Ritika Dangi | హైదరాబాద్, ఆట ప్రతినిధి: హుసేన్సాగర్ వేదికగా జరుగుతున్న 38వ హైదరాబాద్ సెయిలింగ్ వీక్లో రితికా దంగీ రెండు టైటిళ్లతో మెరిసింది. గురువారం జరిగిన ఐఎల్సీఏ-6 ఓపెన్, మహిళల కేటగిరీలో రితిక విజేతగా నిలిచి ఆకట్టుకుంది.
ప్రత్యర్థులకు దీటైన పోటీనిస్తూ ముందుకు సాగిన ఈ ఐఎన్డబ్ల్యూటీసీ సెయిలర్..అద్భుత ప్రదర్శన కనబరిచింది. మిగతా రేసులలో మోహిత్సైనీ ఐఎల్సీఏ-7 రేసులో విజేతగా నిలువగా, అంకిత్సింగ్, సౌమ్య సింగ్ వరుసగా ఐఎల్సీఏ బాలుర, బాలికల టైటిళ్లను దక్కించుకున్నారు.