Virat Kohli’s wife : టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) భార్య అనుష్క (Anushka) తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ఆమె భర్తకు కోహ్లీకి సంబంధించిన ఓ కొత్త ఫొటోను షేర్ చేశారు. ఆ ఫొటోలో విరాట్ కోహ్లీ ఒంటిపై మువ్వన్నెల జెండా కప్పుకుని ఉన్నాడు. అదేవిధంగా కుడిచేతితో ‘అంతర్జాతీయ టీ20 వరల్డ్ కప్-2024’ ట్రోఫీని పైకెత్తి చూపిస్తున్నాడు.
ఈ ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ అనుష్క దానికి ఒక ఆసక్తికరమైన క్యాప్షన్ కూడా ఇచ్చారు. ‘నేను ఈ మనిషిని ప్రేమిస్తా. మిమ్మల్ని మా ఇంటికి పిలిచేందుకు చాలా అనందంగా ఉంది. ముందుగా సంబరాలు చేసుకునేందుకు ఇప్పుడు నాకొక గ్లాస్ స్వచ్ఛమైన నీళ్లు తెచ్చివ్వండి’ అనే క్యాప్షన్‌ను అనుష్క తాను షేర్ చేసిన ఫొటోకు జతచేశారు.
కాగా శనివారం దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మతో కలిసి ఓపెనర్‌గా బరిలో దిగిన కోహ్లీ 76 పరుగులు చేశాడు. అదేవిధంగా మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ, కోహ్లీ ఇద్దరూ అంతర్జాతీయ టీ20 లకు రిటైర్మెంట్ ప్రకటించారు.