ధోని 12 ఏళ్ల కెప్టెన్సీపై అభిమానుల భావోద్వేగం..

Sat,September 14, 2019 02:24 PM

హైదరాబాద్: ‘మహేంద్ర సింగ్ ధోని’ పరిచయం అక్కర్లేని పేరు. అభిమానులు ముద్దుగా ఎంఎస్‌డీ, కెప్టెన్ కూల్ అని పిలుచుకుంటారు. ఇండియా క్రికెట్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా రికార్డులు సృష్టించిన ధోని ఈ మధ్య ఆడిన మ్యాచ్‌ల్లో అంతగా రాణించలేదు. మునుపటిలా ధనాధన్ షాట్‌లు ఆడడంలేదు. కానీ, ధోని అభిమానులు మాత్రం అతడి లేని జట్టును ఊహించలేకపోతున్నారు. ఈ క్రమంలో ధోనీ కెప్టెన్ అయిన క్షణాల్ని, ఆయన సాధించిన ఘనతలు గుర్తు చేస్తూ ‘హ్యాష్‌ట్యాగ్ 12 ఇయర్స్ ఆఫ్ కెప్టెన్ ధోని’ పేరుతో ట్విట్టర్‌లో ట్రెండ్ సృష్టిస్తున్నారు. ధోని కెప్టెన్సీ చేపట్టిన రోజు సెప్టెంబర్ 13, 2007. ఈ రోజు సెప్టెంబర్ 13 కావడంతో ధోని జట్టులో లేకపోవడం అభిమానుల్ని కలవరపరుస్తోంది. దీంతో వారు తమ అభిమాన క్రికెటర్ సాధించిన ఘనతల్ని ట్విట్టర్‌లో పోస్టు చేస్తూ, ఆయన గురించిన కీలక అంశాలను ప్రస్తావిస్తున్నారు.కాగా, ధోని యువ ఆటగాడిగా జట్టులోకి వచ్చిన కొన్ని రోజులకే కెప్టెన్ అయ్యాడు. అప్పటికే ఫుల్ ఫామ్‌లో ఉన్న ధోనికి సెలెక్టర్లు కెప్టెన్ భాద్యతను అప్పగించారు. జట్టులో సీనియర్ సభ్యులు సచిన్, ద్రావిడ్, కుంబ్లే, సెహ్వాగ్, గంగూలీ లాంటి హేమా హేమీలున్నప్పటికీ వారెవ్వరూ కెప్టెన్సీ స్వీకరించడానికి సుముఖత చూపించలేదు. అప్పటికే వీరంతా కెప్టెన్స్ అయిన విషయం తెలిసిందే. 2007 టీ-20 ప్రపంచకప్ టోర్నీ నుంచి కెప్టెన్‌గా ఎంపికైన ధోని మొదటి టీ-20 ప్రపంచకప్ గెలిచిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీకి ముందు ఇండియా టీ-20 మ్యాచ్‌లాడింది కేవలం ఒకటి మాత్రమే. ఈ ఫార్మాట్ ఏ మాత్ర అలవాటు లేని జట్టు ప్రపంచకప్ గెలవడం విశేషం. ఫైనల్‌లో పాక్‌ను చిత్తు చేసిన భారత్ ట్రోఫీని ముద్దాడింది.

దాంతో పాటు ధోని సారథ్యంలో ఇండియా 2011 వన్డే ప్రపంచకప్, 2013లో ఛాంపియన్ ట్రోఫీతో పాటు రికార్డు స్థాయిలో విదేశాల్లోనూ, స్వదేశంలోనూ అన్ని ఫార్మాట్‌లలో రికార్డులు సాధించింది. ధోని టీ-20, వన్డే ఫార్మాట్‌లో 2007 నుంచి 2016 వరకు, టెస్టుల్లో 2008 నుంచి 2016 వరకు జట్టుకు సారథిగా వ్యవహరించాడు. ధోని వన్డేల్లో 10వేలకు పైగా పరుగులు చేసిన నాలుగో ఇండియన్ ప్లేయర్. ధో్ని కెప్టెన్సీ స్వచ్చందంగా వదులుకున్నాడు. ఐపీఎల్ లోనూ ధోని చెన్నై తరఫున అనేక రికార్డులు సాధించాడు. ధోని తరువాత కెప్టెన్ భాద్యతలు చేపట్టిన విరాట్ కోహ్లి విజయవంతంగా జట్టును ముందుకు నడిపిస్తున్న సంగతి తెలిసిందే.2994
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles