US Open 2024 : టెన్నిస్ క్యాలెండర్లో చివరిదైన యూఎస్ ఓపెన్ (US Open 2024)కు మరో రెండు రోజులే ఉంది. సోమవారం మొదలవ్వనున్న ఈ గ్రాండ్‌స్లామ్‌లో కొకో గాఫ్(Coco Gauff) ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. పారిస్ ఒలింపిక్స్‌లో నిరాశపరిచిన గాఫ్ టైటిల్ నిలబెట్టుకునేందుకు సిద్ధమైంది. డిఫెండింగ్ చాంపియన్‌గా అడుగు పెడుతున్న అమెరికా టీనేజర్ వరుసగా రెండో ట్రోఫీ కొల్లగొట్టాలనే పట్టుదలతో ఉంది.
‘డిఫెండింగ్ చాంపియన్‌గా ఒత్తిడి ఉండడం మామూలే. అయితే.. అదొక గౌరవం కూడా. అయితే.. నా నూతన ఉద్దేశం ఏంటంటే..? నువ్వు టైటిల్ నిలబెట్టుకుంటే అంతకంటే ముందు ట్రోఫీ గెలిచావని అర్ధం’ అని గాఫ్ మీడియా సమావేశంలో తెలిపింది. యూఎస్ ఓపెన్ తొలి రౌండ్లో గాఫ్ ఫ్రాన్స్‌కు చెందిన వర్వరా గ్రచెవా (Varvara Gracheva)తో తలపడనుంది.
ఒలింపిక్స్‌లో గాఫ్ అంచనాలు అందుకోలేకపోయింది. మహిళల సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్.. మూడు విభాగాల్లోనూ సత్తా చాటలేక ఖాళీ చేతులతో వెనుదిరిగింది. నిరుడు అరీనా సబలెంకను చిత్తు చేసింది. ఆద్యంతం ఉత్కంఠ రేపిన మూడు సెట్ల పోరులో పట్టుదలగా పోరాడిన గాఫ్ 19 ఏండ్లకే గ్రాండ్‌స్లామ్ చాంపియన్‌గా అవతరించింది. ఆగస్టు 26వ తేదీన యూఎస్ ఓపెన్ మొదలవ్వునుంది.