కోహ్లి వంద సెంచరీలు కొట్టగలడు!

Wed,January 16, 2019 02:46 PM

Virat Kohli can make Hundred centuries if he is fit says Azharuddin

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిపై ప్రశంసల వర్షం కురిపించాడు మాజీ కెప్టెన్ అజారుద్దీన్. అతను ఫిట్‌గా ఉంటే గనక కెరీర్‌లో వంద సెంచరీల మార్క్‌ను అందుకోగలడని అజర్ అన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో కోహ్లి సెంచరీ చేసిన విషయం తెలిసిందే. వన్డేల్లో కోహ్లికిది 39వ సెంచరీ కావడం విశేషం. కోహ్లి నిలకడ అద్భుతంగా ఉంది. అతను ఫిట్‌గా ఉండగలిగితే వంద సెంచరీల మార్క్‌ను అందుకోగలడు. నిలకడ విషయానికి వస్తే అతడు ఎంతో మంది గొప్ప ప్లేయర్స్ కంటే ఎంతో ముందున్నాడు. అతనో గొప్ప ప్లేయర్. అతడు సెంచరీ చేసినప్పుడు టీమ్ ఓడిన సందర్భాలు చాలా తక్కువ అని అజర్ అన్నాడు.

ఇక కీలకమైన హాఫ్ సెంచరీతో గెలుపులో తన వంతు పాత్ర పోషించిన ఎమ్మెస్ ధోనీపై కూడా అజర్ ప్రశంసల వర్షం కురిపించాడు. టాపార్డర్ విజయవంతమైనప్పుడల్లా ఇండియా గెలుస్తూనే ఉంది. దురదృష్టవశాత్తు గత మ్యాచ్‌లో చాలా త్వరగా మూడు వికెట్లు కోల్పోయింది. రోహిత్ సెంచరీ చేసినా ఓడిపోయాం. కానీ రెండో వన్డేలో కోహ్లి, ధోనీ బాగా ఆడారు. చివర్లో ధోనీ అలసిపోయినా వికెట్ పారేసుకోలేదు. కార్తీక్ కూడా బాగా ఆడాడు అని అజర్ అన్నాడు. అటు ఆస్ట్రేలియా కోచ్ జస్టిన్ లాంగర్ కూడా కోహ్లిని ఆకాశానికెత్తాడు. సచిన్‌లాగే కోహ్లి కూడా అంతర్జాతీయ క్రికెట్‌పై చెరగని ముద్ర వేస్తున్నాడని లాంగర్ చెప్పాడు.

2382
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles