EURO 2024 : జర్మనీ వేదికగా జరుగుతున్న యూరో చాంపియన్‌షిప్ (EURO 2024)లో సంచలనం నమోదైంది. ఈ మెగా టోర్నీలో పసికూన చేతిలో పోర్చుగల్ (Portugal) ఓటమి పాలైంది. గురువారం ఉత్కంఠ రేపిన గ్రూప్ దశ మ్యాచ్‌లో 74వ ర్యాంకర్ జార్జియా (Gerogia) జోరు ముందు క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) బృందం నిలవలేకపోయింది. ప్రత్యర్థి ఆటగాళ్ల ఎత్తుల ముందు తలొంచిన రొనాల్డో సేన 2-0తో పరాజయం పాలైంది. వరల్డ్ ఫేమస్ ప్లేయర్ అయిన రొనాల్డో ఈ మ్యాచ్‌లో ఒక్క గోల్ కూడా కొట్టకపోవడం గమనార్హం.
పోర్చుగల్‌పై అనూహ్య విజయానికి రొనాల్డో సలహానే కారణమని జార్జియా ఆటగాడు కివిచ క్వరత్సెలియ తెలిపాడు. ‘మ్యాచ్ ఆరంభానికి ముందు మేము రొనాల్డోతో మాట్లాడాం. మేము విజయవంతం కావాలని ఆయన మాకు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. దాంతో మేము అద్భుతం చేయగలమని నమ్మాం’ అని కివిచ వెల్లడించాడు.
🤗 Wait for it…
Kvaratskhelia x Cristiano Ronaldo#EURO2024 pic.twitter.com/fkT4Qxk3wK
— UEFA EURO 2024 (@EURO2024) June 27, 2024
ఆట ప్రారంభమైన రెండో నిమిషంలోనే కివిచ గోల్ కొట్టడంతో జార్జియా ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే.. మ్యాచ్ రంజుగా సాగుతుండగా 27వ నిమిషంలో రొనాల్డోకు రిఫరీ ఎల్లో కార్డు చూపించాడు. అనంతరం రొనాల్డో పలుమార్లు ప్రయత్నించినా బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపలేకపోయాడు. దాంతో, పోర్చుగల్ జట్టు ఘోర ఓటమి మూటగట్టుకుంది.