగాడు. రాఘవయ్యగారూ! నన్ను మన్నించాలి. నేను బహుమతి పొందింది సన్యాసి వేషానికి. సన్యాసి అంటే సర్వ సంగ పరిత్యాగి. అంటే అన్నీ వదులుకున్నవాడు. ప్రాపంచిక సుఖాల పట్ల, భౌతిక అనందం పట్ల ఆసక్తి లేనివాడు. అప్పుడు ఆ వేషంలో ఉన్నాను. నేను వేషంలో ఉన్నా నేను అందులో జీవించాలి. దైవ సంకీర్తన చెయ్యాలి. న్యాయం చెయ్యాలి. ఆ వేషధారిగా నేను ఉన్నంత వరకు ఆ సన్యాస లక్షణాన్ని నేను గౌరవించాలి. ఆ వేషంలో నేను మీరిచ్చే బహుమానాన్ని అందుకున్నా, మీ చేత శాలువా కప్పించుకున్నా సన్యాస లక్షణాన్ని అవమానించినట్లవుతుంది. అందుకనే వేషం మార్చుకుని వచ్చాను. అన్నాడు. జమీందారు ఆనంద భాష్పాలతో రాఘవను కౌగిలించుకున్నాడు.

ఈ శీర్షికపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని 9182777177 వాట్సప్ నంబర్‌లో తెలియజేయండి.

184
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles