Jasprit Bumrah : పొట్టి ప్రపంచ కప్‌లో భారత స్పీడ్‌స్టర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ఇరగదీస్తున్నాడు. లైన్ అండ్ లెంగ్త్, యార్కర్లతో ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తున్నాడు. ఇంగ్లండ్‌తో సెమీఫైనల్ మ్యాచ్‌కు ముందు బుమ్రా కాస్త రిలాక్స్ అయ్యాడు. ఆస్ట్రేలియాపై విజయం అనంతరం ఈ పేస్ గన్ కుటుంబంతో కలిసి కరీబియన్ సముద్రపు ఒడ్డున సేదతీరాడు.
సెయింట్ లూయిస్ (ST. Luis) బీచ్‌లో భార్య సంజనా గణేశన్ (Sanjana Ganeshan), కుమారుడు అంగద్ (Angadh)తో కలిసి బుమ్రా సరదాగా గడిపాడు. వాళ్లిద్దరితో సూర్యాస్తమాన్ని వీక్షిస్తూ తెగ మురిసిపోయాడు. తమ ఫ్యామిలీ బీచ్‌లో చిల్ అవుతున్న ఫొటోలను సంజనా సోషల్ మీడియాలో పెట్టింది.
ప్రపంచంలోనే మేటి బౌలర్‌గా పేరొందని బుమ్రా నిరుడు వన్డే వరల్డ్ కప్‌లో వికెట్ల వేట కొనసాగించాడు. ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ లోనూ పవర్ ప్లేలో కీలక వికెట్లు తీస్తూ రోహిత్ సేనకు బ్రేకిస్తున్నాడు. మెగా టోర్నీలో చెలరేగుతున్న బుమ్రా ఇప్పటివరకూ 6 మ్యాచుల్లో 11 వికెట్లు పడగొట్టాడు.
లీగ్ దశ నుంచి అదరగొడుతూ సూపర్ 8లోనూ టీమిండియా విజయాల్లో భాగమైన ఈ యార్కర్ కింగ్ సెమీస్‌లోనూ సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. తన బుల్లెట్ బంతులతో ఇంగ్లండ్ బ్యాటర్లను ఇరుకున పెట్టేందుకు బుమ్రా ఎదురుచుస్తున్నాడు. గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియం వేదికగా రాత్రి 8 గంటలకు జరిగే రెండో సెమీ ఫైనల్లో భారత్, ఇంగ్లండ్ ఢీ కొననున్నాయి.