లంచ్ విరామానికి సౌతాఫ్రికా.. 129-6

Mon,October 21, 2019 12:06 PM

రాంచీ: భారత్‌తో జరుగుతున్న చివరి టెస్టులో సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్ ఎదురీదుతున్నారు. వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్ జుబైర్ హంజా(62) మినహా ఏ ఒక్క బ్యాట్స్‌మెన్ రాణించలేదు. మొదటి సెషన్ ముగిసే సమయానికి సౌతాఫ్రికా 6 వికెట్లు కోల్పోయి, 129 పరుగులు చేసింది. జార్జ్ లిండే(10), డేన్ పైడ్ట్(4) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో ఉమేష్‌యాదవ్, రవీంద్ర జడేజా చెరో 2 వికెట్లు పడగొట్టగా.. పేసర్ షమీ, అరంగేట్ర బౌలర్ నదీమ్ ఒక్కో వికెట్ తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా ఇంకా 368 పరుగులు వెనకబడి ఉంది. మూడో రోజు తొలి సెషన్ లో భారత బౌలర్లు తమ తడాఖా చూపించారు. 4 వికెట్లు పడగొట్టి భారత్ ను తిరుగులేని స్థాయిలో నిలబెట్టారు.



555
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles