IND vs SA : పొట్టి ప్రపంచ కప్‌లో విరాట్ కోహ్లీ(64) తొలి హాఫ్ సెంచరీ బాదాడు. అన్రిచ్ నోర్జి ఓవర్లో సింగిల్ తీసి యాభై పూర్తి చేసుకున్నాడు. భారత జట్టు ఇన్నింగ్స్‌ను నిలబెట్టిన విరాట్ సూపర్ బ్యాటింగ్ చేశాడు. అక్షర్ పటేల్(47)తో 72 రన్స్ జోడించాడు. ఆ తర్వాత శివం దూబే(22)తో మరో సారి జట్టుకు అసవరమైన పరుగులు చేశాడు. దాంతో, భారత జట్టు 18 ఓవర్లకు రన్స్ కొట్టింది.
టాస్ గెలిచిన భారత జట్టుకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. పవర్ ప్లేలోనే టాప్ ఆటగాళ్లంతా డగౌట్‌కు వెళ్లారు. దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్ ఒకే ఓవర్లో కెప్టెన్ రోహిత్ శర్మ(9), రిషభ్ పంత్(0)లను ఔట్ చేసి బ్రేకిచ్చాడు. ఆ షాక్ నుంచి తేరుకునే లోపే కగిసో రబడ డేంజరస్ సూర్యకుమార్ యాదవ్()ను వెనక్కి పంపాడు. లెగ్‌సైడ్ సూర్య కొట్టిన బంతిని బౌండరీ వద్ద క్లాసెన్ ఖతర్నాక్ క్యాచ్ అందుకున్నాడు. దాంతో, 33 పరుగులకే భారత్ మూడు వికెట్లు కోల్పోయింది. దాంతో, ఇన్నింగ్స్ నిర్మించే భారమంతా విరాట్ కోహ్లీపై పడింది. అక్షర్ పటేల్(47)తో కోహ్లీ 72 రన్స్ జోడించాడు.