డుప్లెసిస్ వికెట్ కోల్పోయిన ప్రొటీస్..

Mon,October 21, 2019 10:09 AM

రాంచీ: ఇండియాతో తలపడుతున్న చివరిదైన మూడో టెస్టులో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ తడబడుతున్నారు. మూడో రోజు ఆదిలోనే భారత పేసర్ ఉమేష్ యాదవ్ దక్షిణాఫ్రికా కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ వికెట్ తీసి, భారత్‌ను సంబరాల్లో ముంచెత్తాడు. దీంతో పర్యాటక జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. భారత్ బౌలింగ్‌ను ఎదుర్కోవడానికి ప్రొటీస్ బ్యాట్స్‌మెన్ ఆపసోపాలు పడుతున్నారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా 10.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి, 41 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా ఇంకా 456 పరుగులు వెనుకబడి ఉంది. భారత్ బౌలర్లలో ఉమేష్ 2 వికెట్లు తీయగా, షమీ 1 వికెట్ పడగొట్టాడు.



893
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles