Vamsi Modem | హైదరాబాద్, ఆట ప్రతినిధి: కోల్‌కతా వేదికగా జరుగుతున్న 50వ సీనియర్ జాతీయ పవర్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ యువ లిఫ్టర్ మోడం వంశీ సత్తాచాటాడు. గురువారం జరిగిన పురుషుల 66కిలోల విభాగం స్వాట్‌లో వంశీ వ్యక్తిగత పసిడి పతకంతోమెరిశాడు.
ఓవరాల్‌గా మూడో స్థానంతో కాంస్యాన్ని ఖాతాలో వేసుకున్నాడు. అక్టోబర్‌లో దక్షిణాఫ్రికా వేదికగా జరిగే కామన్వెల్త్ పవర్‌లిఫ్టింగ్ టోర్నీలో వంశీ..భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.