న్యూజిలాండ్‌కి భారీ టార్గెట్ విధించిన ఇంగ్లాండ్

Fri,November 8, 2019 12:40 PM

నేపియ‌ర్ : సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల‌ టీ20 సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌ నేడు నాలుగో మ్యాచ్ నేపియ‌ర్ వేదిక‌గా ఆడుతుంది. ఈ సిరీస్‌లో న్యూజిలాండ్ జోరు కొనసాగిస్తున్నది. తొలి మ్యాచ్ ఓడిన ఆతిథ్య జట్టు ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలుపొందింది. అయితే నేడు జ‌రుగుతున్న నాలుగో టీ20లో మొద‌ట బ్యాటింగ్ చేసిన‌ ఇంగ్లండ్ 20 ఓవ‌ర్ల‌కి గాను 3 వికెట్లు కోల్పోయి 241 ప‌రుగులు చేశారు. డీజే మ‌ల‌న్ 103( 51 బంతుల్లో; 9ఫోర్లు, 6 సిక్స్‌), ఇయాన్ మోర్గాన్ 91( 41 బంతుల్లో; 7 ఫోర్స్, 7 సిక్స్‌)లు ఇంగ్లాండ్ భారీ స్కోర్ సాధించ‌డంలో భాగ‌మ‌య్యారు. భారీ విజ‌య ల‌క్ష్యాన్ని చేధించేందుకు బ‌రిలో దిగిన న్యూజిలాండ్ కేవ‌లం 5 ఓవ‌ర్లలో వికెట్ న‌|ష్టానికి 57 ప‌రుగులు చేసింది. ఓపెనర్లు గ‌ప్తిల్ 23 (12 బంతుల్లో ; 3 సిక్స్‌), మున్రో 25 నాటౌట్ ( 13 బంతుల్లో; 3 ఫోర్లు) ఇంగ్లాండ్ బౌల‌ర్స్‌ని ఉతికి ఆరేసారు. ప్ర‌స్తుతం క్రీజులో మున్రోతో పాటు సీఫ‌ర్ట్ నాటౌట్ (2) ఉన్నారు ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ విజ‌యం సాధిస్తే సిరీస్ కివీస్ సొంతం అవుతుంది.

1505
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles