ఆల్‌టైం రికార్డు: ఆరు వికెట్లు..సున్నా పరుగులు

Mon,December 2, 2019 03:19 PM

న్యూఢిల్లీ: నేపాల్ మహిళా క్రికెటర్ అంజలీ చంద్ చరిత్ర సృష్టించింది. వైవిధ్యమైన బంతులతో అంతర్జాతీయ క్రికెట్లో అరుదైన ఘనత సాధించింది. అంజలీ బౌలింగ్ ధాటికి ప్రత్యర్థి జట్టు కేవలం 16 పరుగులకే కుప్పకూలింది. మీడియం పేసర్ అంజలీ 2.1 ఓవర్లు వేసి 6 వికెట్లు పడగొట్టి..కనీసం ఒక్క పరుగు కూడా ఇవ్వకపోవడం విశేషం. దీంతో మాల్దీవుల జట్టు 11 ఓవర్లకే పెవిలియన్ చేరింది. దక్షిణాసియా గేమ్స్‌లో మాల్దీవులతో తొలి మ్యాచ్‌లో సంచలన విజయంతో నేపాల్ శుభారంభం చేసింది. మహిళల టీ20 క్రికెట్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసి గత రికార్డును ఆమె బ్రేక్ చేసింది. మాల్దీవుల క్రీడాకారిణి మాస్ ఎలీసా.. చైనా విమెన్స్ జట్టుతో మ్యాచ్‌లో 6 వికెట్లు తీసి 3 పరుగులే ఇచ్చింది. తాజాగా ఈ మైలురాయిని అంజలీ అధిగమించింది.



బంగ్లాదేశ్‌తో నాగ్‌పూర్ వేదికగా జరిగిన చివరి టీ-20లో భారత బౌలర్ దీపక్ చాహర్ రికార్డు స్థాయి ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. మ్యాచ్‌లో వరుసగా మూడు వికెట్లు పడగొట్టిన చాహర్.. అంతర్జాతీయ టీ-20ల్లో హ్యాట్రిక్ సాధించిన తొలి భారత బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. ఓవరాల్ గా టీ20 ల్లో కేవలం ఏడు పరుగులే ఇచ్చి ఆరు వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా కూడా దీపక్ నిలిచాడు.

1204
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles