నిద్ర‌పోని రాస్ టేల‌ర్

Thu,July 11, 2019 01:32 PM

హైద‌రాబాద్‌: రిజ‌ర్వ్‌డే రోజున న్యూజిలాండ్ 23 బంతులు ఆడాలి ? ఎలా ఆడాలి ? రాత్రంతా రాస్ టేల‌ర్‌కు నిద్ర‌ప‌ట్ట‌లేదు. ఏం చేయాలో తోచ‌లేదు. నాటౌట్‌గా ఉన్న టేల‌ర్ అదే ధ్యాస‌లో ఉండిపోయాడు. తెల్ల‌వారుజామున‌ 3 గంట‌ల‌కే నిద్ర లేచాడు. సుమారు 5 గంట‌ల స‌మ‌యంలో భార్య‌కు మెసేజ్ చేశాడు. ఆమె కూడా నిద్ర‌పోలేద‌ని రిప్లై ఇచ్చింది. భార‌త్‌తో సెమీస్‌ మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా రిజ‌ర్వ్‌డేకు పొడిగించిన త‌ర్వాత‌.. న్యూజిలాండ్ ప్లేయ‌ర్లు డ్రెస్సింగ్ రూమ్‌లో కొన్ని గంట‌లు గ‌డిపారు.


కెప్టెన్ కేన్ విలియ‌మ్‌స‌న్‌, రాస్ టేల‌ర్ చాలా సేపు మాట్లాడుకున్నారు. క‌నీసం 240 చేస్తే మ్యాచ్ గెలుస్తామ‌ని టేల‌ర్‌తో విలియ‌మ్‌స‌న్ చెప్పాడు. 23 బంతుల‌ను ఎలాగైనా ఆడాలి. నీష‌మ్‌, గ్రాండ్‌హోమ్‌లు భారీ షాట్లు కొట్ట‌గ‌ల‌ర‌న్న ధీమాతో ఉన్నారు. అయితే 50 ఓవ‌ర్ల‌లో న్యూజిలాండ్ 239 ర‌న్స్ చేసింది. ఆ టార్గెట్‌ను డిఫెండ్ చేయ‌డం సులువే అన్న న‌మ్మ‌కం కివీస్ ప్లేయ‌ర్ల‌కు క‌లిగింది.

కానీ ఫీల్డింగ్‌లో మాత్రం పొర‌పాట్లు ఉండ‌కూడ‌ద‌న్న సంకేతాన్ని కేన్ స్ప‌ష్టం చేశాడు. ఒక్క క్యాచ్ వ‌ద‌లొద్దు, ర‌నౌట్ ఛాన్స్ మిస్ చేయ‌వ‌ద్దు అన్న వార్నింగ్‌లు వెళ్లాయి. మాంచెస్ట‌ర్ క్రికెట్ పిచ్‌ను అంచ‌నా వేసిన పండితులు ఆశ్చ‌ర్యానికి గుర‌య్యారు. కానీ టేల‌ర్‌, కేన్‌లు మాత్రం ప‌క్కా ప్లాన్ చేశారు. కొత్త‌గా బ్యాటింగ్‌కు వ‌చ్చిన ప్లేయ‌ర్ నిల‌దొక్కుకోవ‌డం కష్టం అన్న సంగ‌తి గ్ర‌హించారు. దాని ప్ర‌కార‌మే కివీస్ బౌల‌ర్లు చెల‌రేగిపోయారు. ఆరంభంలోనే టీమిండియా టాపార్డ‌ర్‌ను లేపేశారు.

ప‌ది ఓవ‌ర్లు ముగియ‌క‌ముందే రోహిత్‌, రాహుల్‌, విరాట్‌, దినేశ్ లాంటి ప్లేయ‌ర్లు పెవిలియ‌న్‌కు వెనుదిరిగారు. కీల‌క‌మైన ద‌శ‌లోనే కివీస్ బౌల‌ర్లు రాణించారు. నెట్ ర‌న్‌రేట్‌లో మేం వెనుకే ఉన్నాం, కానీ సెమీస్‌కు వ‌చ్చిన మాకు మా స‌త్తా ఏంటో తెలుసు అని టేల‌ర్ చెప్పాడు. వ‌ర‌ల్డ్‌క‌ప్ సెమీస్ మ్యాచ్‌లో టేల‌ర్ 90 బంతుల్లో 74 ప‌రుగులు చేసి భార‌త్‌ను దెబ్బ‌తీశాడు. నిజానికి ఇది భార‌త్ పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న కాదు.. ఇది కివీస్ అద్భుత పోరాట‌మే. వ‌న్డేల్లో మ‌న‌మే బెస్ట్‌.. కానీ రిజ‌ర్వ్‌డేలో మాత్రం కాదేమో !

7637
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles