సురేశ్ రైనాకు సర్జరీ

Sat,August 10, 2019 10:45 AM

Suresh Raina undergoes knee surgery in Amsterdam

అమస్టర్‌డ్యామ్: టీమిండియా సీనియర్ క్రికెటర్ సురేశ్ రైనాకు శస్త్ర చికిత్స జరిగింది. కొన్ని నెలలుగా మోకాలి సమస్యతో బాధపడుతున్న రైనా అమస్టర్‌డ్యామ్‌లో మోకాలికి సర్జరీ చేయించుకున్నాడు. 32ఏండ్ల రైనా గత సీజన్ నుంచి మోకాలి నొప్పితో ఇబ్బందిపడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే శాశ్వత పరిష్కారం కోసం వైద్యుల సూచన మేరకు శస్త్రచికిత్స చేయించుకున్నాడు. శస్త్రచికిత్స విజయవంతమైందని కోలుకునేందుకు 4-6 వారాల సమయం పడుతుందని రైనాకు ఆపరేషన్ చేసిన డాక్టర్ వెల్లడించాడు. అంతర్జాతీయ కెరీర్‌లో రైనా భారత్ తరఫున 18 టెస్టులు, 226 వన్డేలు, 78 టీ20లు ఆడాడు. లీడ్స్‌లో ఇంగ్లాండ్‌తో 2018 జులైలో జరిగిన వన్డే మ్యాచ్‌లో చివరిసారిగా భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు.

1220
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles