Wimbledon : టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ వింబుల్డన్‌లో సంచలనం నమోదైంది. డిఫెండింగ్ చాంపియన్ మార్కెటా ఒడ్రుసోవా (Marketa Vondrousova) తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఆమె అన్‌సీడెడ్ చేతిలో ఊహించని పరాజయంతో టోర్నీని ముగించింది.
మంగళవారం సెంటర్ కోర్టులో జరిగిన మ్యాచ్‌లో జెస్సికా బౌజస్ మనెరియో ధాటికి ఒండ్రుసోవా తలొంచింది. తొలి గ్రాండ్‌స్లామ్ ఆడుతున్న జెస్సికా జోరు ముందు నిలవలేక వరు సెట్లలో కనీస పోటీ ఇవ్వలేక 4-6, 2-6తో ఓడిపోయింది. మ్యాచ్‌లో 28 అనవసర తప్పిదాలు చేసిన ఒండ్రూసోవాకు ఇది మర్చిపోలేని పరాభవమే.
The rarest of first round victories ✨#Wimbledon pic.twitter.com/Nrx4dkiOdm
— Wimbledon (@Wimbledon) July 2, 2024
మరోవైపు మాజీ చాంపియన్ ఎలీనా రిబాకినా, జెస్సికా పెగులా(Jessica Pegula) లు ముందంజ వేశారు. 2022లో వింబుల్డన్ ట్రోఫీని ముద్దాడిన రిబాకీనా తొలి సెట్ నుంచి దూకుడుగా ఆడి ఎలెనా గాబ్రియెల్లా రూసెను మట్టికరిపించింది. మరో మ్యాచ్‌లో జెస్సికా సూపర్ షోతో అష్లిన్ క్రుగెర్ 6-2, 6-0తో చిత్తుగా ఓడించి రెండో రౌండ్లో అడుగు పెట్టింది.
Power, and precision 👏
Elena Rybakina has all the shots 🙌#Wimbledon pic.twitter.com/ZxCZhVdh3r
— Wimbledon (@Wimbledon) July 2, 2024