రాజ్‌కపూర్ సినిమాలోని హీరోయిన్‌లా..


Sun,July 7, 2019 01:42 AM

Anya-Singh
సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడమంటే మామూలు విషయం కాదు. ప్రతిభతో పాటు, అదృష్టం ఉంటే తప్ప.. రాణించలేరు. అయితే అందివచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నది అన్యా సింగ్. డైరెక్టర్ రాజ్‌కపూర్ మనవడు ఆదార్ జైన్‌తో జతకట్టిన ఈ అమ్మడు.. రెండు సినిమాలకే బాలీవుడ్‌లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నది. అటు బాలీవుడ్ నుంచి టాలీవుడ్‌కు అడుగుపెడుతూసందీప్ కిషన్‌తో జోడీకట్టింది. నిను వీడని నీడను నేనే సినిమాతో టాలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోనున్న అన్యా గురించి మరిన్ని విషయాలు.

అన్యా సింగ్ ముద్దు పేరు అన్షు. తల్లిదండ్రులు పెట్టిన పేరునే ఇండస్ట్రీకి పరిచయం చేసింది.

పుట్టింది పంజాబ్‌లోనే అయినా ఢిల్లీలోనే ఉంటున్నది.

అన్యా హీరోయిన్‌గా కంటే ముందు, మోడల్‌గా రాణించింది.

అన్యాకు ఇష్టమైన హీరో రణ్‌వీర్ సింగ్.

లెక్స్ తలియోనిస్ బాలీవుడ్‌లో అన్యా మొదటి సినిమా. 2017లో ఖైదీ బ్యాండ్ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయింది.

అన్యా సింగ్ యాక్టింగ్ స్కూల్‌లో చేరలేదు. కుటుంబసభ్యుల్లో చిత్రపరిశ్రమకు చెందిన వారెవరూ లేరు. హబీబ్ ఫైసల్‌ను ఇండస్ట్రీ గురువుగా భావిస్తున్నది.

అన్యాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు చుట్టి రావాలనుకుంటుంది. దీంతోపాటు పుస్తకాలు చదువడమన్నా మక్కువే.

డిగ్రీ పూర్తి కాగానే ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.

తొలి రెండు సినిమాలతోనే బాలీవుడ్‌లో అన్యా సింగ్ మంచి నటిగా పేరు తెచ్చుకున్నది.

ఖైదీ బ్యాండ్ సినిమాలో అన్యా పాత్ర జైలు చుట్టూ సింగర్‌లా పరిచయం అవుతుంది. ఆ క్యారెక్టర్‌ను అర్థం చేసుకోవడమే పెద్ద సవాలుగా మారిందట. మేకప్ లేకుండా, చింపిరి జుట్టుతో తెరంగ్రేటం చేసినా.. అందరినీ మెప్పించింది.

- వనజ వనిపెంట

854
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles