Wimbledon : టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ వింబుల్డన్ మూడు రోజుల్లో షురూ కానుంది. ఈ టోర్నమెంట్లో వరల్డ్ నంబర్ 1 జన్నిక్ సిన్నర్ (Jannik Sinner)తో పాటు ఫ్రెంచ్ ఓపెన్ విజేత కార్లోస్ అల్కరాజ్(Carlos Alcaraz)లు ఫేవరెట్లుగా బరిలోకి దిగనున్నారు. ఈ ద్వయానికి గట్టి పోటీ ఇచ్చేందుకు నంబర్ 2 నొవాక్ జకోవిచ్(Novak Djokovic) రెడీ అయిపోయాడు.
మోకాలి సర్జరీ నుంచి కోలుకున్న జకో ప్రతిష్ఠాత్మక వింబుల్డన్‌లో సిన్నర్, అల్కరాజ్లకు గట్టీ పోటీ ఇచ్చే అవకాశముంది. అంతేకాదు ప్రాక్టీస్ కోసం సిన్నర్‌తో కలిసి జకో సెంట్రల్ కోర్టుకు వెళ్లిన ఫొటోలు వైరల్ అయ్యాయి. రికార్డు స్థాయిలో 24 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలిచిన జకోవిచ్ మరో ట్రోఫీ వేటకు సిద్ధమయ్యాడు. గాయం కారణంగా ఫ్రెంచ్ ఓపెన్ మధ్యలోనే వైదొలిగిన జకో ఈసారి టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్నాడు.
Walk and talk to Centre Court with @DjokerNole & @janniksin ✨#Wimbledon pic.twitter.com/7NUegZEspI
— Wimbledon (@Wimbledon) June 28, 2024
జూలై 1వ తేదీన వింబుల్డన్ మొదలవ్వనుంది. రెండు వారాల పాటు జరిగే ఈ టోర్నీలో విజేత ఎవరో 14 వ తేదీన తేలిపోనుంది. 2023లో మూడు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు కొల్లగొట్టిన జకో స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ రికార్డు బద్ధలు కొట్టాడు. అంతేకాదు పురుషుల టెన్నిస్‌లో 24 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లతో చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. అంతేకాదు ‘ప్లేయర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును సైతం తన్నుకుపోయాడు.