కామన్‌వెల్త్ గేమ్స్‌లో ఉమెన్స్ టీ 20 క్రికెట్

Tue,August 13, 2019 04:44 PM

Womens T20 cricket included in the 2022 Commonwealth Games

దుబాయ్: 2022లో జరిగే కామన్‌వెల్త్ గేమ్స్‌లో ఉమెన్స్ టీ 20 క్రికెట్ ఉండనున్నట్లు ఇంటర్‌నేషనల్ క్రికెట్ కౌన్సిల్, ఇంగ్లాండ్ వెల్స్ క్రికెట్ బోర్డు, కామన్‌వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ ప్రకటించాయి. ఉమెన్స్ క్రికెట్‌ను బలోపేతం చేయడానికి కామన్‌వెల్త్ ఆటల్లో మహిళల క్రికెట్‌ను జోడించినట్లు ఐసీసీ చీఫ్ ఎక్సిక్యూటీవ్ మను సహ్ని తెలిపారు. ఇంగ్లాండ్‌లోని బిర్మింగాం సిటిలో ఈ పోటీలు నిర్వహించనున్నారు. 2022 కామన్‌వెల్త్ గేమ్స్ ఇంగ్లాండ్‌లో 2022 జులై 27వ తేదీ నుంచి 2022 ఆగస్టు 7వ తేదీ వరకు జరగనున్నాయి. 18 ఆటల్లో 4500 మంది ఆటగాళ్లు ఇందులో పాల్గొంటారు.

548
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles