అంతర్జాతీయ స్థాయి కరాటే పోటీలకు క్రీడాకారుల ఎంపిక

Thu,November 7, 2019 06:22 AM

హైదరాబాద్: ఈనెల 15నుంచి 17వరకు పంజాబ్ రాష్ట్రం అమృత్‌సర్‌లో జరిగే నాలుగో ఓపెన్ కరాటే ఇంటర్నేషనల్ చాంపియన్‌షిప్ 2019 షోటోకాన్ కరాటే పోటీల్లో పాల్గొనే జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించే క్రీడాకారుల జాబితా బుధవారం విడుదల చేశారు. కరాటే ఫెడరేషన్ షోటోకాన్(కేఎఫ్‌ఎస్) అధ్యక్షులు, టెక్నికల్ డైరెక్టర్ గణేశ్ ఈ పోటీల్లో పాల్గొనే 9 మంది క్రీడాకారుల జాబితాను ప్రకటించారు. జాబితాలో వసి తన్విక(బ్లాక్ బెల్ట్-48కేజీల కేటగిరి-భవన్స్ శ్రీఅరబిందో జూ.కళాశాల), శుచి దండేకర్(బ్రౌన్-32కేజీ కేటగిరి-అటామిక్ ఎనర్జీ స్కూల్), శ్రుఆన్ కర్రె(బ్రౌన్‌బెల్ట్-52కేజీల కేటగిరి- డీఏవీ పబ్లిక్‌స్కూల్), ఇర్ఫాన్ నాజర్ (బ్లాక్‌బెల్ట్-39కేజీలు-కాల్ పబ్లిక్ స్కూల్), జి.కౌశిక్‌కుమార్(బ్రౌన్-సబ్‌జూనియర్-28కేజీలు- తక్షశిల పబ్లిక్ స్కూల్), ఓంకృష్ణ(మెరూన్-సబ్‌జూ-38కేజీలు- భవన్స్‌విద్యాలయ), హాసిని(మెరూన్-సబ్‌జూ-40కేజీ-భవన్స్), టి.రక్షిత(బ్లూ-సబ్‌జూ-48కేజీలు-ఢిల్లీ పబ్లిక్ స్కూల్), కే.సాత్విక్‌రెడ్డి(బ్రౌన్-సబ్‌జూ-39కేజీ-డీఏవీ పబ్లిక్‌స్కూల్) ఉన్నారు. వీరిలో ఐదుగురు కాప్రా సర్కిల్‌కు చెందినవారే ఉండటం విశేషం. మిగిలినవారిలో ముగ్గురు మల్కాజిగిరి సర్కిల్‌, ఒకరు తార్నాకకు చెందిన వారు ఉన్నారు. కోచ్‌గా గణేశ్‌ గడియారం, మేనేజర్‌గా రామకృష్ణ, మెంటార్‌గా వసి ప్రశాంతి వ్యవహరించనున్నారు.

350
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles