మేరీకామ్‌కు ప‌ద్మ‌విభూష‌ణ్.. సింధూకు ప‌ద్మభూష‌ణ్‌ !

Thu,September 12, 2019 01:28 PM

Mary Kom Recommended for Padma Vibhushan, PV Sindhu for Padma Bhushan in All-Women Sports Ministry List

హైద‌రాబాద్‌: బ్యాడ్మింట‌న్ ప్లేయ‌ర్ పీవీ సింధు.. ప‌ద్మ‌భూష‌ణ్ అవార్డుకు నామినేట్ అయిన‌ట్లు తెలుస్తోంది. ఇటీవ‌ల వ‌ర‌ల్డ్ బ్యాడ్మింట‌న్ టోర్నీలో స్వ‌ర్ణ ప‌త‌కం గెలిచి చ‌రిత్ర సృష్టించిన సింధూ టాప్ ఫామ్‌లో దూసుకువెళ్లుతున్న‌ది. అయితే హైద‌రాబాదీ ష‌ట్ల‌ర్‌కు ప‌ద్మవిభూషణ్ ఇవ్వాల‌ని నామినేష‌న్ దాఖ‌లైన‌ట్లు క్రీడా వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది. కేంద్ర క్రీడామంత్రిత్వ‌శాఖ వ‌ర్గాలు ఈ విష‌యాన్ని ద్రువీక‌రించారు. 2015లో సింధూకు ప‌ద్మ‌శ్రీ ద‌క్కింది. గ‌త ఏడాది ప‌ద్మ‌భూష‌ణ్‌కు పేరును ప్ర‌స్తావించినా.. క్రీడాశాఖ దానికి ఓకే చెప్ప‌లేదు. బాక్స‌ర్ ఎంసీ మేరీకామ్ కూడా ఇటీవ‌ల ప‌త‌కాల‌తో ప్ర‌పంచ రికార్డులు సృష్టిస్తున్న విష‌యం తెలిసిందే. ప‌ద్మ‌విభూష‌ణ్ అవార్డు కోసం మేరీకామ్‌ను నామినేట్ చేసిన‌ట్లు అధికార వ‌ర్గాల ద్వారా వెల్ల‌డ‌వుతోంది. మేరీకామ్ ఆరు సార్లు వ‌ర‌ల్డ్ టైటిల్‌ను గెలుచుకున్న‌ది. 2013లో మేరీకి ప‌ద్మ‌భూష‌ణ్, 2006లో ప‌ద్మ‌శ్రీ ఇచ్చారు. రెజ్ల‌ర్ విఘ్నేశ్ పొగ‌ట్‌, టేబుల్ టెన్నిస్ ప్లేయ‌ర్ మానిక్‌ బ‌త్రా, క్రికెట‌ర్ హర్మ‌న్‌ప్రీత్ కౌర్‌లు ప‌ద్మ‌శ్రీ అవార్డుల‌కు నామినేట్ అయ్యార‌ని తెలుస్తోంది. మొత్తం 9 మంది మ‌హిళా క్రీడాకారుల‌కే ప‌ద్మ అవార్డులు ఇవ్వాలంటూ క్రీడాశాఖ ప్ర‌తిపాద‌న చేసింది. ప‌ద్మ‌శ్రీకి నామినేట్ అయిన జాబితాలో హాకీ కెప్టెన్ రాణి రాంపాల్‌, మాజీ షూట‌ర్ సుమా శిరూర్‌, మౌంటెనీర్ సిస్ట‌ర్స్ తాషి, నుంగ్‌షీ మాలిక్ ఉన్నారు. హోంశాఖ‌లోని ప‌ద్మ అవార్డు క‌మిటీకి ఈ పేర్ల జాబితాను పంపారు. అవార్డులు గెలుచుకున్న వారి పేర్ల‌ను వ‌చ్చే ఏడాది గ‌ణ‌తంత్ర దినోత్స‌వ స‌మ‌యంలో ప్ర‌క‌టిస్తారు.

1217
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles