వాస్తు


Sun,August 11, 2019 01:50 AM

vasthu

మాకు దక్షిణంలో షాపులు రావాలి. పైన ఇల్లు రావాలి మెట్లు ఎటు వేయాలి?

- కొంపల్లి ఆనంద్, ఆలేరు
వ్యాపారంగా కింద వాడుకొని పైన ఇల్లు కట్టుకుంటే గొప్ప సౌకర్యంగా ఉంటుంది. కింది స్థలాన్ని కొంతమేర అంటే ఉత్తరం భాగం పార్కింగ్‌కు వదిలి దక్షిణం ఆగ్నేయం గేటు ద్వారా వెళ్లే ఏర్పాటు చేసుకుంటే చాలు. అప్పుడు స్థలాన్ని బట్టి దక్షిణం ముఖంగా ఎన్ని షాపులు వస్తే అన్ని వేసుకోవచ్చు. మెట్లు దక్షిణం అసలు వేయలేం కారణం అటు రోడ్డు ఉంది కాబట్టి. తప్పక వాటిని ఉత్తర వాయవ్యంలో వేయాల్సి ఉంటుంది. రోడ్డు ఉన్న వైపే మెట్లు రావాలనుకోవడం అన్ని స్థలాల్లో వచ్చినా మీ అవసరం, సౌకర్యం, మీ ప్లాను బట్టి కష్టం కాబట్టి వాయవ్యం లేదా తూర్పు పడమర పొడవుగా, స్థలం ఉంటే తూర్పు ఆగ్నేయంలో మెట్లు వేసుకోవచ్చు. ముందుగా అన్నీ సరిచూసుకొని ఇల్లు కట్టుకోండి.

కిందా, పైనా ఇండ్లు కడుతున్నాం. దర్వాజ ముహూర్తం ఎక్కడ చేయాలి?

- పిట్టా రాజు, ఖిలా వరంగల్
ముహూర్తంలో ద్వారం ఏర్పాటు చాలా అవసరం. ఇండ్లు ఎన్ని ఫ్లోర్లు కట్టినా.. అది నేలమీద అయినా, పైన అయినా అన్నింటినీ ముహూర్తంలోనే ఆరంభించాలి. కింద ఇల్లు ముఖ్యం కాబట్టి.. పైన అవసరం లేదు అనుకోవద్దు. ప్రధానంగా సింహద్వారాలు నిలబెట్టేటప్పుడు తూర్పు-ఉత్తరద్వారాలు ఆ ముహూర్త కాలంలో నిలబెట్టాలి. అలాగే అన్ని ఫ్లోర్లలో ఆ మూహూర్తంలోనే వరుసగా నిలబెట్టుకుంటూ పోవాలి. బద్ధకించవద్దు. ఒకే యజమాని కట్టినా అన్ని ఫ్లోర్లు అతడే వాడుకోడు కదా. ఇతరులైనా, కుటుంబ సభ్యులైనా, అద్దెకు ఉండేవారైనా కుటుంబాలు వేరు వేరుగా ఉంటాయి. కాబట్టి దర్వాజ ముహూర్తం అన్ని ఫ్లోర్లలో చేయాల్సి ఉంటుంది.

రైల్వే ట్రాక్ ఉంది. దాని పక్కన రోడ్డు, దాని అవతల చెరువు ఉంది. మేము ఇల్లు కట్టొచ్చా?

- పబ్బు నాగమణి, కొంపెల్లి
మీరు చెప్పినవన్నీ బహుశా మీ గృహ స్థలానికి దక్షిణంలో ఉండి వుంటాయి. అందుకే మీకు ఈ అనుమానం వచ్చంది. ఇల్లుకు రక్షణ, మనుషులు కల్పించేది ఒకటే, ప్రకృతి కల్పించేది ఒకటే ఉంటుంది. మనం ఎంత కల్పన చేసినా నేచురల్‌గా వచ్చే గొప్ప తోడ్పాటు ముందు మానవుని ఏర్పాటు తక్కువే. మీరు దక్షిణంలో చెరువు పెట్టుకొని కట్టాలి అనుకుంటున్నారు. కానీ ఆ గృహం అంతగా యోగించదు. ఎంత రైల్వేట్రాక్ రోడ్డు ఉన్నా చెరువు ప్రభావం నుంచి దక్షిణ గృహం తప్పించుకోలేదు. ఎన్నో గ్రామాల్లో దక్షిణం వాగు, చెరువు ఉన్న ఇండ్లు అనారోగ్యాలతో పోరాడుతూనే ఉన్నాయి. కాబట్టి ఆ దిక్కు ఇంటి ఆలోచన వద్దు.

మా తాత వాళ్లు కట్టిన పాత ఇల్లు మాకు ఉంది. దానిని బాగుచేసుకోవాలా? మొత్తం తీసి కట్టాలా? ఏది మంచిది?

- కె. ముకుంద, జగిత్యాల
ఉన్న ఇల్లు శాస్ర్తానుకూలమా.. ప్రతికూలమా.. అన్నది ముఖ్యం. విరుద్ధంగా ఉంటే అది తాతలదైనా, తండ్రులదైనా మార్చాల్సిందే.. అందరు కూడా మన పెద్దల ఇల్లు ఉంచుకోవాలనే చూస్తారు. కానీ, కాలానికి అనుగుణంగా మన అవసరాలు మారిపోయినప్పుడు అనూకలంగా పాత ఇల్లు లేనప్పుడు రిపేర్లకన్నా తొలిగించి కట్టడం గొప్ప పని అవుతుంది. పాత ఇండ్ల పైన ప్రేమ ఉంటుంది. కానీ ఏం లాభం అది వర్షాలకు కూలిపోతున్నప్పుడు అవసరాలకు, శాస్ర్తాలకు పనికి రానప్పుడు. ఉన్నది బాగుంటే.. అంటే కొన్నేండ్లు ఇల్లు గట్టిగ ఉండగలుగుతుంది అనుకుంటే దానినే వాస్తుపరంగా మార్చుకోండి. లేదా అన్ని రకాలుగా మార్చుకోలేం, దానిలో ప్రాణం లేదనుకుంటే వెనకా ముందు ఆలోచించకుండా మంచి ఇల్లు కట్టండి. మరో ముఖ్య విషయం. ఆ నేల దిశపు, వీధులకు అనుకూలంగా ఉందా ముందు చూడండి.
SUDHHALA
సుద్దాల సుధాకర్ తేజ
[email protected]
Cell: 7993467678

187
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles