Dinesh Karthik | బెంగళూరు: భారత మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ కొత్త కెరీర్ మొదలుపెట్టబోతున్నాడు. ఇటీవలే తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు పలికిన కార్తీక్..తాజాగా రాయల్‌చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) బ్యాటింగ్ కోచ్, మెంటార్‌గా ఎంపికయ్యాడు.
ఈ విషయాన్ని ఆర్సీబీ సోమవారం తమ అధికారిక ఎక్స్(ట్విటర్) ద్వారా వెల్లడించింది. ‘మా కీపర్‌కు అన్ని రకాలుగా స్వాగతం పలుకుతున్నాం. కార్తీక్ కొత్త రూపంలో ఆర్సీబీలోకి వస్తున్నాడు. బ్యాటింగ్ కోచ్‌తో పాటు మెంటార్‌గా డీకే వ్యవహరిస్తాడు’ అని రాసుకొచ్చింది. జీవితంలో కొత్త కెరీర్‌ను మొదలుపెట్టబోతున్నందుకు చాలా ఆసక్తితో ఎదురుచూస్తున్నానని కార్తీక్ పేర్కొన్నాడు.