హైదరాబాద్, ఆట ప్రతినిధి: పంచకుల(హర్యానా) వేదికగా జరుగుతున్న 63వ జాతీయ ఇంటర్‌స్టేట్ సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ యువ అథ్లెట్ నిత్య గాదె కాంస్య పతకంతో మెరిసింది.
శుక్రవారం జరిగిన మహిళల 100మీటర్ల రేసును నిత్య 11.79సెకన్లలో ముగించి మూడో స్థానంలో నిలిచింది. ఇదే విభాగంలో పోటీపడ్డ స్నేహ(11.62సె), గిరిధరణి(11.77సె) వరుసగా స్వర్ణ, రజత పతకాలు కైవసం చేసుకున్నారు.