సైకిల్ పార్టీకి మేలు జరిగేలా..

Tue,January 14, 2020 05:19 PM

అమరావతి: ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ కార్యదర్శి, ఎంపీ విజయ సాయిరెడ్డి ట్విటర్‌ లో విమర్శలు చేశారు. రాజధాని తరలింపు వ్యవహారంలో బాబు అనుసరిస్తున్న వైఖరిపై ఆయన మండిపడ్డారు.


'అమరావతిని ఎలా మారుస్తారని పళ్లు కొరికారు. ప్రభుత్వం కూలిపోతుందని శాపాలు పెట్టారు. ఉత్తుత్తి ఉద్యమాన్ని ప్రారంభించారు. బంగారు నగల సేకరణకు దిగారు. తర్వాత జోలెతో ఊరూరూ తిరుగుతున్నారు. ఆఖరున వచ్చిన డబ్బును పంచుకుని ఎవరి దారిన వాళ్లు వెళ్లి పోతారు. యజమాని ఆర్డరేస్తేనే ప్యాకేజీ స్టార్ బీజేపీ చుట్టూ తిరుగుతున్నాడు. రాష్ట్ర బీజేపీని తన ఆధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నంలో ముందుగా పావలాను పంపిస్తున్నాడు బాబు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కమలానికి పొత్తు వల్ల ఒరిగేదేమి లేకున్నా సైకిల్ పార్టీకి మేలు జరిగేలా చూసుకోవాలనేది బాబు ఎత్తుగడ' అని విజయ సాయిరెడ్డి ఆరోపించారు.

1940
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles