జాతీయ స్థాయి బాస్కెట్‌బాల్ టోర్నీలో తెలంగాణ జోరు

Wed,November 20, 2019 06:35 AM

హైదరాబాద్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(ఎస్‌జీఎఫ్) ఆధ్వర్యంలో న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న జాతీయస్థాయి బాస్కెట్‌బాల్ టోర్నీలో తెలంగాణ జట్టు తమదైన జోరు కొనసాగిస్తున్నది. ఆంధ్రప్రదేశ్‌పై బోణీ కొట్టిన తెలంగాణ మంగళవారం జరిగిన మ్యాచ్‌లో డీఏవీ(దయానంద్ ఆంగ్లో వేదిక్)పై 43-24 తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్ ప్రారంభం నుంచి తమదైన దూకుడు కనబర్చిన మన జట్టులో కన్నా(14), గౌతమ్(12), చరణ్(9), ప్రతీక్(6) ఆకట్టుకున్నారు. బుధవారం మధ్యప్రదేశ్‌తో తెలంగాణ జట్టు తలపడుతుంది.

268
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles