తొలి వికెట్‌ కోల్పోయిన ఇంగ్లాండ్‌

Thu,September 12, 2019 05:16 PM

ఓవల్‌: ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ తలపడుతున్న యాషెస్‌ సిరీస్‌ చివరి మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్న ఓపెనర్‌ జో డెన్లీ(14)త్వరగానే పెవిలియన్‌ చేరాడు. సిరీస్‌లో బౌలింగ్‌తో అద్భుతాలు చేస్తున్న ప్యాట్‌ కమ్మిన్స్‌ అతని వికెట్‌ పడగొట్టాడు. ఆఫ్‌ స్టంప్‌కు అవతల వెళ్తున్న బంతిని ఆడబోయిన డెన్లీ సెకండ్‌ స్లిప్‌లో స్మిత్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. ఈ క్యాచ్‌ను స్మిత్‌ రెండు సార్లు డ్రాప్‌ చేసి మూడో సారి ఒడిసి పట్టుకోవడంతో కమిన్స్‌ ఖాతాలో వికెట్‌ పడింది.


ఈ సిరీస్‌లో ఇప్పటికే అత్యధిక వికెట్లు(24) తీసిన బౌలర్‌గా కమిన్స్‌ కొనసాగుతున్నాడు. కాగా, ఈ మ్యాచ్‌ ఇంగ్లాండ్‌కు ఎంతో కీలకం. సిరీస్‌లో 1-2తో వెనకబడ్డ ఆతిథ్య జట్టు మ్యాచ్‌ గెలిచి సిరీస్‌ను 2-2తో సమం చేయాలని భావిస్తోంది.

930
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles