పాక్ మాజీ కెప్టెన్ రికార్డు బ్రేక్ చేసిన స్టీవ్‌స్మిత్

Sat,September 14, 2019 10:31 AM

లండన్: యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ పరుగుల వరద పారిస్తున్నాడు. సహచర బ్యాట్స్‌మెన్ విఫలమైన చోట ఇంగ్లాండ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ భారీ ఇన్నింగ్స్‌లతో చెలరేగుతున్నాడు. యాషెస్‌లో చివరిదైన ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లోనూ స్మిత్(80: 145 బంతుల్లో 9ఫోర్లు, 1సిక్స్) సత్తా చాటాడు. స్వల్ప వ్యవధిలోనే ఓపెనర్లు వెనుదిరిగా.. తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్ అంతగా సహకారం అందించకపోయినా జట్టుకు మెరుగైన స్కోరు అందించాడు. అసాధారణ స్థాయిలో బ్యాట్‌తో విశేషంగా రాణిస్తున్న స్మిత్ పలు అంతర్జాతీయ అరుదైన రికార్డులను బ్రేక్ చేస్తూ దూసుకెళ్తున్నాడు.


ఐదో టెస్టు రెండో రోజు ఆటలో స్మిత్ మరో అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. ఈ సిరీస్‌లో స్మిత్ ఇప్పటికే రెండు శతకాలు, రెండు అర్ధశతకాలు, ఒక డబుల్ సెంచరీ సాధించిన విషయం తెలిసిందే. సిరీస్‌లో ఐదోసారి 50 మార్క్ దాటడంతో గతంలో పాకిస్థాన్ కెప్టెన్ ఇంజమామ్ హుల్ హక్ పేరిట ఉన్న రికార్డును స్మిత్ తాజాగా అధిగమించాడు. టెస్టు క్రికెట్‌లో ఒకే జట్టుపై అత్యధికంగా 50+ స్కోర్లు సాధించిన రికార్డు గతంలో ఇంజమామ్ పేరిట ఉంది. తాజాగా ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్‌సెంచరీ పూర్తి చేసుకోవడంతో స్మిత్ ఈ ఘనత అందుకున్నాడు. ప్రస్తుత యాషెస్ సిరీస్‌లో 50 రన్ మార్క్ చేరుకోవడం ఇది అతనికిది ఆరోసారి కావడం విశేషం. మాజీ పాక్ సారథి ఇంజమామ్ ఇంగ్లాండ్‌పై తొమ్మిదిసార్లు 50+ స్కోర్లు సాధించగా.. అదే జట్టుపై స్మిత్(10*) వరుసగా 10సార్లు 50కిపైగా స్కోర్లు నమోదు చేసిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు.

1030
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles