Suryakumar Yadav | టీ20 ప్రపంచకప్‌లో మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) తన అద్వితీయమైన ఫీల్డింగ్‌తో అదరగొట్టాడు. బౌండరీ లైన్ వద్ద పాదరసంలా కదులుతూ విలువైన పరుగులు ఆపడమే కాదు చురుకైన క్యాచ్‌లు అందుకొని జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో అంతర్జాతీయ టీ20 చరిత్ర ఎప్పటికీ నిలిచిపోయే క్యాచ్ అందుకున్నాడు. మ్యాచ్ నువ్వానేనా అన్నట్లు సాగుతున్నది. చివరి ఓవర్లో దక్షిఫ్రికా విజయానికి 16 పరుగులు అవసరమయ్యాయి. భారత హార్దిక్ పాండ్య బౌలింగ్ చేస్తున్నాడు. తొలి బంతికి హార్దిక్ వేసినలో ఫుల్‌టాస్‌ను బ్యాట్స్‌మెన్ డేవిడ్ మిల్లర్ (David Miller ) లాంగాఫ్ దిశగా భారీ షాట్ ఆడాడు. అది సిక్సర్ వెళ్లేలా కనిపించింది.
అయితే అక్కడికి కొద్దిదూరంలో ఫీల్డింగ్ చేస్తున్న సూర్య.. మెరుపు వేగంతో పరిగెత్తుకుంటూ వచ్చి బౌండరీ లైన్‌కు ఇంచు దూరంలో బాడీని బ్యాలెన్స్ చేసుకుంటూ రన్నింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. కానీ అప్పటికే బౌండరీ లైన్ ఆవలకు వెళ్తున్నానని గ్రహించిన సూర్య వెంటనే బంతిని గాల్లోకి ఎగిరేసి బౌండరీ లైన్ ఆవలకు వెళ్లి మళ్లీ లోపలికి వస్తూ పట్టిన క్యాచ్ ఈ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది.
What A Catch By Suryakumar Yadav 🔥🔥
Game changing catch 🥹❤️
Congratulations India 🇮🇳#INDvSA #T20WorldCup pic.twitter.com/2GGj4tgj7N— Elvish Army (Fan Account) (@elvisharmy) June 29, 2024
— एक नजर (@1K_Nazar) June 29, 2024