బీసీసీఐ నిర్ణ‌యాన్ని స్వాగ‌తించిన కేంద్ర క్రీడాశాఖ మంత్రి

Sat,August 10, 2019 12:36 PM

Sports minister Rijiju welcomes BCCIs move to come under NADA rules

హైదరాబాద్‌: నాడా ప‌రిధిలోకి బీసీసీఐ రావ‌డాన్ని కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిర‌ణ్ రిజుజు స్వాగ‌తించారు. దీని ద్వారా క్రీడ‌ల్లో పార‌ద‌ర్శ‌క‌త పెరుగుతుందన్నారు. ఇక నుంచి క్రికెట‌ర్లు కూడా డోపింగ్ ప‌రీక్ష‌ల‌కు హాజ‌రుకానున్న‌ట్లు శుక్ర‌వారం బీసీసీఐ చెప్పిన విష‌యం తెలిసిందే. బీసీసీఐ ఓ పాజిటివ్ నిర్ణ‌యం తీసుకున్న‌ద‌ని మంత్రి రిజుజు చెప్పారు. క్రీడ‌లు, క్రీడాకారుల స‌మ‌స్య‌లు అప‌రిష్కృతంగా ఉండ‌డాన్ని స‌హిచంలేన‌ని మంత్రి తెలిపారు. ఇన్నాళ్లు స్వతంత్రంగా వ్యవహరించిన బోర్డు...నాడా నిబంధనలకు అనుగుణంగా మారేందుకు ముందుకొచ్చింది. కేంద్ర క్రీడా కార్యదరి రాధేశ్యామ్ ఝులనియా, నాడా డీజీ నవీన్ అగర్వాల్‌తో బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రీ, క్రికెట్ ఆపరేషన్స్ జీఎం సాబా కరీమ్ శుక్రవారం సమావేశమయ్యారు. ఈ భేటీలో తాము నాడా పరిధిలో వచ్చేందుకు సమ్మతమే అంటూ లిఖితపూర్వక హామీ ఇచ్చారు. దీంతో ఇక నుంచి నాడా నీడలోకి రావడంతో పాటు ఇకముందు జాతీయ స్పోర్ట్స్ సమాఖ్య(ఎన్‌ఎస్‌ఎఫ్)గా బీసీసీఐ ఏర్పడనుంది. ఈ కారణంగా సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) పరిధి కింద బీసీసీఐని ప్రశ్నించే అవకాశం కూడా దక్కింది. బోర్డులో జరుగుతున్న ఏ విషయం గురించి అయినా ఆర్టీఐ కింద సమాచారం పొందే అవకాశం లభిస్తుంది. బీసీసీఐ సమ్మతితో క్రికెటర్లందరినీ నాడా పరీక్షిస్తుందని క్రీడా కార్యదర్శి ఝులనియా అన్నారు. అంగీకారానికి ముందు బీసీసీఐ మా ముందు మూడు ప్రతిపాదనలు తీసుకొచ్చింది. డోప్ టెస్టింగ్ కిట్స్ నాణ్యత, పాథలజిస్టుల అనుభవం, సాంపిల్ సేకరణ. బోర్డు కోరిన వాటికి మేము సమ్మతించాం. కానీ సమకూర్చేందుకు డబ్బులు వసూలు చేస్తాం. అలాగనీ దేశంలోని అన్ని ఎన్‌ఎస్‌ఎఫ్‌ల లాగే బీసీసీఐకి సౌకర్యాలు కల్పిస్తాం అందులో ఎలాంటి తేడా ఉండదు. ఎవరైనా నిబంధనలు పాటించాల్సిందే అని ఝులనియా అన్నారు.

1052
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles