మ్యాడ్రిడ్: ప్రపంచ టెన్నిస్ అభిమానులకు స్పెయిన్ దిగ్గజం రఫెల్ నాదల్, యువ సంచలనం కార్లొస్ అల్కారజ్ శుభవార్త చెప్పారు. రాబోయే పారిస్ ఒలింపిక్స్‌లో ఈ ఇద్దరూ డబుల్స్ విభాగంలో జోడీ కట్టనున్నారని స్పెయిన్ టెన్నిస్ సమాఖ్య బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. నాదల్‌ను ఆరాధించే అల్కారజ్.. ఇటీవలే ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గిన విషయం విదితమే. ఒక్కొక్కరుగా ఆడితేనే ప్రత్యర్థులను చుక్కలు చూపించే ఈ ఇద్దరూ.. కలిసి ఆడనుండటంతో అది అభిమానులకు కన్నుల పండుగే కానుంది.